అర్జునుడి శంఖం పేరు తెలుసా

_*అర్జునుడి శంఖం పేరు తెలుసా?*_
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

సాగరాన్ని అమృతం కోసం మధించిన సమయంలో శ్రీలక్ష్మీదేవితో పాటు చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షం, శంఖం ఆవిర్భవించాయి. వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు పాంచజన్యం అనే శంఖాన్ని ధరించాడు. అందుకనే శంఖానికి పవిత్రత చేకూరింది. లక్ష్మీదేవితో పాటు జన్మించినందున ఆమె రూపమని కొలుస్తారు. శంఖం నుంచి వెలువడే శబ్దం అనేక రుగ్మతలను నివారిస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జున రథసారథిగా జగన్నాటక సూత్రధారియైన శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించగా ధనంజయుడు ‘ దేవదత్తం’ అనే శంఖాన్ని పూరిస్తాడు. అలాగే పాండవ అగ్రజుడైన ధర్మరాజు 'అనంత విజయం’ అనే శంఖాన్ని, భీముడు 'పౌండ్రకమ్', నకులుడు 'సుఘోషం'.. సహదేవుడు 'మణిపుష్పకం' అనే శంఖాలను పూరించారు. 

శంఖం ఆవిర్భావానికి సంబంధించి బ్రహ్మవైవర్త పురాణంలో మరో కథ ఉంది. శంఖచూడుడనే రాక్షసుడు బ్రహ్మ అనుగ్రహంతో కృష్ణకవచాన్ని పొందాడు. తర్వాత స్వర్గంపై దండెత్తగా ఇంద్రుడు ఆ శంకరుడిని శరణు కోరాడు. శంఖచూడుడిని నిర్మూలించేందుకు విష్ణుమూర్తి సాయాన్ని పరమేశ్వరుడు కోరాడు. దీంతో విష్ణువు బ్రాహ్మణ రూపంలో శంఖ చూడుని అభిమానాన్ని పొంది కృష్ణకవచ ఉపదేశం పొందాడు. తరువాత శివుడు ఆ రాక్షసున్ని సంహరించాడు. అతని దేహం సముద్రంలో పడిపోగా ఆయన సతీమణి తులసి తన పాతివ్రత్య మహిమతో శంఖంగా మార్చిందని తెలుస్తోంది. 

శంఖంలో పోసిన నీరు కొద్ది గంటల తరువాత శక్తిగల నీరుగా మారుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దీని వల్లనే శంఖంలో పోస్తేనే తీర్థం అన్న నానుడి వచ్చింది. శంఖాల్లో పలు రూపాలున్నాయి. దక్షిణభాగం తెరచివుంటే దక్షిణావర్త శంఖం అంటారు. ఇది శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. పూజామందిరంలో శంఖాన్ని కింద పెట్టకుండా పళ్లెంలో పెట్టాలి. శంఖం ఊదడం కూడా సాధన ద్వారానే అలవడుతుంది.

*శ్రీ ప్రతాపరుద్ర ఆంజనేయ స్వామి వారి దేవస్తానము, రుద్రవరం*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: