పునర్భూ దోషం లేదా విష యోగం

పునర్భూ దోషం లేదా విష యోగం అనేది చంద్ర, శని గ్రహాల కలయిక వల్ల కలుగుతుంది.

చంద్రుడు జ్యోతిషశాస్త్రంలో అత్యంత వేగంగా కదిలే గ్రహం, ఇది మన భావోద్వేగాలు,, భావాలు, మనస్సు కు కారకత్వం వహిస్తాడు 

శని‌ జ్యోతిష్య శాస్త్రంలో నెమ్మదిగా కదలే గ్రహం. క్రమశిక్షణ నేర్పుతుంది, మన కర్మ మరియు కార్యస్థానాన్ని చూసుకుంటుంది. మన కర్మ ఆధారంగా విజయం / వైఫల్యాన్ని అందిస్తుంది. కాస్త కఠినంగా ఉన్నా ఓపికతో. హార్డ్ వర్కర్ మరియు సాధారణ జీవితాన్ని ఇష్టపడతారు.

శని చంద్రుల కలయిక అంటే తీవ్ర వ్యతిరేకతలు కలవారు కలిసి జీవించడం ప్రారంభించినప్పుడు ఏమి జరుగుతుంది?

చాలా భిన్నాభిప్రాయాలు, చాలా ప్రయత్నాలు మరియు పునరావృతమయ్యే పని కానీ చివరికి వారు తమ తేడాలను గుర్తించు మనసు అదుపులో పెట్టుకున్నప్పుడు, నేర్చుకున్నప్పుడు, వారు ఉత్తమ స్నేహితులను చేస్తారు. పునర్భూ లేదా విష యోగాలో దాదాపు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇక దీనిని విషయోగం అని ఎందుకంటారు?
విషమ బాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానంగా లేనటువంటిది అనర్థం. దేనికదే భిన్నంగా ఉన్నటువంటిది.‌ వ్యత్యాసముల గల భుజాలు. మనసులు స్థిర నిర్ణయం లేక అల్లాడుతూ ఉన్న వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు చాలా త్వరగా దెబ్బతింటాయి. క్లారిటీ లేని జీవితాలు అని మనం మాట్లాడుతూ ఉంటాం. క్లారిటీ లేని వ్యవహారాలు క్లారిటీ లేని జీవితాలు క్లారిటీ లేని సంభందాలు విఫలమవుతా ఉంటాయి. పెద్ద మనుషుల మధ్యకి పంచాయతీకి వెళ్తాయి. In English we can call it as difference of opinions, attitudes and approaches.... Leads to conflict. సరియైన మార్గ నిర్దేశకుడు... సరియైన మార్గానిర్దేశకత్వం చేయలేని మనసు.... ఇద్దరి వ్యక్తులకి ఉంటే... వారిద్దరు భార్యాభర్తలు గా ఉంటే.... బ్రతుకు చేపల మార్కెట్ అవుతుంది. ఇన్ని విషమ లక్షణాలు కలిగినటువంటి కలయిక కాబట్టి దీనిని విషమ యోగము లేక విష యోగము అంటారు. అది ఏమి చేస్తుందంటే పునర్ వ్యవహార సంధానంగా మారుతుంది... అంటే వ్యవహారం మొదటి నుంచి మొదలవుతుంది.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: