దశమభావం, రాజ్యభావం లేదా కర్మ స్థానం.

శ్రీ మాత్రే నమః

దశమభావం, రాజ్యభావం లేదా కర్మ స్థానం.
 
వృత్తి జీవనం ,జీవనోపాధి జీవితంలో సాధించిన పనులు ,గౌరవం, కీర్తి మొదలగునవి ఈ దశమభావం సూచిస్తుంది. కాలచక్రంలో మకరరాశి పదో భావం అవుతుంది. శని కారకత్వం. కర్మ స్థానం. కాలచక్రలగ్నాధిపతి కుజుడు ఇక్కడ ఉచ్ఛ స్థితిలో ఉండుటచే దీనిని రాజ్య స్థానం అన్నారు. 

పదవభావం  నుండి పదవరాశి సప్తమం అవుతుంది కనుక సహజ సప్తమస్థానానికి (తులారాశి, అధిపతి శుక్రుడు కళత్ర కారకుడు) కాలచక్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది కళత్ర భావం, బాంధవ్యాలు  ,భాగస్వామ్యాలు మాత్రమే కాక ఒక వ్యక్తి కుటుంబంలో స్థిరపడటానికి సహాయం చేస్తుంది . 7వ మరియు 10వ భావాలకు మధ్య బాంధవ్యం ఉంటుంది .
అనగా శని, కుజ , శుక్రులు ఈ భావంపై ప్రభావం చూపుతారు.

 1,4,7,10 కేంద్ర స్థానాలు అని తెలుసుకున్నాము.
కేంద్ర స్థానాల్లో చివరిది ఈ దశమ స్థానం అనగా 1 మన వ్యక్తిత్వం, 4 విద్య మరియు మాతృమూర్తి, 7 భాగస్వామ్యం మరియు కుటుంబం, 10  సాధించిన గౌరవం, వృత్తి. ఇవన్నియు ఒకదానికొకటి ప్రభావం చూపిస్తుంటాయి.
 జాతకుడు సంస్కృతి సాంప్రదాయాలు పూర్వజన్మ పుణ్యాలతో నిండిన ఈ నాలుగు రాశుల ప్రభావంతో జీవితంలో అనుకున్నది సాధిస్తాడు.

ఈ దశమభావం / కర్మ స్థానం గెలవడం కోసం ఓడిపోవటం, విలువైన సమయాన్ని వెచ్చించడం, ఆనందం కలిగించడం,  అనుకున్న పనిని సాధించి విజయం కోసం కష్టించి పనిచేయడం మొదలగునవి .
ఇవి మిగిలిన రాశుల ప్రభావంతో, మరియు పూర్వ పుణ్య కర్మ తోనూ ప్రభావితమై ఉంటాయి. అకస్మాత్తుగా విజయాలు, అనుకోని నష్టాలు కూడా ఈ దశమ స్థానం నిర్దేశిస్తుంది. అందుకే ఈ స్థానాన్ని కర్మ స్థానం రాజ్యస్థానం అని అంటారు.

శని బలంగా ఉంటే సామాజిక గౌరవం సత్కారాలు కీర్తి విదేశీ యానం వృత్తిపరమైన స్థిరత్వం బలహీనంగా ఉంటే వృత్తిలో ఒడిదుడుకులు మొదలగునవి ఉంటాయి కష్టపడి పని చేయడానికి విజయానికి శని కారకుడవుతాడు. కర్మ ఫలితాన్ని నిర్దేసిస్తారు గనుక ఈ స్థానాన్ని పితృ స్థానం అని కూడా అంటారు.. 

ఒక వ్యక్తి తాలూకా వృత్తి జీవితాన్ని ఇక్కడ నిర్దేశించాలి అంటే ముందుగా లగ్నం లగ్నాధిపతి ని చూడాలి అలాగే దశమాధిపతి మధ్యలో అనగా భావములో ఉన్న మధ్యనక్షత్రం గుర్తించగలగాలి. ఆ నక్షత్రాధిపతి ని లగ్నాధిపతి ని దశమాధిపతి ని ఈ మూడూ చూసుకొని ఫలితాన్ని చెప్పగలరు అని గుర్తించాలి.
ఉదాహరణకి కుంభ లగ్నానికి దశమాధిపతి వృశ్చికం దానికి అధిపతికుజుడు. అలాగే నక్షత్రం అనురాధ భావము మధ్యలో ఉంటుంది. దాని అధిపతి శని ఉన్నారు. ఇప్పుడు శని కుజులు వృత్తికి కారణమవుతున్నారు. ఇంజనీరింగ్, స్టీలు మరియు మైనింగ్ మొదలగు వాటిలో  ఉద్యోగం చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే పదిమంది తోటి కలిసి చేసే పనులు కనుక పబ్లిక్ రిలేషన్స్ సంబంధించిన వృత్తులు కూడా అవ్వవచ్చు  . ఈ విధంగా నిర్ధారిస్తూ ఉండాలి. ఇతర శుభ దృష్టిలు కూడా చూడాలి. అప్పుడు గాని నిర్ధారించుకోవడం జరగదు. 

కర్మాధిపతి శని కర్మ స్థానాన్ని మాత్రమే కాకుండా మిగిలిన ఇతర భాగాల మీద కూడా తన ప్రభావం చూపుతాడు అది కూడా గమనించాలి. గ్రహాల శుభ దృష్టి పాప దృష్టి కూడా చూడాలి కేంద్రాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి చూసుకోవాలి కోణాల్లో కూడా ( 1 5 9 )కూడా గమనించాలి అప్పుడు నిర్దేశించాలి.

ఈ మకరరాశిలో గురుడు నీచ కనుక మంచి బుద్ధితో పనులు చేయడానికి అడ్డంకులు వస్తాయి. చెడుకర్మ లు చేసే అవకాశం. చంద్రుడి శుభ దృష్టి ముఖ్యంగా ప్రభావితం చేస్తుంది. 
ఆలస్యంగానైనా మంచి ఫలితాలు శని వలన, కుజుని వలన ధైర్యంతో  కార్య సిద్ధి కలుగుతుంది. శని జాతకంలో బలం గా లేకపోతే విక్రమార్కుని కథ, నహుషుని కథ చదవాలి అంటారు. హనుమాన్ చాలీసా పారాయణము, రుద్రాభిషేకాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: