శ్యామల నవరాత్రి
_*శ్యామల నవరాత్రి*_
🫐🫐🫐🫐🫐🫐🫐🫐🫐🫐🫐🫐
శ్రీ విద్య సంప్రదాయములో 4 నవరాత్రులు మొత్తముచిత్రములో వసంత నవరాత్రి ఆషాడము లో వారాహి నవరాత్రి
అశ్వయుజములో శారదా నవరాత్రి
మాఘము లో శ్యామల నవరాత్రి
చైత్ర అశ్వయిజ నవరాత్రులు అందరకీ తెలుసు మిగిలిన రెండు గుప్త నవరాత్రులు కేవలము సంప్రదాయం లో ఉన్నవారికే పరిమితము అయ్యాయి. అలా కాకుండా మూలమంత్ర అనుష్ఠానము లేని వారు కూడా ఈ గుప్త నవరాత్రులు చేసుకోవచ్చును
మాఘ మాసం ములో వచ్చేవి
శ్రీ శ్యామల నవరాత్రులు
శ్యామలా దేవి లలిత పరబట్టరిక యొక్క మంత్రిని ఈ తల్లిని దశ మహా విద్యల్లో మాతంగి అని పిలుస్తారు. ఈవిడకు నీల సరస్వతి, శుక శ్యామల, సారిక శ్యామల,రాజ మాతంగి, లఘు శ్యామల, గేయ చక్ర వసిని అని ఎన్నో నామాలు ఉన్నాయి
ఈ సంవత్సరము
25 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు శ్యామల దేవి గుప్త నవరాత్రులు
మూల మంత్రము లేని వాళ్ళు ఉపదేశము లేని వాళ్ళు పెద్దలు పిల్లలు సర్వులు చేసుకోదగ్గ
శ్యామల షోడశ 16 నామాలు ఇస్తున్నాము శ్రీ గురువుల కృపతో
అందరూ చేసుకోండి అమ్మ అనుగ్రహము పొందండి
సంగీత యోగిని
శ్యామా
శ్యామలా
మంత్ర నాయిక
మంత్రిని
సచివేశి
ప్రధానేశీ
శుక ప్రియ
వీణా వతి
వైణికి
ముద్రిని
ప్రియక ప్రియా
నీప ప్రియ
కదంబెశి
కాదంబ వనవాసిని
ఈ 16 నామాలు నిత్యము కూడా అందరూ చేసుకోవచ్చును
దీని వలన అమ్మ అనుగ్రహము కలిగి సమస్తము మన వశము అవుతుందని ఫల శ్రుతి
సర్వం శ్రీ గురు త్రిపురాంబ చారణరవిందర్పణ మస్తు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Comments
Post a Comment