ముల్లోకములు
ముల్లోకములకును భావాభావములను (ఔగాములను) దెలుపుచుందురు. సూర్యుడు చంద్రుడు మండల గ్రహములు. రాహువు ఛాయాగ్రహము. మిగిలినవి తారాగ్రహములు.
తా|| నక్షత్రాధిపతి చంద్రుడు, గ్రహాధిపతి సూర్యుడు. సూర్యడగ్నియని, చంద్రుడు జలమనియు చెప్పబడును. అట్లే గ్రహములలో సూర్యుడు బ్రహ్మయనియు, చంద్రుడు విష్ణువనియు తక్కిన తారాగ్రహము(లు) రుద్రుడనియు తెలియవలెను. సూర్యుడు కశ్యపుని కుమారుడు, చంద్రుడు ధర్ముని కుమారుడు, గురుశుక్రులు మహాగ్రహములు. వీరిరువురు ప్రజాపతి కుమారులు. బుధుడు సోముని కొడుకు. శని సూర్యతనయుడు, రాహువు సింహికాపుత్రుడు. కేతువు బ్రహ్మకుమారుడు. గ్రహములన్నింటికి క్రింది భాగమున సూర్యుడు చరించుచుండును. చంద్రుని నక్షత్రమండలమచటి నుండి దూరముగనున్నది. నక్షత్రముల కన్న కుజబుధులు, వారికన్నను శుక్రుడు దూరముననున్నారు. అంతకంటెను తారాగ్రహమండలము పైన గలదు. దాని పైన బృహస్పతి. అంతకు పై భాగమున శని, అంతకు పైన రావుహుగలరు, వీరిక్రమమిట్లు చెప్పబడినది. స్వర్గము ద్రవాసక్తమై యుండును. ఆదిత్యునాశ్రయించి రాహువుండును. ఎల్లప్పుడు చరించుచుండును. శుక్రుని వైశాల్యము తొమ్మిదివేల యోజనములు, సూర్యుని విస్తీర్ణము కంటే శనైశ్చరుని విస్తీర్ణము రెండింతలుండును. చంద్రుని విస్తీర్ణము కంటే నక్షత్రమండల విస్తీర్ణము మూడింతలుండునని తెలియవలెను.
తా|| నక్షత్రమండలము కన్న నొక పాదభాగము తక్కువ విస్తీర్ణము గలవాడు బృహస్పతి. బృహస్పతి కంటే పాదభాగము తక్కువ విస్తీర్ణము గలవారు శుక్రుడు, అంగారకుడు. శుక్రోంగారక మండలముకన్న చతుర్ధభాగము గము తక్కువ వైశాల్యము గలవాడు బుధుడు. ఆకాశమున గల నక్షత్రములన్నియు బుధునితో సమానమైన విస్తీర్ణముగలవి. వానిలో యోజనార్ధ ప్రమాణముకన్న కుఱుచగ ఏ నక్షత్రమైన నుండదు. రాహువు సూర్యుని ప్రమాణమున నుండును. ఎప్పుడేని చంద్రుని ప్రమాణమునను ఉండును. ఇవి నక్షత్ర గ్రహ ప్రమాణములు. కేతువు మాత్రము విస్తీర్ణ ప్రమాణ విషయమున నెల్లప్పుడొకే విధమున నుండడు. అతని గమనము కూడ అవిజ్ఞాతమై, అనియతమైయుండును. అతడు చంచలుడగుటయే దీనికి కారణము. అట్లు చూడబడుచున్న రూపము గలవాడయియును అతడనేక రూములను ధరించుచుండును. పృథివియే భూలోకమనిచెప్పబడును. అంతరిక్షము భువర్లోకము. స్వర్గము సువర్లోకము, ఊర్ధ్వలోకము లొకదాని కన్ననొకటి పైభాగమున గలవు. భూలోకమున కెల్లప్పుడు అగ్నియే రాజు, అందుచే నతడు భూపతి యని పిలువబడును. వాయువు నభస్పతి. సూర్యుడు దివస్పతి, గంధర్వులు, అప్సరలు, గుహ్యకులు, సిద్ధులు, రాక్షసులు 'భూలోక వాసులు. ఇక భువర్లోక వాసులనుగూర్చి వినుము.
మరుద్గణము, రుద్రగణము, అశ్వినులు, ఏడవ స్కంధమున నుందురు. ఆదిత్యులు, వస్తువులు, దేవగణములు సువర్లోకము నుందురు. నాల్గవదియగు మహర్లోకమున
ప్రజాపతులతోబాటుగ కల్పవాసులుందురు. ఐదవదియగు జనోలోకమున భూమికి నిగ్రహాదులిచ్చు జననామక ఋషులుందురు.
తా|| తపోలోకమున ఋతు సనత్కుమారాదులు, బ్రహ్మసంబంధులుందురు. పునరావృత్తి లేని వారు నివసించునది సత్యలోము, దానిని బ్రహ్మలోకమందురు. అది ఆప్రతిఘాత లక్షణము గలది (విఘ్నములు, బాధలు లేనిది) అచట పురాణేతిహాస విదులు క్రీడింతురు. పురాణములు వినువారును నివసింతురు. భూతలమునుండి కొన్ని వందల వేల లక్ష యోజనముల పై"" దూరమున సూర్యదేవుడున్నాడు. భూమి, నుండి నూఱు కోట్ల యోజనముల పై దూరమున ద్రువుడుండును. అచటి నుండి యిరువది లక్షల యోజనముల పర్యంతము మూడులోకముల (భూర్భువస్స్వర్లోకముల) ప్రదేశముగా పేర్కొనబడును. ధ్రువలోకమున కూర్వముగా రెండు లక్షల యోజనముల క్రిందుగా లోకాంతరము గలదు. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు, భూతగణములు, విద్యాధరుడు అను ఎనిమిది జాతులవారు దేవయోనులు. వ్యోమము నందీయేడు లోకములు ప్రతిష్ఠితములై యున్నవి. ఈ వ్యోమమునందే మరుత్తులు, పితరులు అగ్నులు, గ్రహములు, నేనింతకు పూర్వము పేర్కొనిన దేవజాతులెనిమిది, కొందఱు రూపముగలవారు, మణికొందఱమూర్తులు- వీరందఱు నీ వ్యోమమునందే నివసింతురు. వ్యోమము అననిట్టిది. సర్వము దీనియందే యిమీడియున్నది. సర్వదేవతలు, సర్వగ్రహములు నిందే యున్నవి. అందువలన వ్యోమము నర్పించువాడు, సర్వదేవతల సర్పించువాడగును. కావున శుభము
నపేక్షించువాడు సర్వప్రయత్నములచే వ్యోమమును పూజింపవలెను. భక్తి శ్రద్ధా సమన్వితుడై వ్యోమము నర్పించువాడు సూర్యలోకమునకుఁబోవును. రాజా! ఇందు సందేహము లేదు.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు వ్యోమ మాహాత్మ్యమున భువన కోశ వర్ణనమను నూట యిరువదియైదవ అధ్యాయము సమాప్తము.
Comments
Post a Comment