హోమాలు - ఫలితాలు

🔯 హోమాలు -    
       ఫలితాలు🔯
          🚩🌳🚩

మనిషి తనకు తెలిసో, తెలియకో ఈ జన్మలోనూ, గత జన్మలోను చేసిన పాప కర్మలను తొలగించుకోవడానికి స్వగృహంలో హోమాలు చేయాలి లేదా ఇతరత్రా జరుగుతున్న హోమ క్రతువుల్లో పాలుపంచుకోవాలని పురాణ గ్రంధాలు సూచిస్తున్నాయి.

జీవులు తప్పనిసరిగా ఎంతో కొంత పాప కర్మలను అనుభవించవలసి వున్నది. అయితే వాటిని హోమములను చేయడం ద్వారా, హోమాలలో పాల్గనడం ద్వారా నివారించుకొని శుభఫలితాలు పొందవచ్చును.

హోమాలు చేయడానికి ప్రత్యేక విధివిధానాలు వున్నవి. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క అనుబంధ హోమం నిర్దేశించబడింది. ఆ ప్రత్యేక హోమం చేయడం వలన ఆ దేవత కటాక్షంతో శుభఫలితాలు అందుకోవచ్చును.
మనం ఏ దేవతని తలచి ఏమి ఆశిస్తామో నిశ్చయంగా ఆ కోరికను దేవత నెరవేరుస్తుంది. 

అయితే హోమాలను భక్తి శ్రధ్ధలతో ఆచరించాలి. మనసులో చంచలత్వం
వుండరాదు.

ఈ ఆధునిక యుగంలో కూడా హోమాలు చేయడానికి పాతకాలపు గ్రంధాలలో అనేక పధ్ధతులు వివరించబడి వున్నవి. 
గణపతి హోమం, సుదర్శన హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, వాస్తు హోమం అని అనేకం వున్నవి.
ఒక్కొక్క హోమం మనకి ఒక్కొక్క ఫలితం కలిగిస్తుంది. దేహారోగ్యం, ఐశ్వర్యం
మనశ్శాంతి, దీర్ఘాయువు, నిరంతర
ఉద్యోగం, సంతానం, శతృ విజయం
వ్యాపారభివృధ్ధి మొదలైన శుభఫలితాలకోసం హోమాలు చేసి ఫలితాలు పొందుతున్నారు.
అన్ని హోమాలను మనం నివసించే గృహాలలో
చేయరాదు గృహాల్లోనే హోమాలు చేయాలనే నిబంధన లేదు. దేశ సౌభాగ్యం కోసం, మనం నివసించే ఊరి శుభం కోసం ఆలయాలలోను, మండపాలలోను పెద్ద పెద్ద హోమాలు జరిగే సమయంలో మన శక్తి కి తగిన హోమ ద్రవ్యాలను తీసుకుని వెళ్ళి అక్కడ వినియోగించవచ్చును. ఆవిధంగా చేయడానికి కూడా ఆర్ధిక స్తోమత లేని వారు పని సహాయం చేయవచ్చును. ఆలయాలలో జరిగే హోమాల వలన కలిగే శుభ ఫలితాలు ప్రజలందరికీ చేరుతాయి. హోమానికి ఉభయదాత ఒకరే అయినా ఆ హోమంలో పాల్గొన్న అందరికి శుభ ఫలితాలు నిశ్చయంగా చేరుతాయి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12