గృహిణి " మహారాణి
*_ॐ卐 -|¦¦| సుభాషితమ్ |¦¦|- ॐ卐_*
𝕝𝕝 శ్లో 𝕝𝕝 *న గృహం గృహమిత్యాహు:*
*గృహిణీ గృహ ముచ్యతే*
*గృహం తు గృహిణీ హీనమ్*
*అరణ్యసదృశం మతమ్ ౹౹*
𝕝𝕝 తా𝕝𝕝 *పరివారం, సేవకగణము, వస్తు వాహనములు, ధనకనకరాసులు, సిరిసంపదలతో తులతూగుతున్నప్పటికినీ ఆ "ఇల్లు" వాస్తవంగా "గృహము" అని వ్యవహరింపబడదు. మహాలక్ష్మిని పోలిన "గృహిణి " మహారాణిలా తిరుగుచున్నప్పుడే ఆఇంటిని నిజమైన గృహముగా పరిగణిస్తారు. ఇంటికి దీపం ఇల్లాలే గదా! ఓర్పు, నేర్పు, సమర్ధత, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత, దయ, ధైర్యము, స్థైర్యము మూర్తీభవించిన "గృహిణి" లేని ఆ గృహం అడుగడుగునా భయానకమైన అరణ్యాన్ని తలపిస్తుంది. కళాకాంతులు, శాంతి సౌభాగ్యాలు లేక వెలవెలపోతుంది. అందుకనే "ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే యీ జగతికి జీవనజ్యోతి" అన్నాడో సినీకవి. (సుభాషితరత్నకోశః)*
Comments
Post a Comment