ద్వికళత్రయోగం
ద్వికళత్రయోగం కి సంబంధించి విషయానికి వస్తే
మన భారతీయ సనాతన వైదిక ధర్మం లో
స్త్రీకి ద్వితీయ వివాహం లేదు
పురాణాల విషయం ఇక్కడ ప్రస్తావన వద్దు!
పురుషులకి విద్య వివాహం చెప్పబడింది
ఎందుచేత ధార్మికమైన సంతానాన్ని పొందడానికి మాత్రమే వివాహం చేసుకుంటున్నాడు.
కాబట్టి సంతానం లేని కారణంచేత లేదా స్త్రీ జాతకంలో లేదా పురుష జాతకంలో సంతాన యోగం లేకపోవడం చేత
ద్వితీయ వివాహం చేసుకుంటున్నాడు పురుషుడు
భార్య చనిపోతే మరో స్త్రీని వివాహం చేసుకుంటున్నాడు.
లేదా సంతానం పోషింప పడడానికి చేసుకుంటున్నాడు.
ఈ రోజుల్లో మంచి మంచి పురుష జాతకాల్లో చాలామంది పండితులు లగ్నాత్ సప్తమంలో రెండు గ్రహాలు గనక ఉంటే
ఇంకా వేరే ఇతరత్రా
గ్రహాల దృష్టి నవాంశలో గాని పరిశీలన చేసి చెప్తున్నారు.
ద్వితీయ వివాహం చేసుకోవడానికి ఆస్కారం ఉన్నా
కొందరికి అది కుదరడం లేదు .
ఎందుకు అంటే కొన్ని
సామాజిక చట్టాలు దానికి అడ్డంగా ఉన్నాయి. మరిప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి?
రెండో వివాహం చేసుకోవాలన్న కోరిక తీవ్రంగా ఉంటుంది ఆ జాతకుడి లో కానీ దేశకాలమాన పరిస్థితులను అనుసరించి అది జరగదు.
కాబట్టి పక్కదోవ పట్టే అవకాశం కూడా ఉంటుంది స్త్రీపురుషులు ఇద్దరు.
కాబట్టి దాన్ని ద్వికళత్రయోగం అనక్కర్లేదు ఏమో?
కొన్ని జాతకాలు! అన్ని జాతకాల్లో కాదు.
లగ్నాత్ 2
7 స్థానములందు
పాప గ్రహాలు ఉంటే ద్వితీయ వివాహం ఆస్కారం ఉంటుంది.
అష్టమ స్థానానికి గాని
అష్టమాధిపతి గాని
పాప సంబంధము గల
గ్రహాల పైన బృహస్పతి దృష్టి ఉంటే రెండు వివాహాలు.
ద్వితీయ సప్తమ అష్టమ స్థానాలలో మరియు చతుర్థ ద్వాదశ స్థానాలలో
కుజ శుక్రులుండి బలహీనులయితే
రెండు వివాహాలు.
సప్తమాధిపతి బృహస్పతితో ను
పంచమాధిపతి తో కలిసి కనుక ఉంటే
తప్పకుండా జాతకునికి ఇద్దరు భార్యలు ఉండే అవకాశం ఉంది.
శుక్రుడు వృషభంలో, సింహము లో
వృశ్చికములో
కుంభములలో ఉండి
అంగారకుడు సూర్యుడు తో కలిసినట్లయితే ఇద్దరు భార్యలు ఉంటారు.
శుక్రుడు గురువుతో కలిసి ఏడవ స్థానంలో ఉన్నట్లయితే ఇద్దరు భార్యలు ఉండే ఆస్కారం ఉంది.
సప్తమాధిపతి కుజ రాహువుల తో కలిసి ఉంటే ముగ్గురు భార్యలు ఉండే ఆస్కారం ఉంటుంది.
సప్తమంలో అంగారకుడు చంద్రునితో కలసి ఉండి లగ్నాధిపతి అష్టమంలో ఉన్న ముగ్గురు భార్యలు ఉండే ఆస్కారం ఉంది.
ఇంకా ఇటువంటి కాంబినేషన్స్ చాలా ఉన్నాయి.
ఈ పైన చెప్పిన ఉదాహరణలు నేను పరిశీలించినటువంటి జాతకాలు.
Comments
Post a Comment