అభివృద్ధి-పతనం.. జాతక విశ్లేషణ

*అభివృద్ధి-పతనం.. జాతక విశ్లేషణ*

ఒక జాతకుడు యొక్క జీవితం అభివృద్ధి దిశ లో నడుస్తుందా పతనం దిశలో ప్రయాణిస్తుందా, లేదా సామాన్య జీవితం కొనసాగిస్తాడా అనేది జ్యోతిష్యరీత్యా మూడు భావాలు నిర్ధారణ చేస్తాయి. అవి 6 ,8 ,12. భావాలు ఇవి దుస్థానాలుగా చెబుతారు. ఈ మూడు స్థానాలు జాతకుడిని పతనం వైపు తీసుకుని వెళ్ళవచ్చు లేదా అత్యంత రాజయోగాన్ని ఇచ్చి సమాజంలో ఉన్నత స్థాయిలో జీవితాన్ని ఇవ్వవచ్చు. ఉదాహరణకు ఆరవధిపతి ఏదైనా ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి అధిపతి ఆరవ అధిపతికి ద్వి ద్వాదశ స్థితికాని, నాలుగో స్థానం కానీ 6 లేదా ఎనిమిదో స్థానం కానీ ఉండరాదు. ఈ విధంగా ఉంటే జాతకుడు శత్రువుల కారణంగా పతనమవుతారు, రోగాలు పీడిస్తాయి, రుణ బాధలు ఎక్కువవుతాయి. అదేవిధంగా ఆరవధిపతికి తను ఉన్న రాశ్యాధిపతి తనతో కలిసి ఉన్నా ,సప్తమ స్థానంలో ఉండి సమసప్తక దృష్టి ఉన్నా , నవ పంచక స్థితి ఏర్పడినా ఆ జాతకుడికి శత్రువులు ఉండరు. రుణ బాధలు ఉండవు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య స్థితి ఉండదు. ఇదేవిధంగా అష్టమాధిపతి విషయంలో కూడా పరిశీలించాలి. అష్టమాధిపతికి రాశ్యాధిపతికి సంబంధం పైన చెప్పిన విధంగా శుభకరంగా ఉంటే జాతకుడికి ఆరోగ్యకరమైన ఆయుష్షు పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి చాలా వేగంగా తక్కువ కాలంలోనే అభివృద్ధి దిశలో జీవితం ప్రయాణిస్తుంది. అలా కాకుండా ఎనిమిదో అధిపతి తను ఉన్న రాశ్యాధిపతికి ఉన్న సంబంధం సరిగా లేకపోతే ఆయుష్ మీద ప్రభావం చూపిస్తుంది. ఆకస్మిక నష్టాలు ఏర్పడతాయి. ఆకస్మికంగా పతనం వస్తుంది. పువ్వుల అమ్మినచోట కట్టెలమ్ముతున్నారు.. ఓడలు బళ్ళు అవుతాయి.. బళ్ళు ఓడలవుతాయి.. అనే సామెత ఈ అష్టమ అధిపతి విషయంలో సరిపోతుంది. ఇదేవిధంగా 12వ అధిపతి విషయంలో కూడా పరిశీలించాలి. 12వ అధిపతికి రాశ్యాధిపతికి సంబంధం బాగుంటే వీరికి దైవ బలం బాగుంటుంది. అన్నింటా విజయాలు సాధిస్తారు రోగాలు ఉండవు. సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. అదేవిధంగా 12వ అధిపతికి రాశ్యాధిపతికి సంబంధం పైన చెప్పిన విధంగా సరిగా లేకపోతే చేసే పనులు నష్టాలు ఎక్కువవుతుంటాయి అపజయాలు కలుగుతాయి దైవ బలం తక్కువగా ఉంటుంది ఆరోగ్యం బాగుండదు. జీవితంలో స్థిరపడడం కోసం అనేక ఊరులు మారుస్తూ ఉంటారు. ఎక్కడా సరైన స్థిరత్వాన్ని పొందలేకపోతుంటారు. ఇక్కడ ప్రధానమైన ఒక విషయాన్ని గమనించాలి. పై మూడు విషయాలలోనూ ఏదో ఒక అధిపతి అనగా 6 లేదా 8 లేదా 12 అధిపతులు కనీసం ఒకరైన సరే పైన చెప్పిన విధంగా అనుకూలంగా ఉంటే జీవితంలో పెద్ద పెద్ద ఇబ్బందులు లేకుండా సజావుగా నడుస్తుంది. ఇద్దరు అధిపతులు అనుకూలంగా ఉంటే జీవితం ఇబ్బందులు ఏమి లేకుండా సంతోషంగానే ఉంటుంది. ముగ్గురు అధిపతులు అనుకూలంగా ఉంటే ఆనందకరమైన జీవితాన్ని , అన్ని రకాల సుఖసంతోషాలను పొందగలుగుతాడు. పై మూడు స్థానాలు వ్యతిరేకంగా ఉంటే మాత్రం ఎన్ని రాజయోగాలు ఉన్నప్పటికీ జాతకుడు యొక్క పతనం ఖచ్చితంగా జరుగుతుంది. జాతకంలో విపరీత రాజయోగాలు ఉన్నప్పుడు ఈ దుస్తానధిపతులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వాటి ఫలితాలు బలహీనమవుతాయి. అనగా 6 8 12 అధిపతులు ఆరులో కానీ 8లో కానీ 12 లో కానీ ఉన్నప్పుడు అనగా హర్షయోగం గానీ సరళ యోగం కానీ విమల యోగం కానీ ఉన్నప్పుడు పై దుష్ఫలితాలు జాతకుడు పైన పని చేయవు. లేదా 6 8 12 స్థానాలు వాటి స్థానాల్లోనే స్థితి పొందినప్పుడు పై దుష్ఫలితాలు జాతకుని పైన ప్రభావం చూపించవు. ఈ దుస్తానధిపతులు పైన చెప్పినట్టు ఇబ్బందికరమైన స్థానంలో ఉన్నప్పుడు ఏ శుభగ్రహ దశలు వచ్చినప్పటికీ అనగా గురుడు శుక్రుడు బుధుడు వీటి యొక్క దశలు జరుగుతున్నప్పటికీ కూడా ఎటువంటి సత్ఫలితాలు జాతకుడు పొందలేడు. ఆరు ఎనిమిది 12 అధిపతులు ఉచ్చ స్థానంలో ఉండరాదు.నీచ స్థానంలో ఉంటే నష్టాలు ఉండవు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: