స్త్రీపురుషాత్మకమగు ఈ జగత్తు

భగవన్‌ పరమేశస్య 
శర్వస్యామితతేజసః | మూర్తిభిర్విశ్వమేవేదం యథా వ్యాప్తం తథా శ్రుతమ్‌ || 1

అథైతత్‌ జ్ఞాతుమిచ్ఛామి యాథాత్మ్యం పరమేశయోః | 
స్త్రీపుంభావాత్మకం చేదం తాభ్యాం కథమధిష్ఠితమ్‌ || 2

శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను -

ఓ పూజ్యా! జగత్సంహారకుడు, అనంతమగు తేజస్సు గలవాడు అగు పరమేశ్వరుని మూర్తులచే ఈ జగత్తు ఏ విధముగా నిశ్చయముగా వ్యాపించబడి యున్నదో, 
ఆ వివరములను వింటిని (1). 

తరువాత పార్వతీపరమేశ్వరుల స్వరూపమును గురించి నేను తెలియగోరుచున్నాను. స్త్రీపురుషాత్మకమగు ఈ జగత్తును వారిద్దరు ఎట్లు అధిష్ఠించి 
యున్నారు? (2)

ఉపమన్యురువాచ |

శ్రీమద్విభూతిం శివయోర్యాథాత్మ్యం చ సమాసతః | 
వక్ష్యే తద్విస్తరాద్వక్తుం భ## 
వేనాపి న శక్యతే || 3

శక్తిస్సాక్షాన్మహాదేవీ మహాదేవశ్చ 
శక్తిమాన్‌ | 
తయోర్విభూతిలేశో వై సర్వమేతచ్చరాచరమ్‌ || 4

వస్తు కించిదచిద్రూపం కించిద్వస్తు చిదాత్మకమ్‌ | 
ద్వయం శుద్ధమశుద్ధం చ పరం చాపరమేవ చ || 5

యత్సంసరతి చిచ్చక్రమచిచ్చక్రసమనిత్వమ్‌ | తదేవాశుద్ధమపరమితరం తు పరం శుభమ్‌ || 6

అపరం చ పరం చైవ ద్వయం చిదచిదాత్మకమ్‌ | శివస్య చ శివాయాశ్చ స్వామ్యం చైతత్స్వభావతః || 7

శివయోర్వైవశే విశ్వం న విశ్వస్య వశే శివౌ | ఈశితవ్యమిదం యస్మాత్తస్మాద్విశ్వేశ్వరౌ శివౌ || 8

యథా శివస్తథా దేవీ యథా దేవీ తథా శివః | నానయోరంతరం విద్యాచ్చంద్రచంద్రికయోరివ || 9

చంద్రో న ఖలు భాత్యేష యథా చంద్రికయా వినా | 
న భాతి విద్యమానో%పి 
తథా శక్త్యా వినా శివః || 10

ప్రభయా హి వినా యద్వద్భానురేష న విద్యతే | 
ప్రభా చ భానునా తేన సుతరాం తదుపాశ్రయా || 11

ఏవం పరస్పరాపేక్షా శక్తిశక్తిమతోః స్థితా | న శివేన వినా శక్తిర్న 
శక్త్యా చ వినా శివః || 12

ఉపమన్యుడు ఇట్లు పలికెను -

పార్వతీపరమేశ్వరుల శోభాయుక్తమైన విభూతి (మహిమ) ని మరియు వారి స్వరూపమును సంగ్రహముగా చెప్పగలను. దానిని విస్తరముగా చెప్పుటకు భవునకైననూ 
శక్యము కాదు (3). మహాదేవి సాక్షాత్తుగా శక్తి కాగా, మహాదేవుడు ఆ శక్తి గలవాడు. ఈ చరాచరజగత్తు అంతా వారి విభూతియొక్క లేశము మాత్రమే (4). కొన్ని వస్తువులు జడములు కాగా, మరికొన్ని చేతనస్వరూపములై యున్నవి. ఈ రెండు శుద్ధము-అశుద్ధము అనియు, పరము-అపరము అనియు విభాగమును కలిగియున్నవి (5). జడముల సముదాయముతో గూడి సంసారముననుభవించు చేతనుడే అశుద్ధుడు మరియు అపరుడు కాగా, దీనికి భిన్నమైనది (జడము నుండి సంసారమునుండి విముక్తిని పొందిన చేతనుడు) శుద్ధము మరియు పరము అగును (6). అపరము మరియు పరము అనే రెండు స్వయముగా చేతన-జడస్వరూపములై యున్నవి. వీటిపై పార్వతీపరమేశ్వరులకు సహజముగనే ప్రభుత్వము గలదు (7). జగత్తు పార్వతీ పరమేశ్వరుల వశములో నున్నదియే గాని, పార్వతీపరమేశ్వరులు జగత్తునకు వశములో లేరు. ఏలయన, ఈ జగత్తును నియమించ వలసి యున్నది. కావున, పార్వతీపరమేశ్వరులు జగత్తునకు శాసకులగుచున్నారు (8). శివుడు ఎట్లో దేవి అట్లే, దేవి ఎట్లో శివుడ అట్లే, చంద్రునకు వెన్నెలకు వలె వీరిద్దరికి మధ్యలో భేదము లేదు (9). వెన్నెల లేనిదే ఈ చంద్రుడు ప్రకాశించడు. అదే విధముగా శివుడు ఉనికి గలవాడే అయిననూ, శక్తి లేనిదే ప్రకాశించడు (10). కాంతి లేనిదే ఈ సూర్యుడే లేడు. సూర్యుడు లేనిదే కాంతి మనజాలదు. కాంతి పూర్తిగా సూర్యుని ఆశ్రయించి యున్నది (11). ఇదే విధముగా శక్తికి శక్తిమంతనకు అన్యోన్యమగు అపేక్ష గలదు. శివుడు లేనిదే శక్తి లేదు. శక్తి లేనిదే శివుడు లేడు (12).

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: