గాజులు అలంకరణ

గాజులు మనకు అలంకరణ వస్తువులుగా, ఆభరణాలుగా మాత్రమే తెలుసు. రంగు, రంగు గాజులను ధరించి ఫ్యాషనబుల్గా కనిపించడానికి ప్రయత్నిస్తాం. అలాగే చేతినిండా బంగారు గాజులు ధరించి, వాటిని ఆస్తిగా పరిగణిస్తాం. అయితే గాజులు ధరించడం అనే ఆచారం ఎందుకు వచ్చిందో తెలుసా?

గర్భాశయ నాడులను ఉద్దీపనం చేయడానికి ఉద్దేశించినవే గాజులు. మహిళలకు మణికట్టుకు ముంజేతికి మధ్య ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటాయి. మణికట్టు నాడులు స్వల్పంగా ఒత్తిడికి లోనవుతుంటే, గర్భాశయ నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమవుతాయి.

దాంతో గర్భాశయం పనితీరు, కండరాల కదలికలు సవ్యంగా జరుగుతుంటాయి. ఇందుకు తప్పనిసరిగా గాజులనే ధరించాలా? ప్రత్యామ్నాయం లేదా అంటే.. ఉంది. రోజూ కొంతసేపు మణికట్టు-ముంజేతి మధ్య చేత్తో నొక్కుకొవచ్చు. అలాగని మర్దన చేసినంత ఒత్తిడి పడకూడదు. కాబట్టి ఒకరకంగా అలంకరణకు గాను, ఆరోగ్య సాధనంగాను ఉపకరించే విధంగా డిజైన్ అయినవే ఈ గాజులు.

స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి?

చేతికి గాజులందము...చెంపకు సిగ్గులందము’ అన్నాడో సినీ కవి. నిజమే...లేత తామరతూడులాంటి కన్నెపిల్ల చేతికి గాజులిచ్చే అందము మరేది ఇవ్వదు. కేవలం అందం కోసమే గాజులయొక్క ప్రయోజనం.. అని అనుకోవడం పొరపాటు. గాజులు..స్త్రీకి రక్షాకంకణం వంటిది. ఈ గాజులు ధరించడం వెనుక సాంప్రదాయబద్ధమైన ఎన్నో ప్రయోజనాలు దాగివున్నాయి.
బాలికలను, వివాహం అయిన స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా గౌరవించడం మన సంప్రదాయం. లక్ష్మీత్వంగల మంగళ ద్రవ్యాలుగా పసుపు, కుంకుమ, పూలు, గాజులు సూచించారు. ఈ మంగళ ద్రవ్యాలను ధరించడం వలన లక్ష్మీ ప్రదమైన చిహ్నాలు మరింత పెరుగుతాయి. అంతేగాక, లక్ష్మీని అంటే స్త్రీని కాపాడవలసిన బాధ్యత కూడా వుందని స్త్రీకి రక్షణ కూడా కల్పించడమ్ జరిగింది. అంతేకాక గాజులు ధరించడం ఆరోగ్యప్రదమైనది.

ఆడపిల్లలకు చాలా చిన్నతనంనుంచే ఈ గాజుల వాడకాన్ని అలవాటు చేస్తారు. ‘జీవితం చాలా విలువైనది..ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. గాజులాగే ఫగిలిపోతుంది’ అనే జీవన సత్యాన్ని చిన్నతనం నుంచే తెలిసేలా చెయ్యడం కోసమే.. ఆడపిల్లలకు ఈ గాజులు ధరింపజేసే ఆచారాన్ని అలవాటు చేసారు. అయితే..‘ఆడపిల్లకే ఈ జాగ్రత్త అవసరమా..మగవాడికి అవసరం లేదా’ అనే సందేహం నేటి ఆధునిక స్త్రీలకు కలగడం తప్పు కాదు. కానీ..ప్రాచీనకాలం నుంచీ, నేటి వరకూ..స్త్రీని ‘గృహలక్ష్మి’ అని గౌరవించారేగానీ.. పురుషుని ‘గృహవిష్ణువు’ అని గౌరవించిన దాఖలాలు ఎక్కడా లేవు. అందుకే.. ఇల్లాలిని చూసి ఇంటిని చూడమన్నారు...పెద్దలు. మగవాడు..దుబారా మనిషి అయినా.. ఆ ఇంటి ఆడది జాగ్రత్తపరురాలైతే..ఆ ఇంట్లో ఏ లోటు ఉండదు. అందుకే చిన్నతనం నుంచీ ఆడపిల్లకు జాగ్రత్త అలవాటు చెయ్యడం కోసమే..గాజులు వేసేవారు. రెండు చేతుల నిండా గాజులేసుకుని, పట్టుపరికిణీ కట్టుకుని.,సాక్షాత్తు లక్ష్మీదేవిలా..ఆడపిల్ల నట్టింటిలో తిరుగుతూంటే..చూడడానికి శోభాయమానంగా ఉంటుంది.
చిన్నతనంలోనే మనిషి పుట్టిన చిన్నతనంలోనే చిన్నారికి ఎలాంటి దిష్టి తగల కూడదంటూ... అడైనా, మగైనా సరే నల్లని పూసలతో చేసిన గాజులని, నల్ల గాజుల్ని చేతులకు వేయటం జరుగుతుంది. క్షేమం కోసం.నిండుగా గాజులు వేసుకుని కళకళలాడుతూ ఉంటే... ఐదవ తనం పదికాలాల పాటు వర్ధిల్లుతుందన్న నమ్మకం. మాంగల్యం పచ్చగా నిలవాలని... తమ కుటుంబ మంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మహిళలు గాజులను నోములు, వ్రతాల పేరుతో...దానంగా ఇవ్వ టం జరుగుతూ వస్తోంది. అలాగేనిశ్చయతాం బూలా లు, వివాహం, పెళ్లి పనులు ప్రారంభించే ముందు పసుపుకొట్టడం ఇలా ప్రతి కార్యక్రమంలోనూ ముత్తయి దువలకు గాజులు ఇవ్వటం ద్వారా ఆ కుటుంబానికి మంచి జరుగుతుందన్న భావన నేటికీ ఉంది.
గాజుల గలగలలు...
అసలు పండగలు, పెళ్లి పేరెత్తితేనే... గాజుల గల గలలు లేకుండా జరగదనే చెప్పాలి. ఆయా పండ గలో, సందర్భానుసారంగా తీసే దుస్తులకు తగ్గ మ్యాచింగ్ గాజులు లేకుంటే ఆవస్త్ర అలంకరణ పూర్త వ్వదనే భావన నేటికీ మహిళల్లో ఉంది. అందుకే బంగారు గాజులు ఎన్ని ఉన్నా వాటి నడుమ అందా లలికిస్తూ... గలగలలాడే రంగు రంగుల మట్టిగాజులు, లక్కగాజులు ముంజేటి మీద నాట్యం చేస్తూ... తమ హుందా తనాన్ని నిలుపుతుంటాయి. గాజుల అందాలను అలంకరించుకుని మురిసిపోని వారు. వాటి గల గలలు వింటూ మైమరచిపోని మహిళలు ఎవరైనా ఉంటారా? వీటిని ధరించేందుకు మతం, కులం, భాషా భేదాలు, ప్రాంతీయ, ధేశీయ భేదాలు అస్సలు లేవనటం సమంజసమే....
సీమంతంలో...
హిందూ సాంప్రదాయాలలో గర్భిణీ స్త్రీలకు జరిగే ప్రత్యేక కార్య క్రమం సీమంతం. పెళ్లయిన ఆడపిల్ల...