ఉత్తమాద్యంశములు
ఉత్తమాద్యంశములు
1 పారిజాతాంశ
2 ఉత్తమాంశ
3 గోపురాంశ
4 సింహాసనాంశ
5 పారావతాంశ
6 దేవలోకాంశ.
రేండు వర్గములకు ఐక్యము కలిగెనేను పారిజాతాంశ మనియు, 3 వర్గములకు ఐక్యము గలిగిన యత్తమాంశనియు, 4 వర్గములు ఐక్యము గలిగిన గోవురాంశయనియు, 5 వర్గములు ఐక్యముగలిగిన సింహాసనాన్ని యనియు, 6 వర్గములకు ఐక్యము కలిగిన పారావతాంశ యనియు, 7 వర్గములు ఐక్యము గలిగిన దేవలోకాంశ అనబడును.
*వర్గయోగ ఫలము*.
స్వాంశ యందున్న గ్రహముతెలివి, కీర్తి, సుఖమును, యుత్తమాంశయందున్న గ్రహము సకల సంపత్తులను, గోపురాంశ యందున్న గ్రహము నిత్యము ధనవిద్యలను, సింహసనాంశ యందున్న గ్రహము భూసంపత్తిని గలుగజేసి మహానుభావునిగాను, పారావతాంశయందున్న గ్రహము వైభవము, సర్వశాస్త్రములును, దేవలోకాంశయందున్న గ్రహము రాజ్యము, భూములను, దానములు చేయించుటయును జేయును.
వర్గోత్తమాంశ యందున్న గ్రహము భావమునకు గ్రహమునకు యెక్కువ బలము గలిగించి భావ కారక విషయములలో విశేష శుభఫలదాయి యగును.
లగ్నమున సప్తవర్గములు సాధించి యందు అయాగ్రహములకు శుభవర్గైక్యము, పాపవర్గైక్యము జేసికొని శుభాధిక్యమైన శుభఫలము, తాపాధిక్యమైన పాపఫలము కల్పించవలెను. గ్రహములకుస్వవర్గ, మిత్రవర్గు, శుభగ్రహ వర్గములు జూడవలయును. పాపగ్రహ, శతృ గ్రహవర్గములు జూడవలయును. ఏ గ్రహమునకైనను రెండుకంటె నెక్కువ స్వర్గులు గలిగిన విశేష శుభఫలముల నిచ్చును. రవికి స్వవర్గములు రవి స్వక్షేత్రము, రవి హోర, రవిద్రేక్కాణము మొదలుగా గలవి. ఇతరగ్రహములకు గూడు ఈ విధముననే యుండును
Comments
Post a Comment