“ఖానాదేవి” జ్యోతిష్య నిపుణురాలు

“ఖానాదేవి”

మనకు తెలియని జ్యోతిష్య నిపుణురాలు
భారతావని అందించిన అత్యుత్తమ జ్యోతిశ్శాస్త్రవేత్తల్లో ఒకరు ఖానాదేవి. భారతావనికి చెందిన మహోన్నత మహిళల గురించి మాట్లాడినపుడల్లా స్వామి వివేకానంద ఆమె పేరును ప్రస్తావించేవారు.

జ్యోతిష, ఖగోళ శాస్త్రాల్లో వరాహదేవుడు గొప్ప నిపుణుడు ఉజ్జయినికి చెందిన విక్రమార్క చక్రవర్తి ఆస్థానంలో నవరత్నాలుగా ప్రసిధ్దికెక్కిన వారిలో ఆయన ఒకరు.

వరాహదేవుడు, ధరణీ దేవి దంపతులకు మిహిరుడు జన్మించాడు. మిహిరుడు జ్యోతిశ్శాస్త్రంలో గొప్ప విద్వాంసుడిగా పేరుగాంచాడు. శ్రీలంక రాజకుమారి అయిన ఖానాదేవిని అతడు వివాహమాడాడు. ఆమెకి కూడా చిన్నప్పటినుండి జ్యోతిశ్శాస్త్రం పట్ల అపారమైన మక్కువ. పెరిగి పెద్దవుతున్న కొద్దీ జ్యోతిషంలో ఆమె దిట్టగా మారింది.

విక్రమార్క చక్రవర్తి మిహిరుని నైపుణ్యం తెలిసి ఆయనను తన ఆస్థాన జ్యోతిష్యునిగా నియమించాడు. జ్యోతిష్యం గురించి రాజసభలో పలువురు అడిగిన ప్రశ్నలకు మిహిరుడు, వరాహదేవుడు సమాధానాలు ఇచ్చేవారు. కొన్ని క్లిష్టమైన సమస్యలకి వారు ఖానాదేవిని ఆంతరంగికంగా సంప్రదించి ఆపైన రాజసభలో వాటికి బదులిచ్చేవారు. విక్రమాదిత్యుడికి ఈ సంగతి తెలిసింది. ఖానాదేవిని కూడా రాజసభకు తీసుకురావాలనీ, ఆమె విజ్ఞానం ద్వారా ప్రజలు లభ్ధి పొందే వీలు కల్పించాలనీ ఆయన మిహిరుడ్ని కోరారు.

చక్రవర్తి అభ్యర్ధన విని తండ్రీ, కొడుకులిద్దరూ దిగ్బ్రాంతి చెందారు. కుటుంబ సాంప్రదాయం, గౌరవాల రీత్యా ఆయన అభ్యర్ధనను పాటించలేక, వారి మాటను తిరస్కరించలేక, చర్చల అనంతరం వారు ఓ ఘోరమైన నిర్ణయం తీసుకున్నారు. మిహిరుడు జరిగిన విషయం ఖానాదేవికి వివరించాడు. ఆమెను నిండు సభకు పంపడం సరి కాదని వాదించాడు. మాట్లాడగలిగితేనే కదా, సభకు పిలిచి మాట్లాడేది. అసలు మాట్లాడడానికి వీలు లేకుండా చేస్తే ఈ ఆలోచనతో తండ్రి ఆదేశం మేరకు మిహిరుడు, ఖానాదేవి నాలుకను కత్తిరించాలని భావించాడు.
ఆమె నిశ్చల చిత్తంతో భర్త దగ్గరకు వెళ్ళి, మామగారు చెప్పినట్టుగా నాలుక కోసివేయాల్సిందిగా పేర్కొంది. మిహిరుడు అలాగే చేయడంతో, ఆమె వీర నాయికగా మరణించింది. 

పరుల కోసమే జీవిస్తూ, కుటుంబ సంప్రదాయం, గౌరవాలను కాపాడేందుకు జీవితాన్నే త్యాగం చేసిన ఖానాదేవికి భారతీయ మహిళా మణిదీపాలులో స్థానం కల్పించారు స్వామి వివేకానంద.

నిజానికి ఖానాదేవి దయనీయ పరిస్థితికి బాధగా ఉంది. తప్పయితే చర్చించుకొనే సహృదయత బార్య భర్తలిద్దరి మధ్యా ఉండాలి. భర్త తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పగలిగే ధైర్యం (ఎందుకో కూడా) భార్యకి ఉండాలి. అలాగే భార్య తప్పుచేస్తే భర్త చెప్పగలగాలి (చెప్పాలి, మార్చగలగాలి, హింస అనేది మార్పుకు ప్రత్యామ్నాయం కాదు).
అప్పట్లో భర్త మాటకి కట్టుబడేవిగా అయి అలా నాలుక కోసుకోడం, సతీ సహగమనాలు చెల్లాయి. ఇప్పుడు పెద్దలని అంటే భర్తని, భర్త తరుపువారిని గౌరవించడం అనేది మన గౌరవాన్ని, మన మర్యాదని తెలియజేస్తాయి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: