గోధూళికా ముహూర్తము

🎻🌹🙏గోధూళికా ముహూర్తము 

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌸సూర్యుడున్న ముహూర్తమునుండి ఏడవది గోధూలికా ముహూర్తమని అనబడును.విపులంగా చెప్పాలి అని అంటే పూర్వము పశువులు ఎక్కువగా ఉండేవి.

🌿ఉదయాన్నే  ఊరి బయటకు మేత కొరకుపశువులనుతోలుకుపోయేవారు.తిరిగిసాయంకాలముసూర్యాస్తమయమునకు ముందుగా ఇంటికి తోలుకు వచ్చేవారు. 

🌸అలా వచ్చే సమయములో పశువుల మంద వచ్చేటప్పుడు ధూళి రేగేది.అలాంటిసమయమునుగోధూలికా ముహూర్తముగా వివరించారు. 

🌿క్లుప్తంగా చెప్పాలంటే సాయంకాలం 4.30 నిమిషముల నుండి సుమారు 6 గంటల వరకు ఈసమయముఉండును. దీనినే గోధూలికా ముహూర్తము అని అంటారు.

🌸ఈ ముహూర్తమును సకల శుభాలకు ఉపయోగించ వచ్చును. వర్జ్యముదుర్ముహూర్తములతోపనిలేదు. హిందువుల దైనిక ఆచారాలలో సాయంసంధ్యకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. 

🌿దీనిని "గోధూళి వేళ" అని, "అసుర సంధ్యఅనికూడావ్యవహరిస్తారు.పగటికి రాత్రికి సంధి కాలమే సంధ్యా సమయం.

🌸సూర్యాస్తమయం తర్వాత రమారమి 45 నిమిషాలు అసురసంధ్య ఈ సమయంలో శుచి,శుభ్రతలతో భగవంతుడిని ప్రార్ధించాలి.

🌿భోజనం చేయడం,నిద్రపోవడం లాంటి పనులు చేయరాదు. ఈ సమయంలో పరమశివుడు పార్వతీ సమేతంగా కైలాసంలో తాండవం చేస్తాడు.

🌸కైలాసమందలి ప్రమథ గణములు, భూతకోటి శివ నామాన్ని ఉచ్ఛరిస్తూ శివ తాండవాన్ని వీక్షిస్తూ మైమరచి ఉంటారు. 

🌿ముప్పది మూడు కోట్ల దేవతలు, బ్రహ్మ విష్ణువులు సైతం మంగళ వాయిద్యాలను వాయిస్తూ ఆనంద తన్మయత్వంతో శివ నర్తనమునకు సహకరిస్తూ ఉంటారు

🌸సమస్తమగు ఋషిదైవ కోటి కైలాసంలో శివ తాండవ వీక్షణా నందజనిత తన్మయత్వంతో ఉన్న ఈ సమయంలో అసురశక్తులువిజృంభించి జనులను బాధిస్తాయి.

🌿అందుకే అసుర సంధ్యలో వేళ కాని వేళ ఆకలి నిద్ర బద్ధకం వంటివి బాధిస్తాయి. ఈ వికారాలకు లోనైతే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. 

🌸అలాగాక పరమేశ్వర ధ్యానంతో సంధ్యా సమయం గడపడం వల్ల అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి...స్వస్తీ..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12