కారకాంశ
శ్రీ గురుభ్యోన్నమః
జైమిని ప్రకారం కారకాంశ అధిపతికి
అష్టమరాశి మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలుస్తుంది
కారకాంశ అంటే ఎక్కువ భాగాలు నడిచిన గ్రహం నవాంశలో ఎక్కడ ఉంటుందో అది కారకాంశ అవుతుంది
ఉదాహరణకు నా జాతకంలో కారకాంశ మీనం లో పడింది
అధిపతి గురువయ్యాడు ఆ గురువు సింహంల్లో ఉన్నాడు అక్కడినుండి అష్టమం మీనమైంది మీనం అయితే శాంతిగా మరణం కలుగుతుందని చెప్పబడింది
అదేవిధంగా మేషాది రాశులకు మేషం అయితే సహజ మరణం వృషభం దెబ్బలు గాయాల వల్ల మరణం మిధునం ఫుడ్ పాయిజనింగ్ లేదా ఇన్ఫెక్షన్ వల్ల మరణం సింహం అయితే శత్రువుల ద్వారా గాని ఆయుధాల వల్ల గాని మరణం ఇక్కడ ఆయుధాలు అంటే ఆపరేషన్ కూడా అనుకోవచ్చు కన్య అయితే ఎముకలు రోగాలు వెన్నుపూస నడుము వీటికి సంబంధించిన రోగాల వల్ల అలాగే తుల అయితే చర్మ రోగాల వల్ల వృశ్చిక రాశి అయితే గుహ్య స్థానాల రోగాల వల్ల ప్రో స్టేటు లాంటి సీక్రెట్ రోగాలవల్ల ధనస్సు అయితే దెబ్బలు గాయాల వల్ల ఎత్తునుంచి పడిపోవడం మొత్తం మీద హింసాత్మక మరణం కుంభం అయితే పక్షవాతం లేదా నరాల వ్యాధి వల్ల మీనం అయితే ఇంతకుముందు చెప్పబడింది
Comments
Post a Comment