నరకంలో శిక్షలు .....

నరకంలో శిక్షలు .....

ఈ లోకంలో మనష్యులు, తమ ......
క్షీణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలను చేస్తారు,
ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికి మృత్యువు
తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని
మన పురాణాలు బోధిస్తున్నాయి,*

ఈ భోగదేహం రెండు రకాలు .....

ఒకటి సూక్ష్మ శరీరం,
ఇది మనిషి ఆచరించిన
సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్ణ లోకాలకు చేరుతుంది,*

రెండవది యాతనా దేహము,
ఇది మానవుడు చేసిన పాప ఫలాలను అనుభవించడానికి నరక లోకాలకు చేరుతుంది,*

మృత్యువు తరువాత వెంటనే
కొత్త దేహము ధరించడం వీలుకాదు,
కొత్త దేహ ప్రాప్తికి ముందు జీవ. సూక్షిత
దుష్కృత. సుఖదుఃఖాల. ఫలితాలను
అనుభవించ వలసి వస్తుంది,*

శ్రీమద్భాగవతంలో .....
యాతనాదేహం అనుభవించే వివిధ శిక్షలు
వాటిని అమలు చేసే 28, నరకాల వర్ణన ఉన్నది,
వాటి సంక్షిప్త వివరణ .... చూద్దాం ..*

1. తామిస్ర నరకం :-
పరధనాపహరణ, పరస్త్రీ, పరపుత్ర హరణం,
వలన ఈ నరకం పొందుతాడు, ఇక్కడ
అంధకార బంధు, -- రమున పడవేసి
ఇనుప కర్రలచే బాదుతారు,*

2. అంధతామిస్ర నరకం :-
మోసగించి స్త్రీల ధనమును తీసుకున్నవారు,
కండ్లు కనిపించని చీకటిలో నరికిన
చెట్ల వలే నరకబడుదురు,*

3. రౌరవ నరకం :-
ఇతర ప్రాణులను చంపి,
తన కుటుంబమును పోషించుకున్న వారిని,
ఇక్కడ రురువులు అను జంతువులు
పాముల కన్న ఘోరముగా హింసించును,*

4. మహారౌరవ నరకం :-  
ఇతర. ప్రాణులను బాధించి
తన శరీరాన్ని పోషించుకునేవాడు
ఈ నరకానికి చేరుతాడు, పచ్చి మాంసము
తిను రురువులు, వారి మాంసమును
కండలు కండలుగా పీక్కుతినును,*

5. కుంభీపాక నరకం :-
సజీవంగా వున్న పశు పక్ష్యాదులను
చంపి వాటి మాంసాన్ని తిన్నవాడు
ఈ నరకాన్ని పొందుతాడు,
సలసల కాగే నూనెలో పడవేసి
గారెలవలే వేపుదురు,*

6.కాలసూత్ర నరకం :-
తల్లిదండ్రులకు, సద్ర్బహ్మణులకు, వేదాలకు,
ద్రోహం తలపెట్టినవారు ఈ నరకానికి వెళతాడు,
బాగా కాలిన రాగిలాంటి నేలపై నడిపిస్తూ ఉంటే సూర్యుడు అగ్నిజ్వాలలు కురిపిస్తూ
మాడ్చి వేయును,*

7. అసిపత్ర నరకం :-
వేదములు ధిక్కరించినవారు
ఈ నరకాన్ని పొందుతారు,
కొరడాలతో గొడ్డును బాదినట్లు బాధుచూ
సర్వాంగ -- ములను కత్తులతో కోసి
ఈ శిక్షలను అమలుపరుస్తారు,*

8. సూకర ముఖ నరకం :-
నేరము చేయకపోయినా నేరం చేశారని
దండించిన రాజులను, అధికారులను
చెరకు గడలవలే గానుగలో పెట్టి తిప్పదురు,*

9. అంధకూప నరకం :- 
చిన్న చిన్న ప్రాణులను చంపిన వానిని
పాములు, నల్లులు, దోమలు, చీమలు,
మూకుమ్మడిగా దాడిచేసి హింసించును,*

10. క్రిమి భోజన నరకం :-
అతిథులకు అనాదలకు అన్నం పెట్టక
తన పొట్ట నింపుకొన్నవాడు, క్రిములతో నిండిన
లక్షయోజనముల కుండలో పడవేయుదురు,*

11. సందంశ. నరకం :-
ఇతరుల ధనధాన్యాలను,
బంగారము, రత్నములు, దోచుకున్నవారిని, మండుతున్న. ఇనుప కడ్డీలతో పొడుస్తూ
పటకారుతో చర్మము పీకుట వంటి శిక్షలు వేస్తారు,*

12. తప్తోర్మి నరకం :-
సంభోగించరాని స్త్రీలతో సంభోగించిన
మగవాడు, అట్టి మగవారితో సంభోగించిన స్త్రీలు,
మండుతున్న ఇనుప స్త్రీ పురుష ప్రతిమలచే
కౌగిలించ చేయబడుదురు,*

13. వజ్ర కంటక నరకం :-
పశువులతో ఇతర జంతువులతో సంభోగించిన
వారిని, ఇనుప చువ్వలలాంటి ముళ్ళున్న బూరుగు చెట్టు మీదకి ఎక్కించి కిందకు లాగుతారు,*

14. శాల్మలి నరకం :-
కుల మర్యాద పాటించని రాజు,
లేక రాజోద్యోగి, చీము నెత్తురు తలవెంట్రుకలు
గోళ్ళచే నిండివున్న నదిలో త్రోయబడును,*

15. నైతరణీ వుయోద నరకం :-
శౌచము మొదలైన ఆచారములను
పాటించని వారిని మలమూత్రములచే
నిండిన చెరువులో పడవేయుదురు,*

16. ప్రాణదోధ నరకం :-
కుక్కలను గాడిదలను పెంచి
వాటయనే వృత్తిగా పెట్టుకున్న బ్రహ్మణులను
అంపకోలలచే వేటాడి హింసించెదరు,*

17. విశవిశస నరకం :-
దంభ యజ్ణములు చేసి
పశుపక్ష్యాదులను హింసించు వార్ని,
ప్రాణాంతకమైన రకరకాల హింసలకు
గురిచేసి హింసించేదరు,*

18. లాలాభక్షణ. నరకం :-
కుల భార్యచే వీర్య సానము చేయించినవారిని,
వారిచే వీర్యపానము చేయించి అతి
కిరాతకంగా హింసించెదరు,*

19. సారమోయోదన. నరకం :-
ఇండ్లు తగులపెట్టుట, విషము పెట్టుట,
బిడార్లు దోచుట, గ్రామస్థులను దోచుకొను
వారిని, వజ్రముల వలే కరకంగా ఉన్న కోరలు
గల ఏడువందల జాగిలములు
ఒకేసారి పీక్కోని తినును,*

20. అలీచారయ నరకం :-
అబద్ద సాక్ష్యాలను చెప్పి,
లావాదేవీలలో మోసం చేసిన వారిని,
వంద యోజనముల ఎత్తయిన పర్వత శిఖరముల
నుండి పడద్రోసి పచ్చడిగా చేయబడుదురు,*

21 రేతః పాన నరకం :-
వ్రతనిష్టలో వుండి మధ్యపానము చేసిన బ్రహ్మణులు సోమ -- పానము చేసిన క్షత్రియ వైశ్యులను
బాగా కరిగిన ఇనుమును వారిచే త్రాగింతురు,*

22. క్షాంకర్థ. నరకం :-
తనకన్న అధికులను పెద్దలను
తిరస్కరించు వారిని తల క్రిందులుగా వ్రేలాడదీసి, నానా బాధలు పెట్టి హింసించెదరు,*

23. రక్షో గణభోజన నరకం :-
నరమేధములు చేయువారిని, నరమాంసము, పశువుల మాంసము తిను స్త్రీ పురుషులను, వాడిగల ఆయుధములచే ముక్కలు
ముక్కలుగా నరికివేసెదరు,*

24. శూల ప్రోత నరకం :-  
నిరపరాధులైన అడవి జంతువులను,
ఊర పశువులను నమ్మించి పొడిచి
చంపినవారిని, శూలములచే పొడుస్తూ
కంబములకు వ్రేలాడదీయురు,*

25. దండశూత. నరకం :-
ప్రాణకోటికి భయము కలిగించు ఉగ్రస్వభావులను
అయిదు ఏడు తలల పాములు అనేకం కలిసి
ఎలుకలను హింసించినట్లు హింసిస్తాయి,*

26. మలనిరోధన నరకం :-
ఇతరులను ఏ నేరము చేయని వారిని,
గదులలోను, నూతులలోను, బంధించినవారిని, విషాగ్నులు మండించి, విషపు పొగలు పెట్టి
ఉక్కిరి బిక్కిరి చేయుదురు,*

27. పరావర్తన నరకం :-  
అతిధులను, అభ్యాగతులను,
మోసంతో హింసించినవారిని కనుగ్రుడ్లను
కాకులచే గ్రద్దలచే పొడిపింతురు,
28. సూచిముఖ నరకం *

ధన మదాంధముతో అందరిని
చిన్న చూపు చూసిన వానిని శరీరమును
దబ్బలం లాంటి సూదులతో బొంతను
కుట్టినట్టు కుట్టెదరు.
        .....

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: