తృతీయ భావం అనగా భాతృ భావం

శ్రీ మాత్రే నమః 
తృతీయ భావం అనగా భాతృ భావం  ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. 
దీనికి కూడా వివిధ నామాలతో పిలుస్తారు. ధైర్యం, కర్ణము (చెవి), విక్రమం, సహోదరులు పౌరుషం మొదలగునవి.
 ఈ భావం మనకు వారసత్వంగా వచ్చే ఆలోచన విధానాలు, మానసిక బలహీనతలు, బలాలు గురించి చెప్తుంది. మనలోని మానసిక స్థైర్యం, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం, బంధుమిత్రుల సాంగత్యం, చుట్టపక్కాలు.
అన్ని రకాల పత్రాలు ఉత్తరాలు వార్తాపత్రికలు లెక్క తేల్చవలసిన పత్రాలు ఇవన్నీ కూడా ఈ భావానికి సంబంధించినవే. కమ్యూనికేషన్ టీవీ ,రేడియో, ప్రచురణలు మొదలగునవి.
 కాళిదాసు గారు ఉత్తర కాలామృతంలో, ఇంకా తదితర గ్రంథాలలో  పెద్దలు ఈ భావం గురించి ఇలా వివరించారు. ఇది చెవి యుద్ధం మానసిక సంతులన కోల్పోవడం, ఆందోళన , బాధ. సోదరులతో సంబంధ బాంధవ్యాలు, స్వచ్ఛమైన ఆహారం  పిల్లల సంక్షేమం, తల్లి నుండి దూరం, పిల్లల స్నేహితులు ,మేనమామ స్థాయి , భాగస్వామి తాలూకా ఉన్నతమైన చదువులు, తండ్రికి మారక  స్థానం, మనకన్నా పెద్దవారు తాలుకా ఎదుగుదల ప్రేమ వ్యవహారాలు మొదలగునవి.
 ఇంకా నగలు, శక్తి ,తనకన్నా చిన్నవాళ్ళ సంక్షేమం , గ్రంథాలయములు, శక్తి ,నాడీ వ్యవస్థ  మొదలగునవి.

హనుమంతుడి ఆరాధన ఈ భావం ఉత్తేజ పరచడం కోసం తప్పకుండా చేయాల్సి వస్తుంది.
 శక్తికి ధైర్యానికి ప్రకృతి నుంచి వచ్చే అడ్డంకులు తట్టుకోవడానికి  హనుమంతునీ తోడు ముఖ్యం .
 కుజుడు కూడా ఈ భావానికి కారకత్వం వహిస్తాడు కనుక హనుమత్ ఆరాధన మంచిది.కుటుంబం విడిపోకుండా కలిపే హనుమాన్ రక్ష అవసరం. 
కుటుంబంలో సోదరులు అందరూ కలిసి ఉంటే కుటుంబ సంక్షేమం బాగుంటుంది కనుక సోదరులతో చెలిమి జాతకుని తాలూకా అంతర్గత శక్తిని పెంపొందిస్తుంది.
తృతీయ భావాధిపతి కి  పదో భావానికి కూడా సంబంధం ఉంటే శని కూడా ప్రభావం చూపిస్తున్నాడు అనుకోవాలి. అంటే మన మరణం తర్వాత కూడా మనందరికీ గుర్తుంటాం. మన కీర్తి కి రవి కారణం. అయితే, మన కర్మ ఫలితం మీద మనకున్న నిబద్ధతకు శని కారణమవుతాడు కనుక మనం మంచి కర్మలు చేస్తే మన మరణం తర్వాత కూడా మనందరికీ గుర్తుంటాం.
 మూడో భావం  చేతులకి సోదరులతో కమ్యూనికేషన్ కు గుర్తు. ఈ భావాలను సక్రమం గా వినియోగిస్తే పెద్దలు ఆశీర్వదించడానికి సంతోషిస్తారు. 
మూడు ఆరు పదకొండు పాప స్థానాలు గా గుర్తించారు . అయినా ఈ మూడవ భాగం జాతకుని ఎదుగుదలకు చాలా ప్రాముఖ్యత వహిస్తుంది 
ఈ మూడవ స్థానం బుధుడు ఆధిపత్యం లో ఉంటుంది. కనుక, ఎక్కువగా వాగ్యుద్ధం చేయడానికి, మన వ్యక్తిగత అభిప్రాయాలు రాయటానికి చక్కని భావవ్యక్తీకరణకు అందమైన పదములు అమరికకు ఈ భావం చాలా ఉపయోగిస్తుంది. అలాగే ఈ భావం చుట్టుపక్కల వారితోటి ఒకసారి అనవసర విషయాల తో గొడవ పడడానికి సూచిస్తుంది. ఒకసారి అవసరమైనవి పంచుకోవడానికి కూడా ఈ భావం అనుకూలిస్తే శత్రువులు మిత్రులుగా మారుతారు.
 ఈ భావంలో సూర్యుడి ప్రభావం ఉంటే ఆటలు పోటీలు అలాంటి వాటిలో పాల్గొనడం వల్ల సాధించడం  తృప్తి.

