విదేశాలకు వెళ్లే జాతకాలను పరిశీలించే విధానం

విదేశాలకు వెళ్లే జాతకాలను పరిశీలించే విధానం

నాలుగో స్థానం, లగ్నం నుండి నాలుగో అధిపతి పాడైతే

నాలుగో స్థానానికి రాహువు మరియు కేతువు లేదా నక్షత్రాధిపతి పరివర్తన ఎలాగైనా నాలుగో స్థానానికి సంబంధించి ఉండాలి.

నాలుగో స్థానాధిపతి దుస్థానాలైన 6,8,12 స్థానాలలో ఉంటే అతను కచ్చితంగా స్వదేశం వీడి విదేశాల్లో సెటిల్ అవుతాడు. ఈసూత్రాలు లగ్నం నుండి చంద్రుడి నుండి మరియు నవాంశ,చతుర్ధాంశను వీక్షించాలి.
తొమ్మిదవ అధిపతి పన్నెండు అధిపతి, చరరాశులలో యుండి జలరాశులై ఉంటే విదేశీ యానం ఉంటుంది.
ఉదాహరణకు తొమ్మిదవ అధిపతి పన్నెండు అధిపతి జాతకంలో చరరాశిలో ఉండి జలరాశిలో ఉంటే ఉన్నత చదువులకు విదేశీ యానం ఉంటుంది.

నాలుగవ అధిపతి 12 లో ఉంటే జాతకుడు స్వదేశం కంటే విదేశాలలో ఉండాలనే అభిలాష ఉంటుంది.
5,9,12 అధిపతులు దశాంశ లో కలసి ఉంటే వృత్తి సంబంధంగా విదేశాల్లో నివసిస్తారు. ఇటువంటి వారు సైంటిస్టులు గానూ ప్రొఫెసర్లుగాను ఉంటారు.

ముఖ్యంగా రాహువు తొమ్మిదవ అధిపతి తో కలిసి 12వ స్థానంలో జలరాశిలో ఉంటే విదేశాల్లో స్థిర నివాసం ఉంటుంది.

వివాహ స్థానమైన సప్తమ స్థానంలో మరియూ 8,9, 12 స్థానాల్లో ఉన్నాలేదా స్థానాధిపతులతో కలిసి ఉన్నా వివాహం తర్వాత విదేశాల్లో సెటిల్ అవుతారు.

లగ్నాధిపతి, లేదా లగ్నం చరరాశి లేదా ద్విస్వభావ రాశిలో ఉంటే విదేశీ యానం ఉంటుంది.
విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉండే గ్రహాలు,రవి, చంద్రుడు, శని, రాహువు వీరు ,8,9,12స్తానాల్లో గానీ స్థానాధిపతులతో ఉన్నా విదేశీ యానం 10వ అధిపతి 12 అధిపతితో కలిసినా విదేశీ యానం ఉంటుంది.

లగ్న వ్యయాధిపతి పరివర్తన
విదేశీయులను సూచిస్తుంది.
పన్నెండవ భావం చర రాశి అయితే విదేశీ యానానికి బలం చేకూరుతుంది.
తొమ్మిదవ భావంలో కుజుడుంటే విదేశీయానం ఉంటుంది.
శని రాహువు వాయు తత్వ గ్రహాలు, శుక్ర చంద్రులు జలతత్వ గ్రహాలు వీరికి సంబంధం ఉంటే విదేశీయానం ఉంటుంది అదే వీరు చరరాశులలో ఉంటే అధిక ప్రాధాన్యత ఉంటుంది. కేతువు 9లో ఉంటే విదేశీ యానం ఉంటుంది
అష్టమం అష్టమాధిపతి శని వీక్షణం ఉంటే విదేశీయానం ఉంటుంది. వ్యయభావంలో పాపులున్నా పాపులు వీక్షించినా విదేశీయానం ఉంటుంది.

ఆఫీస్ తరఫునుంచి విదేశాలకు వెళ్లాలంటే 6 స్థానం తప్పనిసరిగా సూచించాలి.

యూఎస్ లేదా కెనడా వెళ్ళాలంటే, శని పడమర దిక్కు సూచిస్తాడు, పడమర దిక్కు సూచించే రాశులు మిధునం తుల కుంభం ఈ రాశుల్లో పైన చెప్పిన 9,12,4 అధిపతులు కలిసి ఉంటే ఆయా దేశాలకు వెళ్తారు. అలాగే రవి తూర్పు మరియు దూర ప్రాంతాలను సూచిస్తాడు. కుజుడు దక్షిణ దిక్కు, బుధుడు ఉత్తర దిక్కును సూచిస్తాడు ఇవి ఆ జన్మ రాశులను బట్టి చూసుకోవాల్సి ఉంటుంది. రవి నీచలో కానీ ఆర్ లో కానీ ఉన్నా నా రాహుకేతువుల తో కలిసిన తన దశ కాలంలో విదేశీయానం ఇస్తాడు.

విదేశాలకు ప్రయాణించే సమయం

 తొమ్మిదవ స్థానాధిపతి లేదా 12 వ స్థానాధిపతి వీరు ఆయా స్థానాల్లో ఉండి ఆ దశ అంతర్దశలో,
శుక్రుడు, రాహువు, కేతువు, చంద్రుడు, శని వీరిలో ఎవరైనా పన్నెండవ స్థానానికి సంభంధిస్తే విదేశాలకు ద్వారాలు ఓపెన్ అయినట్లే
రాహు శని గోచారంలో 12వ స్థానానికి సంభంధిస్తే, వీరిలో ముఖ్యంగా రాహు దశ అంతర్దశలో అలాగే శని దశ అంతర్దశ లో కచ్చితంగా విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి.

 నాకు ప్రిడిక్షన్ టెక్నిక్స్ నేర్పిన గురుదేవులు నిన్న అస్తమించిన సందర్భంగా ఆయనకు నివాళిగా ఈ వ్యాసం డాక్టర్ జయదేవ్ గారికి అంకితం.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: