ఆత్మహత్య



ఆత్మహత్య


ఆత్మహత్య చతుర్ధ భావం పాడవ్వాలి కానీ అది ఒక్కటే కారణం కాదు. చతుర్దానికి చంద్రుడు శుక్రుడు పరాసర రీత్యా దిగ్బలం పొంది ఉంటారు. మనః కారకుడు చంద్రుడు కాబట్టి మనసు వికలం చెందితే, సుఖానికి కారకుడైన శుక్రుడు బాగో లేకపోయినా ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు. చతుర్ధ భావం మనసుతో పాటు పరిసరాలు కూడా సూచిస్తుంది 1,4,12 భావాలతో పాటు చంద్రుని కూడా పరిశీలించాలి. బుధుడు సంబంధం ఖచ్చితంగా ఉంటుంది అలాగే కాల పురుషునకు లగ్నం మేషం 12 మీనం నాలుగో స్థానం కర్కాటకం ఆ స్థానాల్లో ఉన్న గ్రహాలు కూడా పరిశీలించాలి. మరణం అనేది 3,8 భావాలకు ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ భావాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి ఆత్మహత్యకు సంబంధించి 1,3,4 ,5, 8, 12 భావాలు అందులో ఉన్న అధిపతులు తోడ్పడతాయి. 12 అనేది స్మశానం కుజుడు కోపానికి శని నిరాశకు యురేనస్ తీవ్రతకు కారకులవుతారు. చిన్న బాధల్ని పెద్దవిగా తలెత్తడం, తగిన రీతిలో తనకు ప్రాధాన్యం లేదు అనుకోవడం, ఇతరులైపడి బతుకుతున్నాను అనుకోవడం, ఇలాంటి సందర్భాల్లో ఆత్మ హత్యకు తలపడతాడు. ఆర్థిక విషయాల్లో ఆత్మహత్య చేసుకోవడం ఒకటి రెండు భావాల బలహీనత వలన ఏర్పడుతుంది. లగ్న షష్టాధిపతులు, అష్టమాధిపతి, ఆరో భావం, లగ్నాధిపతి, షష్టాధిపతి 4,7 కేంద్రాల్లో ఉండడం లేదా లగ్న అష్టమాధిపతులు పరివర్తనలో ఉండడం ఎక్కువగా కనబడుతున్నాయి. జాతక చక్రంలో కొన్ని భావాలు ఆత్మహత్య ప్రేరేపిస్తాయి. చరరాశులలో 10,20 భాగలు స్తిర రాశుల్లో 10,26 భాగలు ఉభయ రాశుల్లో 10,21,22 భాగలు. ఈ డిగ్రీల్లో 6,8,12 భావాధిపతులు మరణ కారకులు రవి చంద్రులపై అశుభ వీక్షణ లేదా సంబంధం. రవి చంద్రులు పాపగ్రహ సంబంధం, రాహు కేతువుల నడుమ కుజ శని గురువులు కేంద్రంలో ఉండడం.
రవి చంద్ర బుధ శుక్రులతో రెండు మూడు గ్రహాల కలయిక ఇవి కాంబినేషన్
బుధ రాహువులు విషం తాగడం.
బుధ చంద్రులు చెరువుల్లో బావుల్లో దొరకడం.
బుధ కేతువులు పుణ్యక్షేత్రాలలో ప్రయత్నించడం. బుధ శుక్రులు అయితే నిద్ర మాత్రలు. కుజ కేతు సంబంధం ఉరి వేసుకోవడం. కేతువు తాళ్ళు కుజుడు బిగించడం రాహు బుధుడు అయితే ఎత్తైన ప్రదేశం నుండి కిందకు దూకడం లాంటివి ఉంటాయి. వీటికి తత్కాల గ్రహదశలు, గోచారం, సపోర్ట్ చేస్తేనే ఈవెంట్ జరుగుతుంది. లేకుంటే వారు ప్రయత్నం చేసినా దశ బాగుంటే రక్షింప పడతారు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: