విదేశీయానము గ్రహ పరిశీలన

✈️విదేశీయానము గ్రహ పరిశీలన ✈️

1.జాతకంలో లగ్నాధిపతి భాగ్యాధిపతి పరివర్తన చెందుతున్నారా లేదా చూడాలి.

 2.జాతకంలో భాగ్యాధిపతి వ్యయాధిపతులు పరివర్తన చెందారా లేదా చూడాలి.

 3.లగ్నాధిపతి భాగ్యాధిపతి వ్యయాధిపతి చరరాశుల్లో ఉండాలి.

 4.లగ్నాత్ తృతీయ స్థానము చిన్న ప్రయాణములు తెలియచేయును. 

5.లగ్నాత్ నవమ స్థానము తీర్థయాత్రలు తెలియజేయును.

 6.లగ్నాతు ద్వాదశ స్థానం విదేశీ ప్రయాణమును తెలియజేయును

 7.వ్యయాధిపతి ముఖ్యముగా చరరాశిలో ఉండాలి.

8.వ్యయాధిపతి పైన గురు దృష్టి తప్పక ఉండాలి.

 9.వ్యయస్థానంపై గురు దృష్టి తప్పక ఉండాలి.

 10.వ్యయాధిపతి చతుర్ధ స్థానములో ఉన్నచో విద్య కొరకు విదేశీయానం చేస్తారు.
 
11.ద్వితీయాధిపతి సప్తమాధిపతి పరివర్తన చెందిన కూడా విదేశీయానం చేయవచ్చు.

12. గురువు ద్వాదశ స్థానానిపై దృష్టి ఉన్న ద్వాదశాధిపతి గురువును చూస్తూ ఉన్న కూడా విదేశీయానం కచ్చితంగా ఉంటుంది.

 13.ద్వాదశ స్థానము ముఖ్యంగా విదేశీయానమును సూచించును.

14.తృతీయ స్థానము ముఖ్యంగా చిన్న ప్రయాణములు సూచించును.
 15.ద్వాదశధిపతి చతుర్ధ స్థానంలో ఉండుట దూర ప్రయాణములు సూచించును.

16. విలాస, వివాహ, విహార విషయంలపై ప్రయాణమును సూచించును.

17. బృహత్ పరాశరలో పరాశర హోరాశాస్త్రంలో పరాశరులవారు తృతీయ సప్తమస్థానములు యాత్రలను నవమస్థానాలు దూర ప్రయాణములు తెలియచేయునని సూచించెను.

18.ఉత్తర కాలామృతంలో కాళిదాసులవారు తృతీయము చిన్న ప్రయాణాలు చతుర్ధ, సప్తమ, నవమ, వ్యయభావాలు దూర ప్రయాణములు సూచించినారు.

 19. సత్యాచార్యులవారు సప్తమ భావాన్ని ప్రయాణము గురించి సూచించినారు.

20.జాతక పారిజాతంలో నవమ భావాన్ని ప్రయాణము గురించి సూచించినారు. 
✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: