పంచకరహితం

పంచకరహితం

శుభముహూర్తాలను నిర్ణయించేటప్పుడు కొన్ని కొన్ని ముహూర్తాలకు కొన్ని విధాలైన చక్రశుద్ధులు ముహూర్తవిభాగంలో చెప్పబడినాయి. 

ఉదాహరణకు గృహారంభం, గృహప్రవేశాల విషయంలో కలశచక్రశుద్ధి, వృషభచక్రవుద్ధి....  ఇలాగ. 

అదేవిధంగా వివాహాది శుభముహూర్తాలకు పంచకరహితం (ఇది ఒక శుద్ధి) చెప్పబడినది. 

ఇది ఎలా అంటే సంకల్పిత ముహూర్త సమయానికి ఉన్న తిథి వార నక్షత్ర లగ్నసంఖ్యలను మొత్తముచేసి 9 చేత భాగిస్తే వచ్చే శేషము 
1 అగ్ని 
2 మృత్యు
3 శుభం.... 
ఇలా 9 విధాలైన ఫలితాలు చెప్పబడినాయి. 

ఈ 9లో *అగ్ని, మృత్యు, రాజ, చోర,  రోగ* అనే ఫలితం వచ్చినవి దోషయుక్తములు. అటువంటి ఫలితం వచ్చినవి మొత్తం 5. కనుక ఈ ఐదింటిని దోషము కలిగిన *పంచకం* అన్నారు. 3, 5, 7, 9 శేషం వస్తే శుభం కలుగుతుంది. కానీ ఈ నాలుగింటికి పేర్లు చెప్పబడలేదు. (ఎక్కడైనా చెప్పబడినాయేమో నాకు తెలియదు) 

ముహూర్తానికి దోషం కలిగించే *పంచకం* లేకుండా చూచుకోవటమే పంచకరహితం. అంటారు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: