జ్యోతిష్యుడు
*ఓ జ్యోతిష్యుడు, ఓ పోలీస్ అధికారి, ఓ బ్యాంక్ అధికారి గారు ముగ్గురూ ఓ నౌకలో ప్రయాణిస్తున్నారు. సముద్రం మధ్యకి నౌక చేరగానే ఒక సముద్ర రాక్షసుడు వారి ముందు ప్రత్యక్ష మయ్యాడు. మిమల్ని తినేస్తా అని పెద్దగా కేకలు పెడుతున్నాడు.*
*ముగ్గురూ భయంతో వణికి పోతున్నారు. వారు భయపడటం చూసిన రాక్షసుడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. వాళ్ళతో యిలా అన్నాడు, మీ ముగ్గురూ మీకు తోచింది సముద్రం లోకి విసిరి వేయండి.*
*నేను తెచ్చి యిస్తే గెలుపునాదే. వస్తువు తేలేకపోతే గెలుపు మీది వాళ్ళని వదిలేస్తాను. వాళ్లకు నేను జీవితాంతము బానిసగా వుంటాను అన్నాడు. సరే నని* *ముందుగా బ్యాంక్ అధికారి తన చేతి వజ్రపు ఉంగరం విసిరేశాడు.*
*సముద్రం లో మునిగి కాసేపటికి రాక్షసుడు ఆ ఉంగరాన్ని తెచ్చి ఆ వ్యక్తిని మింగేశాడు.*
*తరువాత పోలీస్ గారు తన చేతికున్న ఖరీదైన వాచీ ని నీళ్ళలోకి విసిరేశాడు.*
*రాక్షసుడు సముద్రం లోకి దూకి దాన్నీ తెచ్చేసి అతన్ని మింగేశాడు.*
*ఇంక జ్యోతిషుడు వంతు వచ్చింది.*
*అతను కొంచెం యోచన చేసి తన దగ్గరవున్న నీళ్ళ సీసా మూత తీసి అందులోని నీళ్ళను సముద్రం లోకి ధారగా పోశాడు. నా మంచి నీళ్ళను నాకు తెచ్చి యివ్వు అన్నాడు.*
*ఆ దెబ్బకి రాక్షసుడికి దిమ్మ తిరిగి పోయింది.*
*ఇది జ్యోతిష్యుడు దెబ్బ ఎలావుంది? అన్నాడు రాక్షసుడితో.*
*రాక్షసుడు తన ఓటమి ఒప్పుకొని అతనికి బానిసగా ఉండటానికి ఒప్పుకున్నాడు.*
*నా స్నేహితుల నిద్దరినీ బ్రతికించు అని ఆజ్ఞాపించాడు, వాడు వాళ్ళని కక్కేశాడు.*
*మంచి పని చేశావు. యింక ఎవ్వరినీ యిలా బాధించకుండా వుంటానంటే నిన్ను బానిసత్వం నుంచి విముక్తుడిని చేస్తాను అన్నాడు. రాక్షసుడు అలా చెయ్యనని ప్రమాణం చేసి సముద్రం లోకి దూకి మాయమయ్యాడు. ఎంతటి ఆపద వచ్చిన ఆలోచించే వాడు జ్యోతిష్యుడు*
*🙏సమాజానికి సమస్య వస్తే తగు పరిష్కారం సూచించగలిగే వాడు జ్యోతిష్యుడు (గురువు)🙏*
Comments
Post a Comment