అమల కీర్తి యోగం
అమల కీర్తి యోగం. చంద్రుడికి 10వ కేంద్రంలో లగ్నాధిపతి ఉన్నట్లయితే దానిని చంద్రకళా యోగంగా చెప్పొచ్చు అమల కీర్తి యోగం గాను చెప్పవచ్చు. అమలు కీర్తి యోగం అనేటువంటిది ఇటువంటి ఫలితాలు ఇస్తుంది.
అలాగే దుస్థానంలో ఉన్నప్పుడు శకట యోగము వీటిని కూడా గమనించినట్లయితే మరి కొన్ని విశేషాలు అర్థమవుతాయి. ఇదే కోవలో పర్వత యోగము.
చంద్ర బలాన్ని అనుసరించి చెప్పేటువంటి యోగం
బృహత్ పరాశర హోరా శాస్త్రంలో చంద్ర బలమును అనుసరించి మాత్రమే యోగం యొక్క ఫలితాన్ని చెప్పాలి యోగాన్ని మొదటిగా చూసినట్లయితే చంద్ర యోగాన్ని చూడాలి అనే పరాశరుడు ఒక నియమాన్ని చెప్పి ఉంచారు. దాని ప్రకారం చంద్రశీల అధ్యాయము ఎంతో ప్రశస్తి చెందినది.
అలాగే జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు దేశ కాల ప్రాంత్రమును అనుసరించి చెప్పాలి అని చెబుతారు. రెండు రకాలుగా చెప్పబడుతుంది. ఒకటి ప్రాంతము మరి ఒక్కటి శారీరక ధర్మము (అంగసాముద్రికమును అనుసరించి అని చెప్పబడి ఉన్నది.) ఈ విషయాన్ని సాధికారికంగా అంగసాముద్రిక అధ్యాయాన్ని పరారుడు చెప్పడం జరిగింది.
Comments
Post a Comment