మూడు గ్రహాల ఉచ్ఛ

జ్యోతిష భాగంలో మూడు గ్రహాల ఉచ్ఛను పొంది.... ఒక గ్రహం నీచ పొందితే మాత్రమే రాజయోగం ని చెప్తూ ఉంటారు. త్రివీర్య నీచ రాజయోగం ఇంకొక దాన్ని కూడా చెప్తారు. 3 బలమైన గ్రహాలు ఒక బలహీనమైన గ్రహం ఉంటేనే రాజయోగం అనే మాటలో ఉన్న రహస్యము ఇది. దాని కోసమే ఈ ఆర్టికల్ వ్రాయడం జరిగింది. చరిత్ర చదువుతున్నప్పుడు అల్లారుముద్దుగా పెంచిన కృష్ణదేవరాయలు ని మంత్రి తిమ్మరసు రాజును చేయబోతున్నప్పుడు... సైన్యం అందర్నీ పంపించివేసి ఒంటరిగా ఉండి ప్రేమించిన కృష్ణదేవరాయల్ని గట్టిగా చెంప దెబ్బ కొట్టాడు అని చెప్తారు. దానితో రాయులకి కన్నీళ్లు తరిగాయట. ఇప్పుడు దాకా అన్నీ చూసావు ఇది (ప్రేమించిన వాడు గట్టిగా దెబ్బకొట్టడంతో వచ్చే కన్నీరు.. బాధ) చూడకపోతే నువ్వు రాజు కాలేవు అని చెప్పారు అని చెప్తూ ఉంటారు. రాజు కి ఉచ్ఛం నీచం అన్ని తెలిసి ఉండాలని చెబుతాడు. ఆ విధంగా గ్రహాలు పనిచేస్తుంటారు.

మగవాడు తిరగక చెడతాడు అని.... జ్యోతిష్య భాగంలో నీచమెరిగినటువంటి వాడు ఉచ్చ కు రాడు అని అంటూ ఉంటారు.

ఇదే విషయాన్ని ఏ వి సుందరం గారు మాటల్లో చెప్పాలి అంటే.... ఏదైనా ఒక గ్రహం దాని మూల త్రికోణ స్థానం నుంచి మొదట నీచను తాకి ఉచ్ఛకు వస్తుంది అని. దీనిలో ఒక శుక్రుడుకు మాత్రమే ఎక్సెప్షన్ అని చెబుతారు. అది కూడా శుక్రుడు వెనుకకు తిరుగుతాడు కాబట్టి దానికి వెనక నీచ ఉంటుంది అని చెబుతారు.

బుధ చంద్రులకు మూల త్రికోణ క్షేత్రమే ఉచ్చక్షేత్రం. శుక్రుడుతో సహా ఈ మూడు స్త్రీత్వం ఆపాదించబడిన గ్రహాలు. ఇది కూడా ఒక విశేషం కావచ్చు🤔🙏😊

మూల త్రికోణ భాగలు చూడండి, వాటిని దాటిన తరువాత మొదలుగా వచ్చేది నీచభాగలే. చంద్రుడికి వృషభరాశి లో మొదటి మూడు భాగాలు ఉచ్ఛభాగలు. దాని తరువాత మూల త్రికోణ భాగాలు. నాలుగో భాగం నుంచి 30వ భాగం దాకా. మూల త్రికోణం దాటగానే మొదలు ఉచ్ఛభాగలు వస్తున్నాయా లేదా నీచ భాగలు వస్తున్నాయా... నీచ భాగాలు మాత్రమే వస్తాయి.🙏🌹🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: