భార్యగర్భవతిగా ఉండిన వాస్తు కర్మలకు దోషకాలము
భార్యగర్భవతిగా ఉండిన వాస్తు కర్మలకు దోషకాలము
శ్లోకము:-
కర్తృర్భార్యా గర్భిణీ చే ద్వాస్తు కర్మోప నాయకమ్!
షాణ్మాసాత్పరతస్సోపి,నకుర్యాదితి శౌనక:!!
గర్భిణీయది పత్నీచ్చేన్న కుర్యాద్గృహ కర్మణీ!
యది కుర్యాద్గర్భహాని:!గృహహాని ర్నశం శయ:!
పంచ మాస మితం కార్యం అత: ఊర్ద్వం నకారయేత్!!
తాత్పర్యం:- భార్య గర్భవతిగా ఉన్నప్పుడు అయిదవ మాసం పూర్తి అగువరకు గృహారంభ జరుపుటకు దోషము లేదు ఆరవ మాసం వచ్చిన తదుపరి గృహారంభ వాస్తు కర్మలు ప్రారంభించిన వాని భార్యకు గర్భ హాని కలుగును ఆరు మాసాల లోపు ఈ దోషము ఉండదు.
శ్లోకము:-
మాసేతు నవమేప్రాప్తే పూర్వపక్షే శుభేదినే!
ప్రసూతి సంభవేకాలే గృహారంభణమిష్యతే!!(విశ్వకర్మప్రకాశిక)
తాత్పర్యం:- స్త్రీ గర్భవతి అయ్యి ప్రసవ కాలము సమీపించినప్పుడు అనగా తొమ్మిదవ మాసం లో పూర్వార్ధ భాగమునందు శుభ దినమున ప్రసూతి నిమిత్తము గృహము(సూతికా గృహము) నిర్మించివచ్చునని విశేష వచనము గా విశ్వకర్మ ప్రకాశిక యందు తెలుపబడినది!!
Comments
Post a Comment