జాతక చక్రం లో రెండో భావం ప్రాముఖ్యత

ఓం శ్రీ మాత్రే నమః.
జాతక చక్రం లో రెండో భావం ప్రాముఖ్యత.
ఇవాళ మనం రెండో భావం లేదా రెండవ స్థానం  ప్రాముఖ్యత గురించి చూద్దాం.
ఈ భావము భుక్తి, కుడి కన్ను, అన్నపానాదులు, వాక్కు, కుటుంబం, సంపాదన మొదలగునవి ఈ స్థానం సూచిస్తుంది.
ఈ భావము ముఖ్యంగా జాతకుని ధన భావాన్ని సూచిస్తుంది. అలాగే బంగారం బ్యాంక్ బ్యాలెన్స్ నగలు షేర్స్ పత్రాలు / documents లాంటి చలన సంపదలను గురించి కూడా చర్చిస్తుంది . చలనము అని ఎందుకంటున్నానంటే ఒకరి నుంచి ఒకరికి ఈ సంపద అనేది మారుతుంటుంది.

మీతో కలిసి మీ ఇంట్లో ఎవరెవరు నివసిస్తున్నారు. మొత్తం మీ కుటుంబ సంపాదన, క్షేమము గురించి ఈ భావం చెబుతుంది. అలాగే మీ మాట్లాడే శక్తిని  వాక్కు కూడా ఈ భావం వల్ల నిర్దేశించబడుతుంది .మీరు ఎంత సునిశితంగా చూస్తారు, మీ దృష్టి ఎలా ఉంది మీ పరిశీలనా శక్తి ఇవన్నీ ఈ స్థానం చెప్తుంది.
 మన ఆయుర్దాయంలో ఎటువంటి లోటు పాట్లు ఉన్నా, అనగా రోగభయం  ఉంటే ఈ భావం ద్వారా తెలుసుకోవచ్చును. కనుక దీనిని మారక స్థానం అంటారు .
మన ఆర్జన న్యాయమా  అన్యాయార్జితమా అని కూడా ఈ స్థానం ద్వారా తెలుసుకోవచ్చు .ఇల్లీగల్ ప్రాపర్టీస్ కూడా తెలియచేస్తోంది.

కొంత మంది ఋషులు ఈ స్థానం గురించి ఈ విధంగా  వివరించారు.
 ముత్యాలు సంపద దుస్తులు వ్యాపారం మొదలగునవి సూచిస్తుంది అని భట్టోపాల అనే ఋషి వివరించారు అని పెద్దలు చెప్పారు. 
అలాగే కాళిదాసు ఉత్తర కాలామృతంలో ఈ భావం గురించి ఇలా వివరించారు. సంస్కృతి సాంప్రదాయాలు పాపభీతి పట్ల నమ్మకం కలిగి ఉండడం, అలాగే నిజం లేదా అబద్ధాలు ఆడటం, నాలుక, కన్ను, రాగి వజ్రాలు అమ్మకం, సున్నితమైన మాటలు మాట్లాడటం, సుగంధ ద్రవ్యాలు సువాసన ద్రవ్యాలు, ముక్కు కొన్ని పద్ధతులు మొదలగునవి రెండవ స్థానం ద్వారా తెలుసుకోగలం అని చెప్పారు.

జాతకునికి ఈ భావం కలిసి వచ్చేది అయినా వారి ప్రవర్తన కొంతవరకు కుటుంబ సభ్యులకు మాత్రం బాధ కలిగిస్తుంది.
 అదెలాగంటే తనకన్నా చిన్నవాడిని కోల్పోవటం, లేదా వారు దూర దేశాలకి వెళ్లాల్సిన అవకాశాలు కోల్పోవడం ఇలాంటిసంఘటనలు జరగవచ్చు.
అలాగే తల్లికి సంపాదన రావటం లాభాలు గడించడం మేనమామ దూరదేశాలకు వెళ్ళటం కూడా ఈ భావం ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ భావం ద్వారా జాతకుని భార్య లేదా భర్త పడే బాధ, వాళ్లకి వచ్చే అడ్డంకులు అపాయాలు కష్టాలు కూడా తెలుసుకోవచ్చు.
తండ్రికి వచ్చే రోగాలు, తండ్రికి చేసే  సేవ మొదలగునవి  కూడా ఈ భావన ద్వారా తెలుసుకోవచ్చు అలాగే తనకన్నా పెద్దవారికి అనగా సోదరులకు ఉండే వాహనయోగం, ప్రాథమిక విద్య, వారి ప్రవర్తన లేదా భూమి సంపాదన కూడా తెలుసుకునే వీలుంటుంది.

ఈ భావం రక్షింపబడాలి అంటే దుర్గామాత ని ప్రార్థించాలి. ఎందుకంటే ఆవిడ శత్రు నాశనీ. మన మాట సంపద ఎదురు వాళ్లలో ఈర్ష్య అసూయ రేపి కుటుంబాలు విడిపోయే ప్రమాదం ఉంటుంది.కనుక , దుర్గా ఆరాధన ఒక తల్లిలా కుటుంబాన్ని ఎప్పుడు కలిపి ఉంచుతుంది. అంతర్గత శత్రువులను తయారుచేయడం అనేది ఉండదు. ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది.

ప్రతి భావానికి దానిలో గల గ్రహం గ్రహాధిపతి భావాధిపతి నక్షత్రాధిపతి మొదలగునవి చూసి గాని ఫలితాలు చెప్పకూడదు. కొన్నిటికి ఈ కింద వివరించిన విధంగా మొత్తం చూసుకొని అప్పుడు ఒక నిర్ణయానికి రావాలి.

ధనయోగం 2 ,11 అలాగే త్రికోణ స్థానాలు 1 ,5 ,9 చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. బలంగా ధనాధిపతి శక్తి అనగా 2,11 స్థానాలు పై ఆధారపడి ఉంటుంది అలాగే 1 ,5 ,9 స్థానాలు వాటిలో గల గ్రహాలు పరస్పర దృష్టులు ఒకరికొకరు ఏ కేంద్రాలలో ఉన్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది .
కొద్దిగా సాధారణంగా ఉండే ధనయోగం ఏదో ఒకటి తో కలిసి ఉంటే లేదా మొదటి స్థానంలో ఒకరు ఉంటే ఉదాహరణకి కర్కాటక లగ్నం 5 వ రాస్యాదిపతి  కుజుడు  కన్యా రాశిలో ఉండి,  11 వ రాస్యాధిపతి శుక్రుడు ధను రాశిలో ఉంటే ధన యోగం ఇస్తారు.
2,5  ఇళ్లలో ఉన్న వారు అనగా కేంద్ర కోణ అధిపతులు ఉదాహరణకు గురుడు వృశ్చిక లగ్నానికి ధన యోగాన్ని కలుగజేస్తాడు
సింహం కుంభ రాశులు వాళ్లకి వాళ్ల ద్వితీయాధిపతి ధన యోగాన్ని కలుగజేస్తాడు ఏదైనా వాయు స్థితి గల స్థానాలలో రాహువు ఉంటే కూడా దాన్ని కలుగజేస్తాడు కనుక 1,2,5,9,11 ఈ ఐదు స్థానాలు ఒకదానితో ఒకటి అవసరమైన సమయంలో యోగిస్తాయి. 5 11 స్థానాలు పరస్పర వీక్షణ కలిగి ఉంటే చాలా సంపద , అదృష్టం.
వృషభం కన్య వృశ్చిక మీన లగ్నాలు వాళ్ళు మంచి ధనయోగం గల గ్రహాలు కలిగి ఉన్నారు. వృషభ లగ్నానికి బుధుడు 2 ,5 రాశుల వారు అలాగే కన్యకు  శుక్రుడు 2 ,9 సంబంధిత రాశులవారిని కలిగి ఉంది  వృశ్చికానికి గురుడు 5 ,2 మీనం లగ్నానికి కుజుడు 9 ,2  సంబంధం కలిగి ఉంది. ఈ నాలుగు లగ్నాలలో వృశ్చిక  లగ్నం గురు కారకత్వం వల్ల మంచి ధన యోగం కలిగింది.
కుంభం సింహం లగ్నాల వాళ్ళు 2 11 రాసుల వల్ల చాలా బలహీనమైన ధన యోగాన్ని కలిగి ఉంటారు కానీ అవి వాటి స్థానాల్లో ఉంటే మంచి యోగం కలిగి ఉంటారు. శని వలన మకర రాశి వాళ్లు రాజయోగం ధనయోగం రెండు కలిగి ఉంటారు .
మాతృ మూలకంగా ధనయోగం అనేది వేద విజ్ఞానం అందిస్తోంది ఈ శుభయోగం జన్మకుండలిలో రెండవ స్థానాధిపతి నాలుగవ స్థానాధిపతి తో కలిసి గాని లేదా నాల్గవ స్థాన అధిపతి దృష్టి ఉంటే కూడా ఈ యోగం  వస్తుంది. దీని ఫలితం ఏంటంటే తల్లి ద్వారా ధనం , లాభాలు తల్లి సహకారం  ద్వారా ధన సంపాదన ఉంటాయి...

రెండవ స్థానం మన వాక్కుని , కుటుంబ పరంపరని కూడా సూచిస్తుంది మనం ఎంత మృదువుగా మాట్లాడతాం లేదా ఖచ్చితంగా మాట్లాడతాం, సున్నితంగా లేదా ఇతరులను బాధపెట్టే లా మాట్లాడటం అనేది ఈ భావం ద్వారా తెలుసుకోవచ్చు అలాగే ఎంత విలాసవంతంగా ఎదుటివారి దృష్టిలో బతుకుతున్నాం అనేది కూడా ఈ భావం చెప్తుంది ఇది మారక స్థానం కూడా ఎందుకంటే కుటుంబానికి ధన సంబంధమైన విషయాలకి మధ్య సంబంధం ఉన్న స్థానం మనము ధర్మంగా  ఉంటే అనగా ధర్మబద్ధంగా  మన సంపాదన , జీతం ఉంటే  ఇది మన కుటుంబం పై ప్రభావం చూపిస్తుంది కనుక వాళ్లు న్యాయబద్ధమైన జీవితం గడిపితే వారి కుటుంబానికి వరం లాంటిది ఎందుకంటే స్థిరమైన సంపాదన శత్రువుల ను ఇవ్వదు. గొడవలు ఉండవు.
శని కుంభ మకర లగ్నాలకు అధిపతి గనుక వారికి కర్మ సంబంధ ఫలితాలు సుగమం కనుక రెండవ స్థానం వారికి మారకం కాబోదు మిగిలినవారికి రోగ రుణ బాధలు కలిగా చేస్తుంది చంద్రుని దృష్టి కూడా చాలా అవసరం తొమ్మిదవ స్థానం కూడా చూడాలి ఈ రెండవ స్థానం ద్వారా ఎంత ధర్మంగా సంపాదిస్తే అంత ఆయుర్దాయం ఉంటుంది .

అలాగే సంబంధిత దశలో శని కేతువులు వస్తే చాలామందికి మారక  భయం ఉంటుంది కానీ అది నిజం కాదు మన వయసు ఆరోగ్యం సంపాదన ఇవన్నీ కూడా మన ఆయుర్దాయాన్ని జీవిత కాలాన్ని నిర్దేశిస్తాయి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12