రామాయణములో మనము తెలుసుకొన వలసిన విషయాలు””””

“””రామాయణములో మనము తెలుసుకొన వలసిన విషయాలు””””

""అనుమానము పెనుభూతము"""

""ప్రాప్తచారిత్ర సందేహా మమ ప్రతిముఖే స్థితా,
దీపో నేత్రా~~తురస్యేన ప్రతికూలా~సి మే దృఢమ్""

శ్రీరామచంద్రుడు రావణసంహారము తర్వాత లోకాపవాదమునకు భయపడి, సీతామాత తో నిష్కర్షగా పలుకుతు, ఓ సీతా! నీవు పరుల యింట ఇంతకాలము నివసించి యున్నందున నీ ప్రవర్తనయందు నాకు సందేహము కలిగినది. ఇది నిశ్చయము. అందుకే నేత్రరోగికి దీపపుకాంతి ఇష్టము కానట్లు నాకు నీవు ప్రతికూలవైతివి.

ఇక్కడ రాముని మాటలలోని అంతరార్థము గ్రహించాలి.నేత్రరోగికి దీపపు కాంతి కనబడదు.ఇది సహజము.కనుక ఈ విషయములో దీపదోషము యుండదుకదా. కారణము కేవలము రోగి నేత్రరోగమే తప్ప మరియొకటి కాదు. అట్లే సీత పట్ల రాముని వ్యతిరేకత రాముని మనస్సే కారణము కానీ సీతామాత యందు దోషము ఏ మాత్రము లేదు. దీనినే "" లోకవిడంబనము"" అంటారు.

రామాయణము యుద్దకాండములో పరులయింట సీతామాత పెక్కుకాలము యుండుట వల్ల లోకాపవాదమునకు జడిసి తన నిర్ణయాన్ని తెలియపరుస్తు,

""ఇతి ప్రవ్యాహృతం భద్రే! మయైతత్ కృతబుద్దినా,
లక్ష్మణే భరతే వా త్వం కురు బుద్దిం యథాసుఖమ్||(118-22),

ఓ సీతా! నీవిక నా దగ్గరనుండి వెళ్లిపోయి లక్ష్మణుని రక్షణలో గానీ, భరతుని పరిరక్షణలో గానీ సుఖముగ యుండుమని పలికెను.

ధర్మపరుడైన రాముని నుండి ఈ విధమైన నిర్ణయము వెలువడుడ కొందరు ప్రాజ్ఞులు ఆశ్చర్యపడినట్లు తెలుస్తున్నది. కానీ మనము గమనించిన లక్ష్మణ భరతులు సీతాదేవికి పుత్రసమానులు.వారుకూడ సీతామాత పట్ల అదే భావముతో యుంటారు. భర్తకు దూరముగ యుండవలసి వచ్చినప్పుడు ఆత్మీయులైన వారివద్ద యుండటము స్త్రీకి దోషము కానేరదని శాస్త్రము కనుక అది లోకసమ్మతము.అందకనే రామచంద్రప్రభువు సీతామాతను లక్ష్మణ భరతులవద్ద యుండమని సూచించుట యుక్తమైన నిర్ణయము.

ఈ విధముగ మానవావతారములో ఉద్భవించిన రామచంద్రప్రభువు """ ఆత్మానం మానుషం మన్యే''""అని ప్రవచించినట్లే మానవలోకములో లోకసమ్మతమైన నిర్ణయాలని సూచిస్తు యుక్తమైన విధముగ పలుకుతు తన అవతారరహస్యాన్ని వెల్లడికాకుండగ సాధారణవ్యక్తిగ వ్యవహరించడమే రామావతారములోని ఔన్నత్యము.ఇటువంటి ఔచిత్యాలను గమనించుకుంటు రామాయణ రహస్యాలను తెలుసుకుంటు ముందుకు సాగుదాము.

“””””””””హరయేనమ: శ్రీకృష్ణాయనమ:””””””

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: