నర్మద పుష్కరాలు

*_𝕝𝕝ॐ𝕝𝕝 నర్మద పుష్కరాలు 𝕝𝕝卐𝕝𝕝_*
❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀

ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు
2024 మే 1 వ తేదీన ప్రారంభమై 
మే 12 వరకు జరుగుతాయి.

బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నర్మదా నది పుష్కరాలు వస్తాయి.  
నర్మదా నది ఏడు పవిత్ర నదులలో ఒకటి. ఇది మన పాపాలను తొలగించి మనకు శుభాలను ప్రసాదిస్తుందని హిందువుల విశ్వాసం. 

"పృథివ్యాం సర్వతీర్థేషు స్నాత్వా యల్లభతే ఫలం
తత్ఫలం లభతే మర్త్యో భక్త్యా స్నాత్వా మహేశ్వర"

"ఓ మహేశ్వరా, భక్తితో నాలో పుణ్యస్నానం చేసేవాడు భూమిలోని అన్ని తీర్థాలలో పుణ్యస్నానాలు చేయడం వల్ల లభించే పుణ్యాన్ని పొందాలి. 
(స్కాంద పురాణం 5.3.4.25)"

నర్మదా పుష్కరాలు అత్యంత పవిత్రమైనవి. ఈ నదిలో పుష్కర స్నానం ఆచరించాడ ద్వారా మనకు ఆధ్యాత్మిక శుద్ధి కలుగుతుంది మరియు పితృ దేవతల ఆశీస్సులను కోరుకునే భక్తులకు అపారమైన ముక్తిని పొందడంలో సహాయపడటానికి మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఆచారాలను నిర్వహించడానికి ఇది పవిత్ర కాలం. 

 *_పుష్కర కధ_* 

పుష్కరుడు అనే మహా భక్తుడు మహేశ్వరుని గురించి ఘోర తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఎం వరం కావాలో కోరుకొమ్మన్నాడు.

అందుకు పుష్కరుడు...

" స్వామీ నదులన్నీ జీవులు చేసిన పాపాలతో నిండిపోయాయి. ఆ నదులని పునీతము చేయుటకై నీ జలమైన శరీరమును నాకిమ్ము , నీ స్పర్శ తో నదులన్నీ పునీతమౌతాయి అని వరం కోరాడు.

ఆ తరువాత బృహస్పతి( గురుడు) కూడా శివుని తనువుని పుష్కరుని వలె పొంది సర్వులకు ఆధారము కావాలని తపము చేసాడు. 

బృహస్పతి తపసుకు మెచ్చి శివుడు, తనకిచ్చిన వరాన్ని గురునికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఆపై బ్రహ్మ గురించి గురుడు తపము చేసి తన కోరికను తెలియజేశాడు. 

అప్పుడు బ్రహ్మ 12 జీవనదులలో సంవత్సరానికొక్కసారి 12 రోజులు పుష్కరుడుండునట్లు, గురుడు ఒక్కో రాశిలో సంచారము బట్టి జరుగుతుందని చెప్పి ఇద్దర్ని శాంతపరిచాడు.

*_గురుడు_*

1 మేష రాశిలో ఉంటే గంగా నది పుష్కరాలు
2 వృషభ రాశిలో ఉంటే నర్మదా నద పుష్కరాలు
3 మిధునంలో ఉంటే సరస్వతీ నది పుష్కరాలు
4 కర్కాటకం లో ఉంటే యమునా నది పుష్కరాలు
5 సింహ రాశిలో ఉంటే గోదావరి నది పుష్కరాలు
6 కన్యా రాశిలో ఉంటే కృష్ణ నది పుష్కరాలు
7 తులా రాశిలో ఉంటే కావేరి నది పుష్కరాలు
8 వృశ్చికంలో ఉంటే భీమా నది పుష్కరాలు
9 ధనూరాశి లో ఉంటే తపతి నద పుష్కరాలు
10 మకరం లో ఉంటే తుంగభాద్ర నది పుష్కరాలు
11 కుంభ రాశిలో ఉంటే సింధూ నది పుష్కరాలు
12 మీన రాశిలో ఉంటే ప్రాణహిత పుష్కరాలు

మనిషి తాను జన్మించిన దగ్గర్నుంచి ఎన్నో పాపాలు తెలిసి తెలియక చేస్తుంటారు. పుష్కర స్నానం చెయ్యడం ద్వారా సమస్త పాపాలు పోతాయని మహాభారతం లో వ్యాసభగవానుడు చెప్పారు.

