ధన యెాగాధ్యాయము
*ధన యెాగాధ్యాయము*
ఏ యెాగమున పుట్టినవాడు నిస్సంశయముగా ధనవంతుడగునునో అట్టి ధనయెాగమును చెప్పుచున్నాను. వినుము. పంచమము శుక్రక్షేత్రమై (వృషభ, తులలు) దానియందు శక్రుడుండి, లాభమున బుధుడొక్కడుండి, లాభము చంద్ర కుజ గురులతో కూడియున్న బహువిత్తవంతుడగును. పంచమము రవిక్షేత్రమై (సిహము) రవి అక్కడుండి, లాభమందు శని చంద్ర గురులున్న మహాధనికుడగును. శనిక్షేత్రము (మకర, కుంభము) లందు శనియుండి లాభమున రవి చంద్రులున్న ధనవంతుడగును. పంచమము గురుక్షేత్రమై (ధనుర్మీనములు) లాభమున బుధుడున్న ధనవంతుడగును. పంచమము కుజక్షేత్రమై కుజుడక్కడనే యుండి, లాభమున శుక్రడున్నచో ధనవంతుడగును. పంచమము కర్కాటమై చంద్రుడుండి, లాభమున శనియున్న ధనికుడగును. సింహము లగ్నమై అక్కడ రవియుండి, కుజ గురు సంబంధమున్న ధనవంతుడగును. కర్కాటకము లగ్నమై చంద్రుడక్కడుండి, బుధ గురులతో కూడినా, చూడబడినా ధనవంతుడగును.
కుజక్షేత్రము లగ్నమై అందు కుజుడుండి, బుధ రవి శుక్రుల సంబంధమున్న శ్రీమంతుడగును. కన్యామిథునములు లగ్నమై, బుధుడుండి, శనిగురుల సంబంధమున్న జాతకుడు ధనికుడగును. ధనుర్మీనములు లగ్నమై బుధకుజుల సంబంధమున్న జాతకుడు ధనికుడగును. తులావృషభములు లగ్నమై, శుక్రుడుండి, శని బుధుల సంబంధమున్న ధనవంతుడగును. మకర కుంభములు లగ్నమై, అక్కడ శనియుండి, కుజగురు సంబంధమున్న జాతకుడు ధనవంతుడగును. కలిసిఉండుట, చుాచుట - ఈ రెంటిని సంబంధమందురు.
పంచమనవమాధిపతులు విశేషముగా ధనము నిచ్చువారు. వారితో కలసి యున్న గ్రహములుకూడ తమతమ దశలలో ధనప్రదులగుదురు. శుభాశుభ గ్రహములయెుక్క సంయెాగమువలన కలిగిన బలాబలములను విచారణచేసియే దైవజ్ఞులు ఫలము చెప్పవలెను.
Comments
Post a Comment