కడుపు పండి, పురిటికని పుట్టింటికి వచ్చిన వేళ.. ఐదోనెలలో గాని, ఏడోనెలలో గాని, సీమంతం చేస్తారు. చేతలు నిండుగా గాజులువేసి... పండంటి బిడ్డని ప్రసాదించమని వేడు కుంటూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. అయితే ఇలా సీమంతం నిర్వహించడం వెనుక కార ణాలను. గర్భిణీగా ఉన్న స్త్రీ చేతి నరాలు చాలా వరకు బిగిం చుకుపోతాయని... ఇవి గర్భకోశం మీద కూడా ప్రభావం చూపే అవకా శాలుండటం వల్ల... గాజులు తొడగటం వల్ల చేతినరాలపై వత్తిడి పెరుగు తుందని... తద్వారా గర్భ కోశంపై సరైన వత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుందని విశ్వాసంతో మనపూర్వీకులు ఈ సీమంతం ప్రక్రియని ఏర్పాటు చేసినట్లు పెద్దలు చెప్తారు. అనేక రంగుల గాజులని నెలలు నిండిన గర్భిణీకి సీమంతం రోజున తొడుగుతారు. ఇందులో ఓ చేతికి 21 మరో చేతికి 22 జత గాజుల్ని వేస్తారు వచ్చే పేరంటాళ్లు, బాలింతకు ఎర్రని గాజులు, పచ్చని గాజులు వేస్తే మంచి జరుగు తుంధని భావిస్తునే కొక్కేలతో ఉండే బంగారు, వెండి గాజులు ధరింప చేస్తారు. ఇలా చేయటం వల్ల ప్రసవ సమయంలో చేతులు ఉబ్బితే ఇబ్బంది లేకుండా తీసేసందుకు వీలు కలుగుతుం దని ఓ నమ్మకం.
ఆరోగ్యానికీ....
గాజులు ఆరోగ్యాన్ని ఇస్తాయంటే ఆశ్చర్యం కలుగు తోందా? కానీ ఇది వాస్తవం. గాజుల గలగలలు శరీరానికి ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయో...మనిషికి మానసికానందం కలిగించడమే కాకుండా... మెదడును చురుకుదనం కలించేందుకు కూడా ఉపయోగ పడతాయని అందువల్ల వారిలో నూతనోత్సాహం గాజుల శబ్ధం విన్నప్పుడు కలుగుతుందని మరి కొందరు చెప్తారు. గాజు నాడీ మండలాన్ని నియంత్రించి రక్తపోటుబారిన పడకుండా నియంత్రిస్తుంది. అందువల్లే బి.పితో బాధపడే వారిని చేతికి రాగి, ఇత్తడి, పంచలోహాలతో చేసిన గాజు ఆకారంలో రూపొందే వాటిని ధరించమని నిపుణులు చెప్తుంటారు. అంటే అసలు గాజు రూపకల్పనలోనే మన పూర్వీకులు వైద్యపరంగా కూడా ఎన్నో ఆలోచనలు చేసాకే రూపొందించారని తెలుస్తోంది కదా?
మనస్ధత్వం చెప్పేస్తాయి...
మగువుల మనస్ధత్వాన్ని గాజులు స్పష్టంగా చెప్పేం దుకు ముందుంటాయంటే ఆశ్చర్యం కలగకమానదు. రెండు చేతులకీ 3, 4 గాజులు వేసుకుని సింపుల్ గా కనిపించే మహిళ మంచి పొదుపరి అని అర్ధం. ఓ చేతికి మాత్రమే గాజులు వేసుకుని... మరో చేతికి వాచ్ లేదా.. బ్రాస్ లెడ్ తొడిగిన మహిళ అయితే .. ఓ వైపు సంప్రదాయానికి విలువ ఇస్తునే... మరోవైపు నవీన భావాలను ఆహ్వానించే మనస్ధత్వం ఆమెకుందని చెప్పవచ్చట. చేతికి పరిపుష్టంగా గాజులు వేసుకున్నవారు... అందులో రత్నాలు పొదిగినట్లు కనిపిస్తే.. అలాంటి వ్యక్తి పూర్తిగా సంప్రదాయాలను పాటించేందుకు ఇష్ట పడేతత్వం ఉన్నదని చెప్పవచ్చు. ఇక చేతికి గాజులే ధరించకుండా అడపాదడపా నచ్చిన వాటినే గాజులుగా ధరిస్తూ కనిపించే మగువలు పూర్తిగా ఆధునికత వైపు పరుగులు తీస్తూ సంప్రదాయంని కాస్త వెనక్కి నెట్టినా పర్వాలేదన్న ధోరణి ఉన్న వారని అర్ధం చేసుకోవచ్చు.
గాజులు...తమ రంగునుబట్టి రకరకాల అర్థాలను తెలియచేస్తాయి…. ఎరుపురంగు గాజులు శక్తిని, నీలంరంగు గాజులు విఙ్ఞానాన్ని, ఊదారంగు గాజులు స్వేచ్ఛను, ఆకుపచ్చరంగు గాజులు అదృష్టాన్ని, పసుపురంగు గాజులు సంతోషాన్ని, నారింజరంగు గాజులు విజయాన్ని, తెల్లరంగు గాజులు ప్రశాంతతను, నలుపురంగు గాజులు అధికారాన్ని, వెండి గాజులు బలాన్ని, బంగారు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి.

