నక్షత్రములు-మారకదశలు

నక్షత్రములు-మారకదశలు 
 
1.అశ్విని,మఖ,మూల నక్షత్ర జాతకులకు రాహు దశ మారకదశ .
2.భరణి వారికి రవిదశ,గురుదశ మారక దశ. 
3.కృత్తికా నక్షత్ర జాతకులకు శనిదశ మారక దశ.
 4.రోహిణి నక్షత్ర జాతకులకు బుధ మహర్దశ మారక దశ. 
5.మృగశిర వారికి శనిదశ మారకము. 
6.ఆరుద్ర నక్షత్ర జాతకులకు గురువు లేక శని దశలు మారకము.
7.పునర్వసు నక్షత్రం వారికి బుద లేక శుక్ర దశ మారక దశలు. 
8.పుష్యమి నక్షత్ర జాతకులకు శుక్ర లేదా చంద్ర మారక దశలు. 
9.ఆశ్లేష నక్షత్రం వారికి రాహు దశ మారకము.
10.పుబ్బ నక్షత్ర జాతకులకుశని యందు గురు లేక బుధ దశలు మారక దశలు.
11. ఉత్తర మొదటి
పాదమైన శని దశ యందు రెండు,మూడు, నాలుగు పాదములు అయిన గురువు లేక బుధ దశల యందు మారక దశలు.
12.హస్తా నక్షత్ర జాతకులకు బుధ దశ  మృత్యు పదము.
13.చిత్తా నక్షత్రం గలవారికి గురువుగాని శనిగానీ లేక బుధుడు గాని దశలు వచ్చినప్పుడు మారకము ఇవ్వగలరు.
 14.స్వాతి నక్షత్రం వారికి బుధ దశ మారక దశ తప్పినచో రవిదశ మారకము కలిగించును.

15. విశాఖ నక్షత్రం వారికి కేతు,శుక్ర దశలు  చివర యందు మారకము లేదా రవి దశలో మారకము వచ్చును. 

16.అనురాధ నక్షత్ర వారికి మధ్యమఆయుర్దాయము నందు బుధ దశ దీర్ఘాయువు ఉన్నచో చంద్రదశ కుజ దశలు మారకము ఇవ్వగలవు. 

17.జేష్ట నక్షత్రము గలవారికి రవి,చంద్ర దశలు తప్పిన రాహు దశ మారకము కలిగించెను. 

18.పూర్వాషాఢ వారికి రవి, చంద్రదశలో  లేక శని దశలో మారకము వచ్చును.

19.ఉత్తరాషాడ నక్షత్రం వారికి శని, బుధ దశలలో మారకం వచ్చును.

20.శ్రవణం వారికి రవి,రాహువు,గురువు దశలు తప్పిన బుధ దశలో మారకము వచ్చును. 

21.ధనిష్ట నక్షత్ర జాతకులకు గురు దశలో మారకము తప్పిన రవిదశలో మారకము వచ్చును.

22. శతభిషా నక్షత్రం వారికి బుధ దశలో మారకము కలుగును.

23.పూర్వాభాద్ర నక్షత్రం వారికి బుధ దశ నాలుగో పాదం వారికి రవి దశ మారకమును ఇచ్చును. 

24.ఉత్తరాభాద్ర వారికి బుధ దశలోనూ అది తప్పినచో శుక్రదశ చివరలో చంద్రదశ చివరలో మారకము ఉండును.

 25.రేవతి నక్షత్రం వారికి శుక్రదశ లేదా రాహు దశ మారకమును ఇచ్చును

               శుభం భూయాత్

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: