తోరణ గణపతి- శృంగేరి...!!
🎻🌹🙏,తోరణ గణపతి- శృంగేరి...!!
🌹శ్రీ చాగంటివారి ప్రవచనం నుండి.
🌿శృంగెరి పీఠానికి ఉగ్రనృసింహాభారతీ స్వామివారని ఒక మహానుభావుడు పీఠాధిపత్యం చేశారు.
🌸ఆయన ప్రతిరోజూ ఉదయం కేవలం కాకరాకులే తినేవారు. అలా తిని 24 గంటలలో 20 గంటలు తపస్సు చేస్తే అణిమాది సిద్దులన్నీ ఆయనకు వసమైపోయాయి.
🌿ఒక సందర్భంలో అమ్మవారి సంపదను కొల్లగొట్టడానికి శత్రుసైన్యం శృంగగిరి వచేస్తున్నారంటే ఆయన బయటకు వచ్చి ఒకచోట నిలబడి 'నేను సన్యాసినీ... నేనేమి యుద్ధం చేస్తాను... ఈయన చూసుకుంటారు' అని ఒక గడప దగ్గరికి వెళ్లి ఒక మంత్రాన్ని పఠించారు. ..
🌸వెంటనే దానిమీదకి గణపతి వచ్చి కూర్చున్నాడు.
🌿ఇప్పటికి ఆ గణపతిని 'తోరణ గణపతి' అంటారు.
🌸మీరు శృంగేరీ పీఠంలోకి అడుగు పెట్టాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి లోపలికి వెడతారు.
🌿బయటకు వెళ్లాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి. కొబ్బరికాయ కొట్టి బయటకు వెడతారు.
🌸ఆయన పైన కూర్చుని ఉండగా ఇన్నివేలమంది శత్రుసైన్యం శృంగేరిపీఠంలోకి వెళ్లలేకపోయింది
🌿సనాతన ధర్మంలో శక్తి అంటే ఏమిటో చూపించారు. ఉపాసన అంటే ఏమిటో, అనుష్ఠానం అంటే ఏమిటో చూపించారు.
🌸వాళ్ళ శక్తి ముందు మిగిలిన శక్తులు నిలబడలేవు. ఆయన మహాపురుషుడు అనితరసాధ్యమైన శక్తి సంపద పొందారు..
Comments
Post a Comment