దశా/అంతర్దశా క్రమము
1. " ఇన శశి కుజ..." అని సూర్యుడి మొదలు దశా క్రమము చెప్పబడినది.
ఇన శశి కుజ రాహుః
జీవ మందజ్ఞ కేతుః
భృగుజ ఇతి నవానాం
కృత్తికాది క్రమేణ
2. దశా/అంతర్దశా క్రమము: రవి, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ, కేతు, శుక్ర.
3. చంద్ర సంచార నక్షత్రము(దిన నక్షత్ర) ఏ గ్రహముదో ఆయా గ్రహ దశా కాలము నుండి దశలు లెక్క ప్రారంభము అవుతుంది.
4. దశా సంవత్సరములు మరియు క్రమము :
రవి - 6 సం.
చంద్ర - 10 సం.
కుజ - 7 సం.
రాహు - 18 సం.
గురు - 16 సం.
శని -19 సం.
బుధ - 17 సం.
కేతు - 7 సం.
శుక్ర - 20 సం.
4. ప్రతీ గ్రహముయొక్క పూర్తి దశా కాలము 9 గ్రహాల అంతర్దశా కాల పాలన వచ్చును. ఒక్కో అంతర దశానాథునికి కొంత పాలనా కాలము ఇచ్చినారు. అంతర్దశలు ఆయా దశానాథుని నుండి మొదలవుతాయి.
1.ఉదా: రవి దశ
(దశానాథుడు / అంతర్దశానాథుడు)
రవి / రవి
రవి / చంద్ర
రవి / కుజ
రవి / రాహు
రవి / గురు
రవి / శని
రవి / బుధ
రవి / కేతు
రవి / శుక్ర
2. ఉదా: శని దశ
శని / శని
శని / బుధ
శని / కేతు
శని / శుక్ర ( శుక్రుడి తరువాత రవితో ప్రారంభము)
శని / రవి
శని / చంద్ర
శని / కుజ
శని / రాహు
శని / గురు
పై విధముగా ప్రతీ గ్రహ దశా కాలములో అంతర్దశలు ఆయా దశానాథుని నుండి మొదలవును.
Comments
Post a Comment