శుభస్థానములు*
*శుభస్థానములు*
శ్లో:- స్వోచ్చస్థానగతో వివాహసమయే మూలత్రికోణస్థితః
స్వక్షేత్రే యది సంస్థితశ్చ బలవాన్ మిత్రాలయస్థోపివా
ద్యూనాఖ్యంచ విసృజ్య కేంద్రమితరత్కేంద్ర త్రికోణస్థిత
స్సౌమ్యోవాగురురేవవా సురగుర్హంత్యేవదోషార్బుదమ్
తాత్పర్యము:- బుధ, గురు, శుక్ర గ్రహములు స్వస్థానోచ్చలో నున్నప్పుడు, మూలత్రికోణములందున్నప్పుడు, మిత్రక్షేత్రములందున్నప్పుడు, స్వక్షేత్రములలోనున్నప్పుడు లగ్నమందుగాని, చతుర్థ, పంచమ, నవమ, దశమస్థానములందుగాని బుధ, గురు, శుక్రులలో యే యొక్కరైనగాని కొంతమందిగాని యున్నచో యెన్ని యితర దోషపరంపరలు 10 లక్షలనైననూ పారద్రోలి శుభములు గూర్చుననుటకు సందియము లేదు.
శ్లో:- క్రూరష్షష్ఠభవత్రిగోయది బలీ హంత్యాశు దోషాయుతం
లగ్నేశశ్చ బలీయథోక్త గృహగో లగ్నంచ పంచేష్టికమ్
రాత్రావేవ నిశాకరోయది బలీ చైకాదశస్థోపివా
లగ్నైకాదశగోరవిస్తుసకలాన్ దోషాన్ నిహంతిస్ఫుటమ్
తాత్పర్యము:- లగ్నమునకు తృతీయ, షష్ఠ, ఏకాదశస్థానములందు పాపగ్రహము బలవంతుడైయున్నగాని, లగ్న, చతుర్థ, పంచమ, భాగ్యదశమ స్థానములందు లగ్నాధిపతి బలవంతుడైయున్నను, లగ్నమునకు పంచేష్ఠికబలముకలదై యున్నను 1000 దోషములు హరించును,
చంద్రుడు నిశాలగ్నమందు యేకాదశమందున్నను, పగటిలగ్నమందుగాని, యేకాదశమందుగాని రవి యున్నచో పెక్కు దోషములు పోగొట్టుదురు.
*ప్రత్యేక విషయములు*
శ్లో:- ఉద్వాహాదిషుచై కవింశతి మహాదోషాన్ విసృజ్యేతరాన్
స్వల్పాన్ దోషగణాన్ గుణాంశ్చ గణితాన్ నిశ్చిత్యశాస్ర్తాత్ స్ఫుటమ్
లగ్నంయత్ర గుణాథికం చ సకలైర్ర్గాహ్యం నదోషాధికం
బ్రహ్మావాపరిహర్తుమత్రసకలాన్ దోషాన్ సమర్ధోనహి
తాత్పర్యము:- వివాహము మొదలగాగల శుభకార్యలగ్నమునకు 21 మహాదోషములు లేకుండచూచి యితరదోషములను శాస్త్రపద్ధతిగా నిర్ణయించి, దోషములున్న లగ్నములు విడిచి శుభకర్మ లాచరించినట్లు చేయవలయును. ఏదోషమూలేకుండా బ్రహ్మయైనా ముహూర్తము నుంచజాలడు. శుభగ్రహబలము చూచినచో యా దోషములు తగ్గిపోవును.
Comments
Post a Comment