కృష్ణుని మిత్రుడు మాలికుడు🚩🚩
🚩🚩
కృష్ణుని మిత్రుడు మాలికుడు
🚩🚩
యదుకులనాయకుడైన కృష్ణుని మిత్రడు
మాలికుడు. మిత్రనికి సకల శాస్త్రాలు, విద్యలు నేర్పాడు కృష్ణుడు.
శ్రీ కృష్ణుని వద్ద విద్యలు అభ్యసించి
అత్యంత శక్తి ని పొందానన్నగర్వం
మాలికుని ఆడించింది.
ఒకసారి కృష్ణుని చక్రాయుధ ప్రయోగాన్ని నేర్పమని కోరాడు మాలికుడు.
" అది చాలా అపాయకరమైనదని ,
అటువంటి ఆశ వద్దు అని మాలికునికి"
బుధ్ధిమతి చెప్పాడు కృష్ణుడు.
కృష్ణుని బోధ మాలికుని చెవికి ఎక్కలేదు.
వేరు మార్గం లేక చక్రయుధాన్ని ప్రయోగించడం నేర్పడానికి ఒప్పుకున్నాడు
కృష్ణుడు. ఱచక్రాయుధాన్ని వ్రేలికి ధరించిన
కృష్ణుడు తన వ్రేలితో ఒక చుట్టు త్రిప్పి
లక్ష్యం పై ప్రయోగించాడు కృష్ణుడు.
చక్రం లక్ష్యాన్ని ఛేదించి తిరిగి వ్రేలికి
వచ్చి చేరుకుంది.
పిదప మాలికుడు ప్రయోగించాలి.
కృష్ణుడు యిచ్చిన చక్రాయుధాన్ని
వ్రేలికి ధరించి ఒక త్రిప్పు త్రిప్పాడు.
ఆకాశం వైపుకి వెళ్ళింది చక్రం.
కుతూహలంగా చూశాడు మాలికన్
"ఆహా..సాధించాను. ఇంక ఇద్దరు
కృష్ణులు..యాదవకులాన్ని నేనే
రక్షిస్తాను." అని గర్వంగా అరిచాడు.
అరవడమే కాదు తిరిగి వచ్చే చక్రాయుధానికి
వ్రేలు సిధ్ధంగా వుంచవలసిన వాడు, తన
వ్రేలు గడ్డంపై వుంచుకుని నిలబడ్డాడు.
చక్రాయుధం మాలికుని కంఠాన్ని ఛేధించినది
మాలికన్ మట్టిలో కలసిపోయాడు.
గర్వంతో నాశనమైన మాలికన్ ని చూసి కృష్ణుడు " మాలికా..నిన్ను చంపినది
చక్రాయుధం కాదు. నీ దురాశ , గర్వమే."
అని అన్నాడు.
భగవంతునికి సమీపమున వున్నప్పటికీ
గర్వంతో వున్నందున గర్వమే నాశన కారణమైనదనడానికి ఉదాహరణ
ఈ కధ.
Comments
Post a Comment