కేంద్రాదిరాశి సంజ్ఞలు :
కంటకకేంద్ర చతుష్టయ సంజ్ఞా:
సప్తమలగ్న చతుర్ధ ఖ భానాం |
తేషు యధాభిహితేషు బలాఢ్యాః
కీట న రాంబుచరాః పశవశ్చ ॥
కేంద్రాదిరాశి సంజ్ఞలు : సప్తమ లగ్న చతుర్థ దశమభావములకు కంటకములనియును, కేంద్రములనియునూ, చతుష్టయములనియునూ మూడుపేర్లు కలవు.
పై చెప్పిన క్రమములోనే అనగా సప్త లగ్న చతుర్థ దశమ రాశులలో కీటరాశులు,నరరాశులు జలరాశులు - చతుష్పదరాశులు బలవంతములగును. అనగా (1) సప్తమము కీటరాశి వృశ్చికము. (2) లగ్నము నరరాశులు అనగా మిధున కన్యాతులా ధనుష్పూర్వార్థ కుంభరాశులైన బలవంతములు, (3) చతుర్థము జలరాశులు అనగా కర్కాటక మకరోత్తరార్ధ మీనములైన బలవంతములు. (4) దశమస్థానము చతుష్పదరాశులు అనగా - మేషము, వృషభము, ధనుస్సునం దుత్తరార్థము, సింహరాశియు నైన బలవంతములు.
Comments
Post a Comment