పూర్వీకులు-శాప ఫలితం*

*పూర్వీకులు-శాప ఫలితం*

కొంతమంది జాతకులు మాకు పూర్వికులు ఆస్తులు వస్తాయా, వాటిని అనుభవించగలమా, పూర్వికులు నుండి దోషాలు ఏమైనా వస్తున్నాయా అని అడుగుతూ ఉంటారు. దీని కొరకు పూర్వ పుణ్య కర్మ ఫలితాన్ని పరిశీలించాలి. జాతకంలో పూర్వ జన్మ పుణ్యం అనేది పంచమ స్థానం, కర్మ స్థానం అనేది దశమ స్థానం పరిశీలించాలి. ఈ రెండు స్థానాల అధిపతులు పూర్వీకులను సూచించే రాహు కేతువులతో కలిసి ఉంటే పూర్వీకుల శాపం ఉన్నట్టు తెలుసుకోవాలి. పూర్వికులు ఏదైనా శాపాన్ని పొంది వారు అనుభవించగా మిగిలిన దాన్ని వారసులకు పంచుతారు దీనిని పూర్వీకుల శాపము అంటారు.పంచమ దశమాధిపతులు రాహు కేతు నక్షత్రాలలో స్థితి పొంది, పంచమ దశమ స్థానాలలో రాహు కేతువులు ఉన్నప్పడు ఈ దోషం ఉందని అర్థం. ఉదాహరణకు మకర లగ్న జాతకులకు పంచమ స్థానంలో శుక్రునితో కలిసి రాహువు ఉండి శుక్రుడు రాహు నక్షత్రంలో ఉంటే ఈ దోషం ఉందని అర్థం. మరొక నియమం ప్రకారం కుంభ లగ్న జాతకులకు దశమాధిపతి అయిన కుజుడు మేషంలో స్థితి పొంది కేతు నక్షత్రంలో ఉంటే పూర్వీక శాపం ఉంది అని అర్థం. ఈ పంచమాధిపతి కానీ దశమాధిపతి కానీ రాహు నక్షత్రంలో ఉంటే తండ్రి వైపు నుండి పూర్వీక కర్మ ఉంది అని, అదేవిధంగా పంచమాధిపతి కానీ దశమాధిపతి కానీ కేతు నక్షత్రంలో ఉంటే తల్లి వైపు నుండి పూర్వీకు కర్మ వచ్చినట్లుగా తెలుసుకోవాలి. దీనివలన జీవితం పై విరక్తి, ఆర్థికంగా ఎదగలేకపోవడం, ఆర్థిక అభివృద్ధికి నిరంతర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితాలు రాకపోవడం, సరియైన జీవిత భాగస్వామి లభించకపోవడం, సంతానం వల్ల సమస్యలు, చేసే వృత్తిలో ఆటంకాలు, ఒక మంచి పని చేసే విషయంలో అనేక ఆటంకాలు ఏర్పడడం, ఆ పనులు నిలిచిపోవడం ఇటువంటి ఆటంకాలు పదేపదే జరుగుతూ ఉంటాయి. కుటుంబంలో సంతాన సమస్యలు తరచుగా ఎదుర్కొంటూ ఉండడం, సంతాన భాగ్యానికి సమస్యలు రావడం, పుట్టిన బిడ్డ మరణించడం, వారసులు లేకుండా పోవడం, ఒకవేళ సంతానం ఉన్న ఆ పిల్లలు మానసిక బుద్ధి వికసించకపోవడం, బుద్ధిమాంద్యత, మరికొన్ని కుటుంబాలలో 56 సంవత్సరాలు పైబడి ఆయుష్షు లేకపోవడం, ఈ లక్షణాలు పూర్వీక కర్మ ఉందని తెలియజేస్తాయి. శని భగవానుడు రాహువుతో కానీ కేతువుతో కానీ లేదా రాహు కేతు నక్షత్రాలలో ఉన్నప్పుడు కర్మ  ఈ జన్మలో కనెక్ట్ అయిందని అర్థం. ఉదాహరణకు తులాలగ్నానికి తృతీయ స్థానంలో శని భగవానుడు ఉండి రాహు లేదా కేతు క్షేత్రంలో ఉంటే జాతకునికి పూర్వీకులు శాపంతో పాటు తాను ముందు జన్మలో చేసుకున్న కర్మ కూడా ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే శని భగవానుడు తులాలగ్నానికి పంచమాధిపతి కావున పూర్వీకుల కర్మ, తాను చేసిన కర్మ కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇదే తులాలగ్నాలకి దశమాధిపతి అయిన చంద్రుడు మిధునంలో రాహువుతో కానీ రాహు నక్షత్రంలో కానీ ఉంటే తండ్రి వైపు నుండి కర్మ వచ్చినట్టు అర్థం. పంచమ దశమాధిపతులు రాహు కేతువులతో కలిసినప్పుడు అనగా 5 డిగ్రీల దూరంలో ఉన్నపుడు మాత్రమే ఈ దోషం వర్తిస్తుంది ఇది గమనించాలి. పంచమ దశమాధిపతులు రాహు కేతువులతో ఐదు డిగ్రీల లోపు ఉంటూ రాహుకేతు నక్షత్రాలలో ఉండి శని భగవానునికి కనెక్ట్ అయితే పూర్వీకుల కర్మ జాతకుడు అనుభవించాలి అని అర్థం. దీనికి పరిహారంగా కులదేవత ఆరాధన,ఇష్ట దైవాన్ని ప్రార్థించడం అనేవి సామాన్యంగా అందరికీ చెప్పే పరిహారాలు. కానీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సరైన పరిహారాలు పాటించడం వలన ఈ పూర్వీకుల కర్మ ఈ జాతకుడుతో ఆగుతుంది. తాను మిగిలిన జీవితం బాగుంటుంది తరువాత వారసులకి ఈ దోషం రాకుండా ఉంటుంది.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: