కలిపురుష ప్రభావం నశించిపోతుంది

కలిపురుష ప్రభావం నశించిపోతుంది

కొన్ని విశేషాలను ప్రస్తావన చేయాలనుకుంటున్నాను. బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఇంట్రాక్టివ్ గా ఉంటే‌ ఈ విషయాన్ని తేటతెల్లం చేయవచ్చు.
 
కత్తి ఏ రకంగా రెండు వైపులా పదును తేలి ఉంటే ప్రమాదమో నేను చెప్పబోయే విషయం కూడా అంతే సమ ప్రాధాన్యత కలిగి ఉన్నది


కొద్దిగా అవుట్ ఆఫ్ బాక్స్ అని అనిపించినా కొన్ని విషయాలను ప్రస్తావన చేస్తాను చివరాకరికి మనం తెలుసుకోవాల్సిన విషయం తెలుస్తాయి.

 శ్రియః కురూణామదిపస్య పాలం –
ప్రజాసు వృత్తింయమయంక్త్య వేదితుం
సవర్ణిలింగీవిదితస్సమాయయౌ –
యుదిస్టిరంద్వైతవనే వనేచరః ‘’

మాయాజూదంలో కౌరవుల చేత ఓడింప బడిన ధర్మరాజు ద్వైతవనం నుంచి, దుర్యోధనుడి పాలనా విధానం ఎలా ఉందో తెలుసుకొని రమ్మని ఒక వనచరుడిని పంపగా అతడు బ్రహ్మచారి వేషంలో తిరిగి దుర్యోధన పాలనా విధానం అంతా ఆకళింపు చేసుకొని యుదిస్టిరు నికి వివరించటానికి వచ్చాడు.

  ధర్మరాజుకు నమస్కరించి ‘’ప్రభూ! మీ శత్రువు దుర్యోధనుడు భూమి అంతా ఆక్రమించి, ప్రజాను రంజకంగా పాలన చేస్తున్నాడు. ప్రజలుకూడా చాలా ఆనందంగా ఉన్నారు. మీ సోదరుల ఊసు కూడా ఎత్తనీయకుండా రాజు వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాడు. కనుక ప్రజలలో దుర్యోధనభక్తి పెరిగిపోయింది. ఇవన్నీ మీకు అప్రియాలే అయినా స్వామి మంచికోరి నేను ఏ మాత్రం సంకోచించకుండా నివేదించాను. ముఖప్రీతికోసం అసత్యం చెప్పరాదు. అలాచేస్తే కార్య విఘాతం జరుగుతుంది. కనుక కింకరులు ప్రభువు సమక్షంలో ఎప్పుడూ సత్యమే చెబుతారు‘’అన్నాడు.

ఇది కీరతార్జనీయములో తొలి శ్లోకం యొక్క ఆముల్లాగ్ర అర్థం.

కిరాతార్జునీయం ప్రతి సర్గ లోని చివరి శ్లోకంలో భారవి కవి ‘’లక్ష్మి ‘’శబ్దాన్ని ప్రయోగించాడు అందుకే దీనికి ‘’లక్ష్మంత కావ్యం ‘’అనే పేరొచ్చింది.


భారవి ఛందో వైవిధ్యంతో ఎన్నో శ్లోకాలు రాశాడు కాని ఆయను ఇష్టమైనది ‘’వంశస్థ’’ అనే ఛందస్సు మాత్రమే. ఈ ఛందస్సు భారవి ప్రతిభను ద్విగుణీకృతం చేసిందని క్షేమేంద్రుడు ‘’సువృత్తి తిలకం ‘’లో అన్నాడు –‘

‘’వృత్త చత్రస్య సా కాపి ‘’వంశస్థస్య ‘’ విచిత్రతా –ప్రతిభా భారవేర్యేన సచ్చాయే నాధికీ కృతా’’


న నోనా నున్నో నున్నోనో నానా నాన నాను –
నన్నో నున్నో ననున్నేనో నానేనా నున్న ననున్నాత్ ‘’

 –న అనే ఒకే అక్షరంతో రాసిన శ్లోకం ఇది. బాగా ప్రచారమైంది కూడా. దీని అర్ధం –‘’అనేక ముఖాల వాళ్ళల్లారా! ఆయన మనిషి కాదు. తనకంటే తక్కువ బల వంతుని చేతిలో ఓడిపోయాడు. ఆయన బలహీనుడి చేతిలో ఓడిపోయేవాడేమీ కాదు. నిజానికి అతని అధినాయకుడు ఓడిపోలేదు. పైచేయి ఆయనంత మాత్రాన అయిపోలేదు. పీడించే వాడు అదృశ్యమైనాడు. అది పాప కార్యం కాదు.

ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. భారవి రాసిన కిరాతార్జునియము లక్ష్మీప్రదం ఎందుకు అవుతుంది.

దీనికి జ్యోతిష్యాలకి సంబంధం ఏమిటి?

ధర్మరాజు అనే వ్యక్తి మానసిక సంఘర్షణలకులోనై ఉత్థాన పతనాలను చేరుతూ ఉండటం అనేటువంటిది సహజంగా సూచన చేస్తూ ఉంటుంది. జూదంలో ఓడిపోయి వచ్చిన మహారాజు బేలగా మారి మహర్షిని ప్రశ్న అడుగుతూ ఉన్నటువంటి క్షణం నుంచి ప్రారంభమవుతుంది ఈ గ్రంథం.

అప్పుడు నలుడి కథ చెప్పడం జరుగుతుంది. నలుడికి పాండవులకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. నలుడిలో ఉన్న ఐదు క్వాలిటీస్ పాండవులలో ఒక్కొక్కటి ఉంటుంది. ఈ రచన ప్రారంభంలో ధర్మరాజుకి ఆక్వాలిటీ ఉండదు. చివరకు నలుడుకున్న క్వాలిటీని అతను పొందుతాడు.

నలుడు ఆ క్వాలిటీని ఋతుపరుణ మహారాజు దగ్గర నుంచి పొందడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని అక్షవిద్య అని అంటారు. మహాభారతంలో దీని ప్రస్తావన మంత్ర రూపకంగా ఉండదు.

ఈ రుతుపర్ణ మహారాజుకి తెలిసిన విద్య నలుడుకి బోధిస్తాడు. నలుడుకు తెలిసిన విద్య ఋతుపర్ణ మహారాజుకి నేర్పుతాడు.

విషయం ఎక్కడ వస్తుంది అంటే... నలుడు పొట్టి గుర్రాన్ని సమకూర్చుకొని... రథాన్ని సిద్ధం చేసి దమయంతి స్వయంవరానికి బయలుదేరుతాడు. అప్పుడు ఋతుపర్ణ మహారాజు యొక్క ఉత్తరీయము జారీ పడిపోతుంది.
 
 రథాన్ని ఆపు ఉత్తరీయం తెచ్చుకొనటానికి సేవకుని పంపిస్తాను అని చెబుతాడు రుతుపర్ణ మహారాజు. ఆ సేవకుడు వెళ్లి ఉత్తరీయం తేవడానికి పది రోజులు పడుతుంది అంటాడు నలుడు. ఆశ్చర్య పోతు‌.... రుతుపర్ణ మహారాజు కూడా ఒక విద్యను చెబుతాడు. ఏ విద్యను అయితే చెబుతారో‌ ఆ విద్య పేరే అక్ష హృదయం.


ఈ అక్షవిద్య తెలియటం వల్ల కలిపురుషుడు ప్రభావం నశించిపోతుంది నలుడు పైన. ఇక కలియుగ ప్రభావము నలుడు మీద పనిచేయదు. ఈ విద్య తెలుసుకోవడం వల్ల విజయం సంప్రాప్తమవుతుంది.
 అపజయమనేది ఉండదు. అనేది దాని యొక్క లక్ష్యం. ఇలాంటి విశేషాలు కిరాతార్జునియంలో చాలా ఉన్నాయి. ఇవి అన్ని లక్ష్మీప్రదమైనటువంటి వ్యవహారాల్లో గొప్ప సూచనలను చేయగలవు. అందుకని దీన్ని లక్ష్మీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది.

లక్ష్మి పదము అంత్యంలో ఉన్న కావ్యము కిరాతార్జునీయం.

దీనిని పూర్తిగా ఆకలింపు చేసుకుంటే గెలుపు తప్పితే అపజయం ఉండదు. చదివితే రాదండోయ్... దానిపైశ్రధ్ద పెట్టి దాని పూర్తిగా అర్థం చేసుకొని ఆచరణలో పెడితే జయం తప్పకుండా సిద్ధిస్తుంది.

మహాభారతంలో ధర్మరాజుకి ఈ విద్యని బృహదశ్వుడు అనే మహానుభావుడు బోధిస్తాడు.

కానీ అక్కడ ఏ మంత్రాలు చెప్పాడు.... ఆ మంత్రం ఏమిటి మంత్రసిద్ధి ఎలా జరుగుతుంది అనేది మాత్రం వివరణ చెప్పరు.

 ద్రోణుడు ధర్మరాజును బంధించడానికి వెళ్తాడు. బందిస్తే యుద్ధం అయిపోతుంది కదా... ధర్మపక్షపాతి అయిన ద్రోణుడు ధర్మరాజును ఎందుకు బంధించాలని అంటే ధర్మరాజుకి ఒక విషయం తెలుస్తుంది... బంధించి మరల జూదమాడమంటారు.... అంతకంటే ఎక్కువ ఏమీ చేయరు. అక్ష హృదయం అనే విధ్యని నేర్చుకున్న తర్వాత.... శకునిని చాలా తేలికగా ఓడించగలను అని అతను నమ్ముతాడు. మహాభారతంలో ధర్మరాజు పాచికలు ఎప్పుడు విసరలేదు. మొత్తం పాచికలు 20 పందాలు జరిగాయి. 15వ పందెంలో నక్కులుడను 20వ పందెంలో ద్రౌపతిని కోల్పోతాడు ధర్మరాజు. ఈ విద్యను నేర్చుకోవటం ద్వారా శకుని మాయ ధర్మరాజు ముందర పనిచేయదు. అప్పుడు ధర్మరాజు విజయం సాధించగలడు. ఈ విషయాలన్నీ ద్రోణాచార్యులకి తెలిసే ఈ మహాభారతంలో అంత్యమంగా తెలిసిన విషయం

ఇంత చెప్పాను.... ఇందులో జ్యోతిషానికి ఉపయోగపడే విషయం ఏమిటి అంటే.... జూదంలో గెలుపెవరిది అనేది చాలా తేలిగ్గా చెప్పొచ్చు ఈ అక్షహృదయం అనేది తెలిస్తే.... ఇది గాని జనానికి తెలిస్తే... జూదమాడి డబ్బు చేసుకుంటారు. అందుకని ఇది రహస్య విద్యగా ఉండిపోయింది.

 అందుకే ఇది నేను నేర్చుకోదల్చుకున్నాను. జ్యోతిషం కోసం. ఎలక్షన్స్ లో ఎన్ని సీట్లు వస్తాయి... కుక్కుట శాస్త్రం యొక్క రహస్యం ఏమిటి? ఇవిచాలా తేలికగా అర్థమవుతాయి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: