పెళ్లి ఆలస్యం కావడానికి కారణాలు
పెళ్లి ఆలస్యం కావడానికి కారణాలు
పెళ్లి ఆలస్యం కావడానికి కారణాలు లో కొన్ని అంశాలు ఇక్కడ అందిస్తున్నాము
1. లగ్నాధిపతి మరియు సప్తమాధిపతి కలిసి లేదా విడివిడిగా 6,8,12 స్థానాల్లో ఉంటే ఆలస్య వివాహం.
2. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నా, అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నా, అష్టమాధిపతి సప్తమంలో ఉన్నా వివాహం ఆలస్యం.
3. సప్తమాధిపతి రాహు, కేతు నక్షత్రాల్లో ఉన్నా వివాహం ఆలస్యం.
4. సహజ సప్తమమైన తులలో నైసర్గిక పాప గ్రహాలుంటే దానికి అనుబంధ రాశులైన కన్య, వృశ్చికాలలో పాప గ్రహాలుంటే వైవాహిక జీవితంలో లోపం.
5. లగ్నం నుండి లేదా చంద్రుడి నుండి సప్తమస్థానాన్ని బలమైన పాప గ్రహాలు చూస్తున్న వివాహం జరుగదు, లేదా ఆలస్యమౌతుంది.
6. శుక్రుడు ఉన్న రాశ్యాధిపతి నీచలో ఉన్నా లేదా 6,8,12 స్థానాల్లో ఉన్నా ఆలస్య వివాహం.
7. శుక్రుడి నుండి సప్తమంలో కుజ, శనులు ఉంటే లేదా కుజ, శనులు పరస్పరం ఎదురెదురుగా ఉంటే ఆలస్య వివాహం.
8. శుక్ర, చంద్ర, గురు, రవి గ్రహాలు నీచలో ఉంటే వివాహం ఆలస్యమౌతుంది.
9 పాపకర్తరీ మధ్యలో గ్రహాలుంటే దోషం, ఆలస్య వివాహం.
10. రవి, శనులు కలిసి సప్తమ స్థానంలో ఉంటే వివాహం ఆలస్యం.
Comments
Post a Comment