జ్యోతిషం లో సాంకేతిక అంశాలు
జ్యోతిషం లో సాంకేతిక అంశాలు :-
i). సూర్యుడు జ్ఞాని . ధి శక్తి కలవాడు . నవ గ్రహములు లలో బృహస్పతి కూడా ధి శక్తి కలవాడు
శని మంద గ్రహం . మంద గ్రహం యైన శని కి తుల ఉచ్ఛ స్థానము . జ్ఞాని యైన సూర్యుడు కి అది నీచ క్షేత్రం . అలాగే మకరం శని కి స్వక్షేత్రము. జ్ఞాన వంతుడు యైన బృహస్పతి కి నీచ క్షేత్రం .
iii). ఉచ్ఛ స్థానము మరియు నీచ స్థానం వెనుక రహస్యం :-
1. సూర్యుడు మేష రాశి లో ఉచ్ఛ స్థితి. మేష రాశి క్షత్రియ రాశి . సూర్యుడు క్షత్రియ గ్రహం
2. చంద్రుడు వృషభ రాశి లో ఉచ్ఛ స్థితి. వృషభ రాశి వైశ్య రాశి. చంద్రుడు వైశ్య వర్ణగ్రహం
3. గురువు కర్కాటక రాశి లో ఉచ్ఛ స్థితి. కర్కాటకం బ్రాహ్మణ వర్ణం చెందినది . గురువు బ్రాహ్మణ వర్ణ గ్రహం .
4. శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితి . శుక్రుడు బ్రాహ్మణ వర్ణ గ్రహం.
5. బుధుడు , కన్యా రాశి లో ఉచ్ఛ స్థితి. కన్య రాశి వైశ్య వర్ణ రాశి . బుధుడు వైశ్య వర్ణ గ్రహం .
6.శని తుల రాశి లో ఉచ్ఛ స్థితి. తుల రాశి శూద్ర వర్ణ రాశి . శని శూద్ర వర్ణ గ్రహం .
7. కుజుడు , క్షత్రియ గ్రహం . పరిపాలకుడు . భూ తత్త్వ రాశి యైన మకరం లో ఉచ్ఛ స్థితి.
అగ్ని తత్త్వ రాశులు - క్షత్రియ వర్ణ రాశులు . పృథ్వి తత్త్వ రాశులు వైశ్య వర్ణ రాశులు . వాయు తత్త్వ రాశులు శూద్ర వర్ణ రాశులు . ( చాతుర్వర్ణ ములు ) .
iv,). గ్రహములు యొక్క ఆచ్చాదన దృష్టి .
1. సూర్యుడు కి సప్తమ స్థానం పై ఆచ్చాదన దృష్టి కలదు .
2. చంద్రుడు కి నవమ స్థానం పై ఆచ్చాదన దృష్టి కలదు .
3. కుజుడు కి లాభ స్థానం పై ఆచ్చాదన దృష్టి కలదు .
4. బృహస్పతి కి తృతీయ స్థానం పై ఆచ్చాదన దృష్టి కలదు .
5. శుక్రుడు కి పంచమ స్థానం పై ఆచ్చాదన దృష్టి కలదు .
నోట్ :- శని మరియు బుధుడు తాను ఉన్న స్థానం పై ఆచ్చాదన దృష్టి కలదు .
Comments
Post a Comment