పైతృమేధిక కర్మలో గొదాన విశిష్టత

పైతృమేధిక కర్మలో గొదాన విశిష్టత

వైతరణి గొదానమ్ ఎందుకు చేయాలి..?

మురికిగా వున్నాయి 3 సార్లు 3 మునకలు 3 సెకన్లలొ కూడ వెయకుండా నదిలో స్నానం మానేసి పంపులొ చేసి కర్మ ఆచరించే ఈ రోజుల పరిస్థితి లో .....అందరూ తెలుసుకోవాలి .

100 యోజనాలు . 
ఒక యోజనం 8 మైళ్ళు.. అంటే 800 మైళ్ళు సుమారు 1300 కిలోమీటర్ల వైశాల్యం..వైతరణి వైశాల్యం వుంటుంది.

 గంతించిన జీవి
ఇంత నదిని ఖచ్చితంగా దాటాలి..మరి సులభ మార్గం .. వైతరణి గో దానం.......

కట్ట తోటకూర 
కిలో పాత బియ్యం పెట్టి గో పోషణ చేసిన ఫీలింగ్ ఇచ్చె సో కాల్డ్ ఫెల్లొస్ కి ఉపయోగపడే వివరణ..

500 రూపాయల అద్దె గో దానం 
దానితో 2 ఫోటోలు ఒక వీడియో .. 
దానం ఇచ్చిన గోవు నీది కాదు..తీసుకున్న వాళ్ళు గోవును తీసుకుని వెళ్లరు.. 
అంటే అంతా అబద్ధం.
ఇది మహా పాపం.

ఇంకొక ఉత్తమ దౌర్భాగ్యమ్.. పాలు ఇవ్వని పేడ వెయ్యని వెండి గోవు.. దీని పరిస్థితి కొనబొతే కొరివి అమ్మబొతె అడవి.

ఇంకా నెల నెల గ్రాసమ్ లేదా జీవిత చందా అని గుళ్ల్ళకి ఆశ్రమాలకి కట్టాం అని తప్పించుకునే వారు కొంత మంది..ఇక్కడ ద్రవ్యం ఖచ్చితంగా ఉపయోగిస్తే మంచిదే..కానీ నేడు ఉపయోగిస్తారా లేదా చెప్పలేని పరిస్థితి

కర్మ అచరించేటప్పుడు కర్త గుర్తు ఉంచుకొవలసిన విషయం బంధువులను.. బ్రాహ్మణ్ణి లేదా వంట వాళ్ళని ఉద్ధరించటము కోసం చేశాను అని కాక ...

గతించిన తల్లి/తండ్రి కి ఉత్తమ గతులు కలగాలని కర్మ చేయాలి.
తద్వారా వంశం అభివృద్ది వుంది అని.. గుర్తు ఉంచుకొవాలి.

గోదానము అనే కాదు... పైతృక కర్మ అన్నీ విషయాలు అంతే.. 

వరుసగా 24 కేశవ నామాలు రాని వాడు కూడ శాస్త్రమ్ గురించి మాట్లాడేవాడే..

శాస్త్రాన్ని తమ ఇష్టం వచ్చినట్లు గా పెట్టిస్తున్న వైనం... చివరి మాట ఏదైతే వుందో అది సత్యం... మరణించిన వానికి తన ప్రయాణం ఎలా వుంటుందో తెలియదు.

భవిష్యత్తు కోసం డబ్బులు ఆస్తులు దాచుకొమని చెప్పే మన పెద్దలు(అందరూ కాదు) పుణ్యం సంపాదనలొ వెనుకనే పడ్డారు.

మా నాన్న చెప్పాడు 
మా అమ్మ చెపింది అని పోయిన వాళ్ళ మీద వేసి స్థొమత వున్నా తప్పించుకు తిరిగే కొడుకులకు ఇది అంకితం.. 

ఉత్తమత అనేది పుట్టుకతో కాదు సంస్కారం తో అని మనకి శాస్త్రం చెబుతుంది.

పైన మాటలు కానీ వీడియోలో మాటలు కానీ ఎవరి సొంత వాక్యాలు కావు..అంతా పురాణ వచనం..అధార సహితము..

గమనిక: నిజంగా స్థొమత లేని వారి ప్రస్తావన వేరు.

ధర్మో రక్షతి రక్షిత:.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: