అష్టకష్ణాలకే అష్టదరిద్రాలని పేరు

*అష్టకష్ణాలకే అష్టదరిద్రాలని పేరు.*

(1) దాస్యం.సంపదలు కోల్పోయి ఇతరుల వద్ద దాసీగా / దాసుడుగా చేరి బ్రతకడం.
         *ఆది లక్ష్మీ* 

(2) దరిద్ర్యం. దరిద్ర్యమంటే డబ్బులేకపోవడమే కాదు. ఆదుకొనే సంతానం, బంధువులు, మిత్రులు, పాలకులు, భృత్యులు లేకపోవడం కూడా. *ధనలక్ష్మి* 


(3) భార్యావియోగం. భర్తవియోగం కూడా. భార్య పైన ఆధారపడిన భర్త, ఆ భార్య గతిస్తే ఎక్కువరోజులు బ్రతికిన దాఖలాలు బహుతక్కువ. *దాన్యలక్ష్మీ*(భోజనం)

(4) తప్పు చేయడం.అంటే దొంగతనం, జూదం, వ్యభిచారం, అబద్ధాలు చెప్పడం, మత్తుపదార్థాల వినియోగం మొదలైనవి.వ్యసనపరుడిగా మారడం.
 *గజలక్ష్మీ* 

(5) బిక్షాటన. సప్తవ్యసనాలకులోనై సర్వం పోగొట్టుకొని విధిలేక పూలమ్మినచోటే కట్టెలమ్మడమన్నమాట. అడుక్కుతినడం.
 *సంతాన లక్ష్మి* 

(6) ఏ ప్రయత్నం చేయకపోవడం.అంటే కార్యం ప్రారంభించకుండా సోమరిగా తిరగడం. *వీర్యలక్ష్మీ* 

(7) అప్పు. వ్యసనాలకు బానిసై విపరీతంగా బుుణాలు పొంది ఆస్తులను,గౌరవాలను పోగొట్టుకోవడం. *విద్యాలక్ష్మి* 

(8) వ్యాధి. ఏ రోగాన్ని కూడా శరీరం భరించలేదు. రోగాన్ని నిర్లక్ష్యం చేస్తే అది ధీర్ఘరోగమై కృంగికృశింపచేస్తుంది. సంపదలు హరించుకుపోతాయి. *విజయలక్ష్మి* 

పైన చెప్పిన లక్ష్మీదేవి రూపాలకి వ్యతిరేకంగా జరుగుతున్న విశేషాలు. 🙏🌹🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: