జాతక చక్రంలో శుక్రుడు
జాతక చక్రంలో శుక్రుడు శత్రు, నీచ క్షేత్రములలో ఉన్నఎడల కళత్ర వియోగం,(శుక్రస్థితి బాగున్ననూ, యోగించినచో) కళత్ర భంగము కలదు. ద్వికళత్ర యోగము, త్రి కళత్ర యోగము, ప్రేమ వివాహము అందువల్ల అపఖ్యాతి, అవయోగము అన్య స్త్రీ బానిసత్వము, వ్యసనము, బథ్థకము,పరాకాష్టకు చేరి స్త్రీ సంపాదన మీద జీవించుట, వృత్తి, ఉద్యోగము లేకుండా డాంబికముగా, బిజీగా తిరుగునట్లుగా నటించుట, నీచక్షేత్ర శుక్రస్థితిచే, భార్యతో అన్యోన్యత లేకుండుట, ప్రేమ వివాహ వైఫల్యము, వివాహము శాపముగా అన్ని కష్టములకు ప్రథాన బిందువుగా మారడము, భార్య వేరొకరితో వెళ్ళిపోవుట, విడాకులు రాకుండుట, స్త్రీల జీవితాన్ని పాడుచేయుట, చౌకబారు సెంటులు వాడుట, పెంట ప్రోగులు ఊడ్చుట, నీళ్ళు పట్టడము, వంటవృత్తి, చిల్లర గుడ్డల వ్యాపారం, వాహనాన్ని పదే పదే తుడుచుకోవడము, చిన్నచిన్న గుడ్డలతో (వస్త్రములతో) సంకోచము లేకుండా నలుగురిలో తిరగడము వంటి లక్షణాలు యోగాలు సంప్రాప్తిస్తాయి.
Comments
Post a Comment