చతుర్ధ భావం ప్రాముఖ్యత.
శ్రీ మాత్రే నమః
చతుర్ధ భావం ప్రాముఖ్యత.
కాలచక్రంలో జాతకునికి నాలుగో స్థానం కుటుంబం మాతృభావం అంతర్గత శాంతి, మానసిక ప్రశాంతత, ఒక ధ్యానం .స్వాధిష్ఠాన చక్రాన్ని చూపించే ఒక హృదయ స్థానం దీన్ని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు.
గ్రహాలు,వాటి ప్రభావం ఈ భావాన్ని పెంపొందిస్తాయి లేదా వ్యాకులతకు గురి చేస్తాయి శుభ గ్రహ దృష్టి ఎప్పుడూ కూడా మానసిక ప్రశాంతత పంచడానికి, కుటుంబ సౌఖ్యానికి దారితీస్తుంది. అదే పాపగ్రహాల దృష్టి చాలా బాధ పెడుతుంది .కుటుంబం అందరికీ కూడా ముఖ్యమే.ఎందుకంటే మానవునికి అందరి తోటి ఒక విధమైన సంబంధం ఎప్పుడూ ఉండాలి. ఏ మాత్రం తేడా చేసినా మానవుని పుట్టుకకి అర్ధం మారిపోతుంది. వేద విజ్ఞానం కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. అది నిజమే,
మహానుభావులకి ఊహాశక్తి అనేది ఒకటి ఎక్కువగా ఉంటుంది. కానీ, పాప గ్రహ ప్రభావం వల్ల అది వక్రమార్గం పడుతుంది. అలాకాకుండా ధ్యానం ద్వారా వారు సక్రమమైన జీవితాన్ని గడపడానికి పరిస్థితులను అదుపులోకి తీసుకుని సాధనా మార్గం అనుసరించడానికి గురుడు శుక్రుడు చంద్రుడి ప్రభావం చాలా అవసరం. అయితే ఇక్కడ కుజుడు రాహువు లాంటి పాప గ్రహాలు చేసే అల్లరి తట్టుకోవడం చాలా కష్టం.
తల్లి పోషణ బాల్యంలో చాలా అవసరం. అది ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి తోడ్పాటు చూపిస్తుంది.అలాగే, ధ్యానమార్గంలో ఒక వ్యక్తి మోక్షసాధనకు కూడా ఈ నాలుగో స్థానం తల్లి ఆశీస్సులకు తోడ్పడుతుంది.ఒకసారి సమాధి స్థితికి కూడా మనిషి వెళతాడు . అయితే ఈ స్థానం చెడిపోతే అంటే భావం చెడిపోతే మన పూర్వ కర్మ ఫలితంగా మన ఆనందానికి అడ్డుకట్ట పడుతుంది .
మన వంశవృక్షం ,పూర్వీకుల కర్మ ఫలితం కూడా సూచిస్తుంది.
గోచార రీత్యా వివిధ గ్రహాల సంచరిస్తున్నప్పుడు ఈ భావం మీద వాటి దృష్టి పడినప్పుడు శుభగ్రహాల శుభ ఫలితాన్ని, ఆశుభ గ్రహాలు అశాంతిని వ్యాకులతను సూచిస్తాయి.ఒత్తిడికి గురి చేస్తాయి. మాత్సర్యం కోపం బాగా పెంపొందుతాయి. అందుకే ఒక కుటుంబంలో శాంతి సౌభాగ్యాలతో ఉంటుంది అంటే లేదా చాలా చికాకులతో నిండి ఉంది అంటే ముందుగా చూసేది నాలుగో భావమును. ఎందుకంటే, ప్రతి వాడికి ఇల్లు తర్వాతే ఏదైనా .గృహశాంతి తర్వాత మనం మన వ్యక్తిగతం. కనుక, మాతృ భావము అర్థం చేసుకోవడం చాలా అవసరం .
కాలపురుష చక్రంలో చంద్రుడు అధిపతి గా గల కర్కాటక రాశి నాలుగవ రాశి. ఇందులోనే గురుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. శుభ స్థానం గురు గ్రహం మనస్సుపైన జ్ఞాన ప్రభావం .ఇద్దరు కలిస్తే అంతా శుభమే సుఖమయ జీవితాన్ని గడుపుతాడు ఇది జాతకుని జీవితంలో చాలా శక్తివంతమవుతుంది . తల్లికి జాతకునికి ఇష్టమైన బంధం అవుతుంది ఆధ్యాత్మిక చింతన కల్గిస్తుంది. ఆయుర్దాయం కలిగిస్తుంది. భార్య లేదా భర్త తో స్నేహితులతో రక్తసంబంధీకులతో సౌకర్యవంతమైన జీవితాన్ని సూచిస్తుంది. దశమ,ఏకాదశ అధిపతి శని దృష్టి ఈ భావమును వుంటే కీర్తి ని కలిగిస్తుంది .పిల్లలు కొద్దిగా ఆలస్యంగా పుట్టవచ్చును. కానీ పిల్లలతో కూడా ఆనందమైన జీవితాన్ని సూచిస్తుంది.
ఈ నాలుగవ స్థానం విద్యను కూడా సూచిస్తుంది చాలా విద్యావంతుడు ధనవంతుడు అవుతాడు. జ్ఞాని అవుతారు అలాగే వాహనాలు సంపదలు వైభోగం కూడా కలుగుతుంది.
ఈ 4 వ భావాధిపతి పంచమ స్థానం లో ఉంటే ప్రేమ, మంత్రం, పిల్లలు ,షేర్ మార్కెట్ జ్ఞానం ,ధనం, ఆనందం తెలియజేస్తుంది .
కానీ గురువు బలం లేకపోతే సంతానానికి కూడా ఇబ్బందే సంతానప్రాప్తి తక్కువ.
2 8 11 స్థానాలను ధనయోగం కోసం చూడాలి .
శుభ యోగాలు కూడా సంతానప్రాప్తికి ధనప్రాప్తికి చూడాల్సి వస్తుంది
శుక్రుడు ప్రేమ కారకుడు
మంత్ర కారకుడు అయిన గురుడు పుత్ర కారకుడు కూడా.
శుక్ర రాహు సంబంధం షేర్ మార్కెట్స్ కి గురుని సంబంధం జ్ఞానం తోటి ఐదవ భావము కూడా ముడిపడి ఉంటుంది.
ఈ పంచమ భావం ఏడవ స్థానమైన బీజము యొక్క భావము అనగా కళత్ర స్థానం మరియు తొమ్మిదో స్థానం అయిన భాగ్యాధిపతి తో కలపి సంతాన సౌఖ్యం కోసం చూడాల్సి వస్తుంది.
కోర్కెలు తీర్చేది 11వ స్థానం...5 నుంచి 7వ స్థానం అంటే పదకొండు అవుతుంది అది కూడా కామితార్థం కోసం చూడాలి సప్తమాంశ కూడా పరిశీలించాలి. నాడీ జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు పుత్రకారకుడవుతాడు. డిగ్రీలలో చూస్తారు లాల్ కితాబ్ ప్రకారం కేతువు ని కూడా చూస్తారు.
నాలుగో స్థానాన్ని మాతృభావం అంటారు అనగా తల్లి తల్లి తాలూకా స్వభావం ఇల్లు మన చుట్టుపక్కల పరిసరాలు, విద్య చిన్ననాటి జీవితం చిన్న చిన్న ఆనందాలు జన్మభూమి మన సంబంధం మన ఎదుగుదల ఇవన్నీ కూడా నాలుగో భావన నుండి చూస్తాం
ఈ నాలుగో భావం ఇల్లు వాహనాలు అన్ని రకాల ఆనందాలు, తల్లి ప్రేమ మొదలగునవి సూచిస్తుంది. 5 9 స్థానాలు అధిపతులు ఈ నాలుగో స్థానాన్ని చూసిన నాలుగో స్థానాధిపతి తో కలిసిన, 1, 4 ,7 ,9 భావగ్రహాలతో కలిసి ఉన్నచో పూర్వీకుల ఆశీస్సులు దొరికి దాని కుటుంబంలో ఒక మహారాజులాగా ఆనందాన్ని గౌరవాన్ని అందుకుంటాడు.
అక్కడ శని దృష్టి పెట్టిన కూడా బాల్యంలో కొంత ఆందోళన విద్యలో ఆటంకాలు మొదలగునవి ఉంటాయి. సంతోషమైన జీవితం కొద్దిగా తక్కువగా ఉంటుంది తల్లికి ఇబ్బందులు మొదలగునవి ఉంటాయి . గురు దృష్టి శుక్ర దృష్టి శుభంగా ఉంటే మంచిది.
నాలుగవ స్థానం చంద్రుడు కారకత్వం లో ఉంటుంది కనుక మానసిక శాంతి కలలు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి అదే పాపదృష్టి కలిగితే ఆశాంతి మనోవ్యాకులత జీవితంలో అడ్డంకులు మొదలైనవి ఉంటాయి. శని కేతువులు కలిస్తే తల్లి లేదా కుటుంబం నుండి దూరంగా ఉండటం లేదా వియోగం. కానీ శని ఎప్పుడూ హాని చేయడు చదువులో ఆటంకాలు ఏర్పరిచిన చివరికి మంచి విద్యను అందిస్తాడు. సొంత ఇల్లు కూడా ఏర్పరుస్తాడు శని శుభ దృష్టి కలిగి ఉంటే ఆనంద జీవితాన్ని అందిస్తాడు.
రాహు మంచి దృష్టి కలిగి ఉంటే వాణిజ్యంలో కూడా రాణిస్తాడు అదే రాహువు పాపి అయితే అయితే అశుభం కలిసి రాడు. అనారోగ్యం. ఇంటికి దూరం మానసిక బాధ.
కొంతమంది తల్లికి దూరంగా అమ్మమ్మ లేదా నాయనమ్మ గారి ఇంట్లో పెరుగుతారు. తల్లిదండ్రుల ఉద్యోగ రీత్యా లేదా
వియోగము వలన కూడా ఇలాంటివి బాల్యంలో జరగవచ్చు.
నాలుగో భావం సుఖ భావం కింద చెప్పబడుతుంది అదే స్త్రీ జాతకం లో ఈ భావంలో 2 కు మించిన గ్రహాలు ఉంటే గనుక ఆవిడ ఒత్తిడికి గురవుతూ ఉంటుంది ఎందుకంటే స్త్రీలు బహుముఖపాత్రలు పోషిస్తూ ఉంటుంది గనుక పురుషులతో పోలిస్తే ఎక్కువ వత్తిడి.
అంతర్గత శాంతికి మాతృ భావానికి ఎక్కువ సంబంధం ఉంటుంది. మహానుభావులు ఎక్కువమంది ..గౌతమ బుద్ధుడు, మహమ్మద్ ప్రవక్త..వీళ్ళందరూ తల్లిదండ్రులకు బాల్యంలోనే దూరంగా పెరిగారు మహమ్మద్ ప్రవక్త ఆరు నెలల వయసులోనే తండ్రిని ఆరు సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయారు .
అందరూ చెప్పుకునే గురువు ఓషో అమ్మమ్మ గారి పెరిగాడు.
అలాగే భగవాన్ కృష్ణుడు కూడా తల్లిదండ్రులకు దూరంగా పెరిగాడు ఇవన్నీ నాలుగో భావం పైన గ్రహ దృష్టులు ప్రభావమే.
శని బలం ఉంటే సంపద కూడా బాగా రావచ్చు. తల్లికి ఆయుర్దాయం కూడా ఉండవచ్చు.
అలాగే 4 వ భవాధిపతి 12 లో ఉంటే విదేశాలలో స్థిరపడవచ్చును. లేదా జన్మ భూమికి దూరంగా ఉండే అవకాశం.
నాలుగవ స్థానం వృద్ధాప్యం కూడా సూచిస్తుంది అక్కడ రాహు దృష్టి ఉంటే వృద్ధాప్యంలో కష్టం అదే శుభ దృష్టి కలిగి ఉంటే వారి బాల్యం వృద్ధాప్యం రెండు కూడా సంతోషంగా ఉంటాయి
మాతృ స్థానం కాలచక్రంలో నాలుగవది చాలా శుభం అని కూడా చెప్తారు.
కేంద్రాల్లో మంచి ఫలితాన్ని చూపించేది నాలుగవ స్థానం ఇది మన కుటుంబ శాంతి, వాహనాలు సుఖాలు తల్లి బాల్యం విద్య అన్నీ కూడా సూచిస్తుంది. వివిధ గ్రహాలు ఈ భావాన్ని శక్తివంతం చేస్తూ ఉంటాయి
ఆరవ స్థానాధిపతి ఈ భావంలో ఉంటే కపట యోగం అంటారు. అంటే ఇంటి దొంగల తయారవుతారు ఇలాంటి వాళ్ళని ఈశ్వరుడు కూడా పట్టలేడు. పాపగ్రహ వీక్షణ కలిగితే మానసిక ఆశాంతి వ్యాకులత.
చంద్రుడు బుధుడు నాలుగవ స్థానాన్ని పాపదృష్టితో చూస్తే మెంటల్ డిజార్డర్స్ వస్తాయి.
శుభ శుక్రునీ వీక్షణ కలిగితే ఆనందంగా జీవితం ఉంటుంది.
గురు దృష్టి ఉంటే తల్లి కూడా గురు స్థానంలో నిలుస్తుంది
శుభమైన గురుడు నాలుగో స్థానాన్నిచూస్తే మంచి కుటుంబాన్ని ఇస్తాడు .అలాగే ఎనిమిదో స్థానంలో పదో స్థానంలో నుండి చూస్తే మంచి కుటుంబ ఉద్యోగ జీవితాన్ని కూడా ఇస్తాడు .
అదే శుభ శని దృష్టి కలిగి ఉంటే కుటుంబ సభ్యులందరికీ కూడా ఇతడు మార్గదర్శి నడతను నేర్పేవాడు అవుతాడు .
రాహు సంతోషాన్ని ఇవ్వడు కేతువు దూరంగా కుటుంబాన్ని ఉంచుతాడు
నాలుగో స్థానాధిపతి 4 లోనే ఉంటే కుటుంబ సౌఖ్యం నాలుగవ స్థానాధిపతి ఉచ్చ స్థితిలో ఉంటే కుటుంబాల్లో సంతోషం ఎప్పుడు మంచి స్నేహితుల్లా ఉంటారు.
అదే నాలుగో స్థానాధిపతి నీచ స్థితిలో ఉన్న పాపులతో చూడబడిన అనారోగ్యం. హృదయవ్యవస్థ లో లోపం అలాగే స్త్రీలకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చు అవకాశం.
కాలపురుషచక్రంలో కుజుడు కర్కాటకములో నీచ స్ధితి పొందుతాడు వ్యక్తిగతంగా బలహీనపడతాడు. రహస్య ఆలోచనలు చేస్తాడు. ఇటువంటి స్ధితి గల జాతకుల పట్ల తల్లి శ్రధ్ధ కలిగి వుంటే వారు ఉత్తములు అవుతారు.
మాతృ భావానికి అధిపతి లాభిస్తే లేదా ఉచ్చ స్థితిలో ఉంటే పూర్వజన్మ పుణ్యం చేసుకొని ఉంటాడు గౌరవం కలిగి ఉంటాడు.
ఈ భావం స్వాధిష్ఠాన చక్రాన్ని సరిపోల్చి ఉంటుంది . కనుక కర్మ ఫలితాలు తల్లి ద్వారా అనుభవించాల్సి ఉంటుంది కనుక ఆవిడ సహకారం ఉండొచ్చు లేదా ఆవిడ నుండి దూరంగా కూడా ఉండవచ్చును .
మొత్తం మీద గ్రహ ఫలితాలు చూసి అప్పుడు దాన్ని నిర్దేశించాలి.
శుభం.
Comments
Post a Comment