ఓర్పుతో వ్యవహరించాలి
చెట్టుకు ఉన్న మొగ్గ విచ్చుకుని పుష్పంగా రూపు సంతరించుకోవడానికి కొంత సమయం పడుతుంది.
ఆ సమయం దాకా వేచి ఉంటేనే సుగంధాలు వెదజల్లే పుష్పం మనకు లభిస్తుంది. ఆలోగా ఎన్ని బిందెలు నీళ్లు పోసినా కోరుకున్న పుష్పం లభ్యం కాదు. కొన్ని కార్యాలు నెరవేరాలంటే కొంతకాలం నిరీక్షించాలి. కాలం కలిసి వచ్చేవరకు ఆగాలి. ఓర్పుతో వ్యవహరించాలి. అప్పుడే అనుకున్న కార్యాలు ఆశించినట్లుగా జరుగుతాయి. వసంతం కోసం, వర్షం కోసం చెట్లు నిరీక్షించవు, ప్రార్ధించవు, ప్రాధేయపడవు. కాలం అనుకూలించగానే వసంతాగమనంతో చెట్లు చిగురిస్తాయి. గీతలో భగవానుడు బోధించినట్లుగా మనిషి కూడా తన పనిని తాను త్రికరణ శుద్ధితో నిర్వర్తించాలి. ఫలితం కోసం ఎదురుచూడకూడదు. అర్థం లేని నిరీక్షణతో కాలాన్ని వృథా చేయకూడదు. నేడు జరగనిది రేపు తప్పక జరుగుతుందనే ఆశావాదంతో ముందుకు సాగాలి...
Comments
Post a Comment