కుజదోషం పరిహరింపబడుతుంది

లగ్నేవ్యయేచపాతాళే జామిత్రే చాష్టమే కుజే కన్యా భర్తృ వినాశాయ భర్తాకన్యవినాశదః 

 దీనికి మళ్లీ పాఠాంతరం ఉంది లగ్నే బదులు ధనే అన్నది పాఠాంతరం అందువలన ద్వితీయంలో కుజుడు ఉంటే దోషం అని కొందరి అభిప్రాయం
దీనికి అపవాదము వరుని జన్మకుండలిలో రవి కుజ శని రాహు కేతువులలో ఒక గ్రహం 1, 4,7, 8, 12 భావములలో ఉంటే కన్య యొక్క కుజదోషం పరిహరింపబడుతుంది
వధూవరుల లో ఒకరికి కుజదోషం ఉంటే రెండవ వారికి అదే స్థానంలో పాపగ్రహం ఉండడం అవసరం అని అని నవరత్న సంగ్రహం లో చెప్పబడింది

శనిర్భౌమౌ ధవాకశ్చిత్ పాపోవాతాదృశోభవేత్
తేష్వేవభవనేష్వేవభౌమదోషవినాశకృత్
వరుని కైనా వధువు కైనా 1,4,9,12 లో లో శని ఉంటే కుజ దోషం పోతుంది.
జామిత్రేచ యధాసౌ రిర్లగ్నే వాహిబుకేతధా 
నవమేద్వాదశేచైవ భౌమదోషోనవిద్యతే 
గురువుగాని, శుక్రుడు గానీ లగ్నంలో ఉంటే లేదా సప్తమంలో బలంగా ఉంటే కుజదోషం ఉండదు
కుజుడు వక్రగతుడైనను అస్తంగతుడైనను శత్రు క్షేత్ర మందున్న 1,4,7, 8, 12
స్తానములలో ఉన్నను కుజ దోషము కలుగదు

సబలే గురౌభృగోవా లగ్నేద్యూనే దవాభౌమే 
వక్రే నీచారిగృహస్తేవా అస్తేపిన కుజదోషః 
వధూవరులిద్దరికీ కుజదోషం ఉన్ననూ అష్టవిధ కూటములకు గుణ బాహుళ్యం వచ్చినా నా వివాహం చేయవచ్చు

కార్యోవా గుణబాహుళ్యే కుజేవా తాదృశేద్వయోః (ముహూర్త గణపతి)
మేషము లగ్నమై అందు కుజుడు ఉన్నను ధనస్సు వ్యయమై అందు కుజుడున్ననూ వృశ్చికము చతుర్ధమై అందు కుజుడు ఉన్నను కర్కాటకము అష్టమమై అందు కుజుడు ఉన్నను మకరము సప్తమమై అందు కుజుడు ఉన్నను ను కుజ దోషముగా పరిగణింప రాదు

అజే లగ్నే వ్యయేచాపే పాతాళే వృశ్చికే కుజే ద్యూనే మృగే కర్కి చాష్టౌభౌమదోషోనవిద్యతే 
వృషభము సప్తమమయై అందు కుజుడు ఉన్నను కుంభము అష్టమము అయై అందు కుజుడు ఉన్నను దోషముగా పరిగణింప రాదు

 వృషేజాయే ఘటేరంద్రే భౌమదోషోనవిద్యతే 
ద్వితీయ నందు శుక్ర చంద్రులు లేక కుజునికి గురు దృష్టి లేక కేంద్రంలో రాహు లేక కుజ రాహువులు కలిసి ఉంటే కుజదోషం పరిహారింపడుతుంది

నమంగళీ చంద్రబృగుః ద్వితీయేన మంగళీ పశ్యతి యస్యజీవః నమంగళీ కేంద్ర గతేచరాహుః నమంగళీ మంగళ రాహు యోగే
రాశ్యాధిపతులు మైత్రి గణైక్యం గుణ భాహుళ్యం ఉంటే కుజదోషం ఉండదు

రాశి మైత్రం యధాయాతి గణైక్యం వాయదాభవేత్ అధవా గుణ భాహుళ్యే భౌమదోషోనవిద్యతే

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: