జామిత్ర దోషములు
*జామిత్ర దోషములు*
*శ్లో:-* జామిత్రేచకరగ్రహేస్థిత ఇనో వైధవ్యమిందుఃస్తియా
సాపత్న్యంమరణం కుజస్సుతహృతిం సౌమ్యోవినాశం గురుః
శుక్రోవ్యాధి మధార్కజస్తుకురుతే మృత్యుం తమోబంధనం
శుక్లేందుచ్చ శుభగ్రహాశ్శుభఫలా శ్చేత్యాహురన్యేబుధాః
*తాత్పర్యము:-* రవి వివాహ లగ్నమున 7వ యింట నున్న వైధవ్యము వచ్చును. చంద్రుడున్న సవతి వచ్చును. కుజుడున్న మరణము, బుధుడున్న పుత్రహాని, గురుడున్న నాశనము, శుక్రుడున్న రోగము, శనియున్న మృత్యువు, రాహువున్న ఖైదు వధూవరులకు ప్రాప్తించును. కొందరు శుక్లపక్ష చంద్రుడున్ను సప్తమమున శుభగ్రహమున్న శుభమందురు.
*సంధికాలము విడువదగిన కాలములు*
*శ్లో:-* అబ్ధేషు క్షయవత్సరో నశుభకృత్పక్షోబ్దసంధౌ తధా
పంచాహానితుమాసయోర్దివసయోర్న క్షత్రయో ర్యోగయోః
యామార్ధం ఘటికాద్వయం కరణయోశ్చేల్లగ్న యోర్నాడికా
సంధ్యాయాం ఘటికాత్రయంద్విఘటికేత్యాజ్యాస్తుసంథౌనిశి
*తాత్పర్యము:-* సంవత్సరముల చివరి సంవత్సరము క్షయ సంవత్సరము, దాని సంధికాలము 15 రోజులు, మాససంధులకు 5 రోజులు, తిథులకు వారములకు నక్షత్రములకు యోగములకు సంధ్యయందు 4 ఘడియలు, కర సంధి యందు 2 ఘడియలు, రాశిసంధ్య యందు 1 ఘడియయు, నుదయాస్తమానముల సంధ్యల 3 ఘడియలున్ను, అర్ధరాత్రి సమయమున్ను శుభకార్యములకు పనికిరావు.
Comments
Post a Comment