చంద్రుడు ఈ భావం చూస్తే భావుకత్వం , మనోవేదన దృష్టి పెట్టలేక పోవటం. 
కుజుని బలం ఎక్కువగా ఉంటే సోదరులతో అంతర్గత కలహం. 
బుధుడి వల్ల తెలివితేటలు మాటల ద్వారా గెలవడం. గురుడు మూడవ భావాన్ని కనుక చూస్తే అంతగా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడు. శుక్రుడు చూస్తే కళలు, అనుకోని బంధాలు ఆనందాలు రహస్య సంబంధాలు. శుక్ర దృష్టి వల్ల కొన్ని కొన్ని సార్లు వాళ్లు చేద్దామన్న పనులపై దృష్టి పెట్టలేరు. 
శని దృష్టి అవసరమైన పనులు చేసుకునే శక్తినిస్తుంది. 
ఎవరితోటైనా తొందరగా గొడవలు పడేలా రాహువు ఈ స్థానంలో చాలా బాగా పని చేస్తాడు. 
ప్రయోగాలు చేయడానికి ఉపయోగిస్తాడు కేతువు. తన చుట్టుపక్కల ఉన్న వాళ్లందరినీ కూడా ప్రభావితం చేస్తాడు. ఎక్కువగా రాజకీయ నాయకులకు ఇలాంటి గ్రహ వీక్షణ ఉంటుంది ఉదాహరణ bill clinton.ఎక్కువగా గొడవలు సాహసాలు నేర్చుకోవడం వ్యక్తిగతంగా ఆనందాలు యుక్తవయసులో ఆనందాలు.

మూడో భావం తమ్ముళ్లు ,ధైర్యం, చేతిరాత మొదలు ను సూచిస్తుంది
 చెడు దృష్టి, పాప  ప్రభావం.  శని వలన చూచిరాత బాగోదు పిరికివాడు.
 పాపులు వక్రీకరించిన గ్రహాలు దృషితో వుంటే, సోదరుల సహకారం ఉండదు. 
కుజుని వలన మానసిక ధైర్యం . 
శుక్రుని వలన స్త్రీల కోసం పోరాటం. 
రవి దృష్టి వలన రాజకీయం సామాజిక జీవితంలో ప్రభావితం. 
కేతువు పాపదృష్టి వల్ల హాని చేయడం రాక్షసుల్లా ఉండడం ఎవరి మాట వినకపోవడం మూర్ఖత్వం అనగా దృష్టి స్థానం యొక్క భావం  మొత్తం చెడిపోతుంది .
కుజుడు శని కలయిక వల్ల చేతిరాత బాగోదు శుభ దృష్టి గల శుక్రుడు వల్ల అందమైన చేతి రాత చంద్రుని వాళ్ల మృదుత్వం సున్నితం బుధుడు వలన  తెలివితేటలు
 శని వలన బాధ్యతలు 
కుజుడు అవసరమైన సాధించుకునే పట్టుదల  .
అలాగే శుక్రుని వల్ల భార్య నుండి ధైర్యం .
కేతువు శుభదృష్టి  వల్ల సాహసం సామాజిక సమస్యల పట్ల ధైర్యంగా ఎదుర్కో కలగడం పోరాటం.
గురుదృష్టి ఎప్పుడూ శుభమే.
ఈ మూడో భావన బుధుని ఆధిపత్యం ,అతని తెలివితేటలు మీద ఇతర గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది  అనేది చూడాలి. వాళ్ళు నీచ లో ఉన్న, వక్రీకరించి ఉన్నదా అనేది చూసి ఫలితం చూడాలి.
 ఒకవేళ రవితో కలిసి ఏ గ్రహం అస్తంగత్వం పొందిన వాళ్లు కూడా కొంత ప్రభావం చూపిస్తారు . వీటి ప్రభావాలతో మూడవ స్థానం గురించి చర్చించాలి.
భాతృ భావం సోదరుల అభివృద్ధి సోదరీమణులు రక్ష ఇల్లు వాహనాలు విద్య ఉద్యోగం మొదలగునవి అన్ని ఉంటాయి. ఇది ఈ ఎదుగుదలను సూచిస్తుంది కనుక ఈ భావాన్ని నిర్లక్ష్యం చేయరాదు. అధిపతి శుభ గ్రహాలతో కలిసి శుభ దృష్టి కలిగి ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాడు. తృతీయాధిపతి కేంద్రంలో గాని కోణాల్లో గాని శుభగ్రహాలతో కూడి ఉంటే సోదరసోదరీమణుల సుఖం కోరుతూ అందరితో కలిసి ఉంటాడు. జై హనుమాన్..

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12