ఆధునికత ఉట్టి పడుతూ...
మారుతున్నకాలంతో పాటు ఫ్యాషన్ ప్రపంచంలో పెనుమార్పులు వచ్చిన నేపధ్యంలో గాజు తన ప్రత్యేకతని నిలుపుకుంటూ నేటితరాన్ని ఆకర్షిస్తునే ఉందనటంలో సందేహంలేదు. కేవలం బంగారు, వెండిలతో తయారైనగాజుల మీదే కాకుండా లక్కతో పాటు ప్లాస్టిక్లతో, నైలాన్, దంతాలతో తయారైన గాజులపై యువత మక్కువ చూపిస్తోంది. నేటితరంలో గాజులకో ప్రత్యేక ప్రాధాన్యత దక్కుతోంది. కాలమెంత మారినా.మ్యాచింగ్ విషయంలో యువత ఏమాత్రం రాజీపడటం లేదన్నది వాస్తవం.ఇక అనేక పూసలు, రంగు రంగుల రాళ్లుతో అనేక డిజైన్లతో గాజులు వచ్చేసాయి.
(మట్టి గాజులు, బంగారు గాజులే వేసుకోవాలి తప్ప ఇప్పుడు వస్తున్న ప్లాస్టిక్, కొన్ని మెటల్ గాజులు రసాయనాలతో చేయటం వలన ఆ కాలుష్యం మనశరీరంలోకి స్వేధగ్రంధుల ద్వార లోపలికి చేరి కొన్ని రకాలా వ్యాధులకు దోహదం చేస్తుంది.)
కాలమెంత మారినా, నాగరికత ఎంత పెరిగినా ..వనితల మనసులు దోచే గాజులు మాత్రం.. రూపలెన్నో మారుతున్నాయి, కానీ.. సింగారం లో వాటి స్థానం మాత్రం.. చెక్కుచెదరకుండా.చిరస్థాయిగా అలాగే ఉంది
క్రీ.పూ. 2300 - 1000 సంవత్సరాలనాటి సింధు నాగరికతకాలం నాటినుండి ముంజేతులకు, మణికట్టుకు ఆభరణాలు ధరించే అలవాటు, ఆచారం ఉంది. మొహంజొదారోలో బయల్పడిన స్త్రీ బొమ్మ చేతినిండా గాజులు కప్పేసి ఉంటాయి. ముంజేతి కడియాలను చాలా అరుదుగా ధరిస్తున్నారు. లతలు, మొసళ్లు, సింహాలు, ఏనుగులు, నెమళ్లవంటి ముఖాకృతిలో ఉండే ముంజేతి కడియాలు ఇష్టపడని మహిళ ఉంటుందా. ఈనాడు మట్టిగాజులు, లక్క గాజులు, ప్లాస్టిక్ గాజులు, రాళ్ల గాజులు, నవరత్నాల గాజులు అంటూ విభిన్నమైన , వినూత్నమైన గాజులు అందుబాటులో ఉండి అతివలను అలరిస్తున్నాయి.

ఆడవాళ్లు గాజులు ధరించే విధానం

ఆడవాళ్లు గాజులు ధరించే విషయంలో కొన్ని నియమాలు పాటించినప్పుడు మంచి ఫలితాలు పొందవచ్చును. బంగారు గాజులు ధరించినప్పుడు వీటి మధ్యలో కచ్చితంగా మట్టి గాజులు ధరించాలి కేవలం బంగారు గాజులు మాత్రమే ధరిస్తేవారు ధనపరంగా సమస్యలు ఎదుర్కొంటారు. మట్టి గాజులు కూడా ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు గాజులు ధరించాలి. నీలం రంగు నలుపు రంగు గాజులు ధరించరాదు. నలుపు రంగు నీలం రంగు శని భగవానునికి సంబంధించిన రంగు.ఈ గాజులు ధరించినప్పుడు పనులలో ఆలస్యం, ధనపరంగా అనవసరంగా ఖర్చులు, మోకాళ్లు, వెన్నుముక, తలభాగాలలో నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఆడవాళ్లు కొత్తగా గాజులు ధరించాలి అనుకుంటే గురువారం నాడు ధరిస్తే మంచిది. గాజులు మార్చుకోవాలి అనుకున్నప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ మార్చుకోవచ్చు. మొత్తం గాజులు అన్ని మార్చాల్సి వస్తే చేతికి పసుపు రంగు గానీ ఎరుపు రంగు దారం కానీ కట్టుకుని ఆ తర్వాత గాజులు మార్చుకోవాలి. గాజులు వేసుకున్న తర్వాత ఆ దారం గాని తాడు కానీ తీసివేయవచ్చు. ఒక చేతికి కనీసం ఆరు గాజులకు తక్కువ కాకుండా ధరించాలి. పసుపు రంగు గాజులు ధరించినప్పుడు వాళ్లు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే పసుపు రంగు గురు భగవానుడికి సంబంధించినది. గురువు జ్ఞానానికి కారకుడు ఈ రంగు గాజులు ధరించినప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. సాధారణంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్లు, ఉద్యోగం చేసే ఆడవాళ్ళందరూ పసుపు రంగు గాజులు ధరించడం వలన వాళ్ళ ఉద్యోగంలో ఉన్నతిని కూడా ఇస్తుంది. ఆకుపచ్చ రంగు మరియు ఎరుపు రంగు గాజులు లక్ష్మీప్రదం ఈ రంగు గాజులు ధరించినప్పుడు విద్యాభివృద్ధి, వ్యాపార పరంగా అభివృద్ధి, ధనాభివృద్ధి కుటుంబ అభివృద్ధి ఉంటుంది. పగిలిపోయిన గాజులు ధరించరాదు. పగిలిన గాజులు ధరిస్తే అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. గాజులు పగిలినప్పుడు వాటిని మంగళవారము శుక్రవారం కాకుండా మిగిలిన రోజులలో డస్ట్ బిన్ లో వేసి బయటికి పంపించేయవచ్చు. గాజులు ధరించే సమయంలో జుట్టు విరబోసుకుని ఉండకూడదు. గుమ్మం బయట గాని గుమ్మం లోపలి గాని ఉండి గాజులు ధరించరాదు. అనగా గుమ్మానికి సమీపంలో ఉండి గాజులు మార్చకూడదు.ఆడవాళ్లు ప్లాస్టిక్ గాజులు లేదా ఇత్తడి వంటి గాజులు ధరించరాదు. దీనివలన ఆరోగ్యం పాడవుతుంది. ఆడవాళ్లు పుట్టింటి నుండి వచ్చేటప్పుడు గాజులు కొనుక్కొని వస్తే మంచిది. దీనివలన ఆయుష్షు పెరుగుతుంది. తీసివేసిన పాత గాజులను ఎవరికి ఇవ్వరాదు. ఎవరికైనా గాజులు ఇవ్వాలి అనుకుంటే కొత్త గాజులు కొని ఇవ్వచ్చు. సంతానం కావాలి అనుకున్న వాళ్లు బంగారు గాజులు ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12