*జన్నప్రభృతి యత్పాతం స్త్రియా వా పురుషేణ వా౹౹ పుష్కరే స్నాతమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి ౹౹*

స్త్రీ చేత కానీ పురుషుని చేత కానీ పుట్టినప్పటి నుంచి చేయబడిన పాపమంతా పుష్కర సమయంలో స్నానం చేస్తే తొలగిపోతుంది.

పుష్కర సమయంలో మనమే కాదు,
ముక్కోటి దేవతలూ భూమిమీదకొచ్చి పుష్కర స్నానం చేసి తరిస్తారు.

పుష్కర స్నానం వల్ల, అహల్యను భంగం చేసిన దోషాన్ని ఇంద్రుడు పోగొట్టుకున్నాడు.

బ్రహ్మ శిరస్సు ఖండించిన దోషం వలన పొందిన బ్రహ్మహత్యా పాపం నుంచి శివుడు విముక్తుడయ్యాడు.

*_నర్మదా పుష్కర స్నాన ఘాట్_*

అమరకంటక్ ఆలయం, ఓంకారేశ్వర్ ఆలయం, చౌసత్ యోగిని ఆలయం, చౌబీస్ అవతార్ ఆలయం, మహేశ్వర్ మహేశ్వర్ ఆలయం, నెమవార్ సిద్ధేశ్వర్ మందిరం మరియు భోజ్పూర్ శివాలయం చాలా పురాతనమైనవి మరియు ప్రసిద్ధమైనవి. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ ఒకటి మరియు నర్మదా నదిలో పవిత్ర స్నానం చేయడానికి అమరకంటక్ ఉత్తమమైన ప్రదేశాలు.

ఓంకారేశ్వర్ నర్మదా నది ఒడ్డున అనేక అందమైన ఘాట్లు నిర్మించబడ్డాయి. ఈ నది ప్రవాహం నిరంతరం మరియు స్థిరంగా ఉంటుంది మరియు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఘాట్లపై నది లోతు ఎక్కువగా ఉండదు. మరియు భక్తులు సులభంగా స్నానాలు చేయవచ్చు.

భక్తులు లోతు నీటిలోకి వెళ్లకుండా కాపాడేందుకు ఇనుప వలలు, పట్టుకునే చైన్లను ఏర్పాటు చేశారు. వారి భద్రత కోసం సేఫ్టీ బోటు కూడా ఏర్పాటు చేశారు.

ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటి తీర్థ ఘాట్ అన్ని ఘాట్లలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ స్నానం చేయడం వల్ల కోట్లాది తీర్థయాత్రల పుణ్యం లభిస్తుంది.

*_ఓంకారేశ్వర్ లోని ఇతర ముఖ్యమైన ఘాట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి._*

చకర్ తీర్థ ఘాట్

గౌముఖ్ ఘాట్

భైరోన్ ఘాట్

కేవల్రామ్ ఘాట్

నగర్ ఘాట్

బ్రహ్మపురి ఘాట్

సంగం ఘాట్

అభయ్ ఘాట్

*_పుష్కర సమయంలో చేయవలసిన దానాలు_*

మొదటి రోజు :- సువర్ణ దానం, రజిత దానం, ధాన్య దానం, భూదానం చేయాలి.

రెండవరోజు :- వస్త్ర దానం, లవణ దానం, రత్న దానం చేయాలి.
మూడవ రోజు :- గుడ (బెల్లం), అశ్వశాఖ, ఫల దానం చేయాలి.
నాల్గవ రోజు :- నెయ్యి దానం, నూనె దానం, పాలు, తేనె దానం చేయాలి.
ఐదవ రోజు :- ధాన్యదానం, శకట దానం, వృషభ దానం, హలం దానం చేయాలి.
ఆరవవ రోజు :- ఔషధ దానం, కర్పూర దానం, చందన దానం, కస్తూరి దానం చేయాలి.
ఏడవ రోజు :- గృహదానం, పీట దానం, శయ్య దానం చేయాలి.
ఎనిమిద రోజు :- చందనం, కందమూలాల దానం, పుష్ప మాల దానం చేయాలి.
తొమ్మిదవ రోజు :- పిండ దానం, దాసి దానం,
కన్యాదానం, కంబళి దానం చేయాలి.
పదవ రోజు :-కూరగాయలు దానం,
సాలగ్రామ దానం, పుస్తక దానం చేయాలి.
పదకొడవ రోజు :- గజ దానం చేయాలి.
పన్నెండవ రోజు :- నువ్వులు దానం చేయాలి.

*_𝕝𝕝 ॐ 𝕝𝕝 oఓo శ్రీమాత్రే నమః 𝕝𝕝 卐 𝕝𝕝_*

*_𝕝𝕝 ॐ 𝕝𝕝 oఓo నమః శివాయః 𝕝𝕝 卐 𝕝𝕝_*

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: