సప్తమ స్థానము -
సప్తమ స్థానము -
🙂వివాహము మరికొన్ని విషయములు సప్తమంలో రవి, బుధ గురు, శుక్రులు శుభ ఫలితాన్ని ఇస్తారు.
🙂సప్తమంలో చంద్రుడు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు. ఒక్కో సారి వారి వల్లనే వివాహ జీవితం నరక ప్రాయం చేసుకుంటారు.
సప్తమంలో 🙂శని, రాహు, కేతువులు బాధను కలిగిస్తారు.
🙂సప్తమంలో వక్రించిన గ్రహాలు ఉన్న, సప్తమాధిపతి వక్రించిన వివాహ సంబంధాలు నిర్ణయించటం కష్టం అవటమే కాకుండా ఆలస్యమవుతుంది.
🙂లగ్నాధిపతికి సప్తమాధిపతి సంయోగం కానీ, పరస్పర కోణ స్ధితి ఉన్న ఇద్దరి మధ్య సఖ్యతకు నిదర్శనంగా ఉంటుంది.
🙂 స్ధానం లో శని గ్రహం ఉన్న వివాహం ఆలస్యం అవుతుంది. లేదా ఇద్దరి మద్య వయో భేదం ఉంటుంది. లేదా
ఇదివరకు వివాహం అయిన వారితో పెళ్ళి జరగచ్చు. లేదా వివాహం పట్ల
విముఖత, అశ్రద్ధ, అసంతృప్తి కనిపించవచ్చు.
🙂 శనికి శుభదృష్టి ఉంటే క్రమేణ అనుబంధాలు బలపడతాయి. కేంద్రంలో ఉన్న రవి, చంద్ర, శుక్రులకు శనితో సంయోగం ఇబ్బందికరంగా ఉంటుంది.
🙂 అష్టమ కుజుని వలన మల్టిపుల్ కళత్రాలు జరిగే అవకాశం ఉంటుంది ఇటువంటి వారికి జాగ్రత్తగా పొంతన కుదర్చాలి.
🙂 సప్తమంలో కుజుడి వలన తీవ్ర విభేధాలు, వివాదాలు సంభవిస్తాయి.
కేంద్రంలో ఉన్న చంద్ర, శుక్రులతో
కుజుడు కలసి ఉన్న ప్రతికూల పరిస్ధితులు ఉంటాయి.
🙂 గురు దృష్టి ఉన్న అనుకూలంగా ఉండును.
🙂 సప్తమలో గురువు ఒక్కడే ఉన్నా వివాహాలను డబుల్ చేస్తాడు
శుక్ర, కుజులు కలసి 5, 7, 10 భావాలలో వుంటే వివాహేతర సంబంధము వుంటుంది.
🙂 సప్తమంలో రాహు, కేతువులు వలన అపోహలతో సంసార జీవితాన్ని పాడు చేసుకుంటారు. అన్య మతస్ధులతో గాని ఇతర కులస్ధులతో గాని వివాహం జరిగే సూచనలు ఉన్నాయి. శుభగ్రహ దృష్టి ఉంటే అనుకూల పరిస్ధితులు ఉంటాయి.
🙂లగ్నం, సప్తమ స్ధానం ద్విస్వభావ రాశులైన మిధునం, మీన, కన్య రాశులై రవి, చంద్ర, కుజ, శుక్రులు సప్తమాధిపతి ఈ ద్విస్వభావ రాశులలో ఉంటే రెండు వివాహాలు గాని, వివాహేతర సంబంధాలు గాని జరగే అవకాశములు హెచ్చుగా ఉంటుంది.
🙂 స్ధానంలో చంద్రుడు ఉన్న అందమైన వారితో గాని, సంచార వృత్తి లేదా ఉద్యోగం ఉన్న వారితో గాని, జన సంబంద, జనాకర్షణ కలిగిన వృత్తులలో ఉన్న వారితో వివాహం జరిగే అవకాశం ఉంది. అయితే
🙂 చంద్ర స్ధితి కొంత వ్యామోహాలకు,
చంచలత్వానికి సంకేతంగా ఉంటుంది. 🙂 రాహు ఉంటే చేతులార వివాహ సంబంధాలు చెడగొట్టుకుంటారు పరిష్కారాలు చేసుకుంటే కొంత వరకు ఇబ్బందులు అధిగమించవచ్చు.
🙂 లగ్నం నుండి చతుర్ధాధిపతికి సప్తమం, సప్తమాధిపతితో సంబంధం ఏర్పడిన మాతృ వర్గీయులతోను,
దశమాధిపతికి సప్తమం,
సప్తమాధిపతితో సంబంధం ఏర్పడిన పితృ వర్గీయులతో వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి.
🙂 లగ్నం నుండి తృతీయ, నవమ స్ధానాలకు సప్తమ స్ధానంతో సంబంధం ఏర్పడితే సోదరి, సోదరులు లేదా దూరపు బందువులకు సంబందించిన వారితో లేదా వారి చొరవతో వివాహం జరుగుతుంది.
🙂 సప్తమాధిపతి నవమ, ద్వాదశ స్ధానాలలో ఉంటే విదేశాలలో ఉన్నవారితోగాని, భోధన, ప్రచారసమాచార, సంచార రంగాలలో ఉన్న వారితో వివాహం జరగవచ్చును. 🙂సప్తమాధిపతి షష్టమ, అష్టమ, ద్వాదశ స్ధానాలలో ఉన్న వైద్యులతో వివాహం జరుగవచ్చు.
🙂 పంచమ, లాభ, తృతీయ, నవమ స్ధానాలలో ఉన్న, లేదా వాటి అధిపతులు సప్తమంలో ఉన్న ప్రేమ వివాహాలు జరుగవచ్చు.
🙂సప్తమాధిపతి ద్వాదశ భావాలలో
ఏ భావంలో ఉన్న ఆ భావానికి సంబంధించిన విషయాలలో ఆసక్తిగాని, వృత్తిగాని, ప్రాదాన్యంగాని ఉంటుంది.
Comments
Post a Comment