కళత్ర సంఖ్యా విచారణ
కళత్ర సంఖ్యా విచారణ
(1) సప్తమమున బుధగురులు, రవికుజులు ఉన్న ఒక్క భార్య ఉండును.
(2)లగ్న సప్తమాధిపతులు లగ్నమునగాని, లగ్నమునగాని ఉన్న ఇద్దరు భార్యలు.
(3) సప్తమ, అష్టమములందు పాపగ్రహములుండి, కుజుడు వ్యయమున ఉండి, వ్యయాధిపతి అదృశ్య చక్రార్ధగతుడైన (1-6) జాతకునకు ద్వితీయ వివాహమగును.
(4) సప్తమాధిపతి శుభగ్రహములతో త్రికమున, (6,8,12)ఉండి, సప్తమమున పాపగ్రహములున్న ఇద్దరు భార్యలుందురు.
(5)లగ్నాధిపతి ద్వాదశమున ఉండి, ద్వితీయాధిపతి పాపగ్రహ సంబంధము కలిగియుండి, సప్తమమున పాపగ్రహ సంబంధమున్న ఇద్దరు భార్యలుందురు.
(6)కుజుడు సప్తమ, అష్టమ, వ్యయములందుండి, సప్తమాధిపతి దృష్టిలేకున్న ఇద్దరు భార్యలుందురు.
(7)సప్తమ ద్వితీయములు పాపగ్రహ సంబంధముకలవై సప్తమ, ద్వితీయాధిపతులు దుర్భలులైన ద్వితీయ వివాహమగును.
(8)సప్తమమునగాని ద్వితీయమునగాని ఎక్కువ పాపగ్రహములుండి, ద్వితీయ, సప్తమాధిపతులకు పాపగ్రహదృష్టి యున్న త్రికలత్రయెాగము.
(9)లగ్నద్వితీయ సప్తమములందు పాపగ్రహముండి, సప్తమాధిపతి నీచస్థుడుగాని, అస్తంగతుడుగాని అయిన త్రికళత్రయెాగము.
(10)భాగ్యధిపతి సప్తమమున, సప్తమాధిపతి చతుర్థముననున్నా, లేక సప్తమ ఏకాదశాధిపతులు కేంద్రములందున్న జాతకుడు బహు కళత్రుడగును.
Comments
Post a Comment