పారిజాతాంశాది కేంద్రాధిపతి ఫలము

*పారిజాతాంశాది కేంద్రాధిపతి ఫలము*
కేంద్రాధిపతి పారిజాతాంశయందున్న జాతకుడు దాతయగును. ఉత్తమాంశయందున్న విశేషదాతయు, గోపురాంశగతుడైన పౌరుషము కలవాడును, సింహాసనాంశయందున్న జనపూజితుడును, పారావతాంశయందున్న శూరుడును, దేవలోకాంశయందున్న సభాపతియు, ద్వితీయగతుడైన (బహ్మలోకగతుడు) మునియు, ఐరావతాంశయందున్న సర్వదాసంతుష్టుడు నగును.

*పారిజాతాంశది పంచామాధి ఫలము*
పంచామాధిపతి పారిజాతాంశగతుడైన కులోచితవిద్యయు, సింహాసనాంశయందున్న మంత్రిత్వమున, దేవలోకాంశయందున్న కర్మయెాగమును, బ్రహలోకాంశయందున్న దేవోపాసనము, ఐరావతాంశయందున్న ఈశ్వరభక్తియు కలుగును.

*పారిజాతాంశాది భాగ్యాది ఫలములు*
భాగ్యాధిపతి పారిజాతాంశయందున్న ఈ జన్మలో తీర్థయాత్రలు చేయును. ఉత్తమాంశగతుడైన పూర్వజన్మలో తీర్థయాత్రలు చేసినవాడు; గోపురాంశలో యాగకర్త, పూర్వజన్మలోను, ఇప్పుడుకూడ. సింహాసనాంశలో వీరుడు, సత్యవాది జితేంద్రియుడు, సర్వధర్మ పరిత్యాగి, పరమాత్మను మాత్రమే ఆశ్రయించినవాడగును. పారివతాంశలో ఈ జన్మలో పరమహంసుడగును. దేవలోకాంశలో బాల్యమునుండి, త్రిదండిగాని, దండిగాని, అగును. బ్రహ్మలోకాంశలో అశ్వమేధము చేసి ఇంద్రపదవి నందును. ఐరావతాంశలో స్వయముగా ధర్మావతారమే. శ్రీరామ, ధర్మరాజాదితుల్యు డగును.

*యెాగకారక గ్రహ ఫలములు*
కేంద్రము (1,4,7,10) విష్టుస్థానము; త్రికోణము, (1,5,9) లక్ష్మీస్థానము, ఈ రెండు స్థానముల (అధిపతుల) యెుక్క సంబంధము మనుష్యులకు రాజయెాగకారకము.

ఆ కేంద్రాధిపతి, కోణాధిపతిలు పారిజాతాంశయందున్న జాతకుడు లోకానురంజకుడైన రాజగును. ఉత్తమాంశయందున్న గజాశ్వ రథాది వాహనయుక్తుడైన ఉత్తమ రాజగును. గోపురాంశయందున్న - రాజవందితుడైన రాజశ్రేష్ఠుడగును. సింహాసనాంశయందున్న చక్రవర్తి యగును. ఈ యెాగముననే హరిశ్చంద్రుడు, ఉత్తముడను మనువు, బలి, వైశ్వానరుడు ఇంకా చక్రవర్తులెందరో జన్మించిరి. వర్తమానయుగములో, కుంతీపుత్రుడైన ధర్మరాజు (దీనిచే పరాశరులు ద్వాపరయుగమున చెప్పినాడని తెలియుచున్నది.) భవిష్యత్తులో శాలివాహనుడు జన్మింతురు, ఇట్లే మనుపు మెుదలైనవారు పారావతాంశలోను, విష్ణువు యెుక్క అవతారములు దేవలోకాంశయందు, బ్రహ్మాది లోకపాలురు బ్రహ్మలోకాంశయందును, స్వయంభువ మనువు ఐరావతాంశయందును ఉద్భవించిరి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: