ముగ్గుల్లో ఆరోగ్యం
ముగ్గుల్లో ఆరోగ్యం
కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు...ఆరోగ్యపరమైన అంశాలు కూడా ఇమిడి ఉండడం మన పండుగల ప్రత్యే కత సంక్రాంతి ముగ్గులు కూడా ఆ కోవలోకే వస్తాయి.ధనుర్మాసం ముగిసిన తరువాత సంక్రాంతి వస్తుంది.ధనుర్మాసం నెల రోజులూ ముగ్గులు వేయడం మన సంప్రదాయం.ఈ మాసంలో శీతాకాలం తీవ్రంగా ఉంటుంది.క్రిములు, కీటకాలు కూడా ఎక్కువగా ఉంటాయి.ముగ్గుల ద్వారా వాటిని నిరోధించ వచ్చు.ముగ్గులు వేయడం కోసం ఇంటి ముందు పేడ నీళ్ళతో కల్లాపు జల్లుతారు.ముగ్గు వేయడానికి వరిపిండిని ఉపయోగిస్తారు. గడవలకు పసుపు రాస్తారు.పసుపు, పేడ క్రిమినాశకాలు అలాగే క్రిములు, పురుగులకు వరిపిండి ఆహారం వాటి ద్వారా క్రిములు, చిన్న పురుగులు ఇళ్ళలో ప్రవేశించ కుండా ఉంటాయి.
Comments
Post a Comment